పోల్చడం..
మార్కులు, రూపం, ప్రతిభ వంటి ఏ విషయంలోనూ మీ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చని పేరెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా సరైన మార్గంలో ఉన్నట్లే అర్థం. పిల్లల ఎదుగుదల ప్రత్యేకమైనది. వారు మంచి వ్యక్తులుగా ఎదగడానికి ఇతరులతో పోల్చకూడదు.
ప్రేమించడం:
మీరు పిల్లలతో చాలా కఠినంగా మాత్రమే ప్రవర్తించడం మంచిది కాదు. ఒక చిన్న తప్పు తర్వాత పేరెంట్స్ గా మీరు కచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత పిల్లలు మీ దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంటే, మాట్లాడటానికి ప్రయత్నిస్తే వారిని ఆపకుండా వారితో మాట్లాడండి. ఇది పిల్లల ఆత్మగౌరవాన్ని పెంచే మార్గం.