పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలట. ఒకప్పుడు తల్లిదండ్రులు... పిల్లలను కొట్టడం, తిట్టడం లాంటివి చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమే అలా చేస్తున్నారు అని అనుకుంటూ ఉండేవారు. కానీ... ఇప్పుడు అలా కాదు... పిల్లలపై చెయ్యి చేసుకోవడం పెద్ద నేరంగా భావిస్తున్నారు. అలా పిల్లలను కొడుతున్నారు అంటే... వారు పేరెంటింగ్ మిస్టేక్స్ చేస్తున్నారని అర్థమట. అసలు... పిల్లల విషయంలో పేరెంట్స్ చేస్తున్న తప్పులు ఏంటి...? మీరు మంచి పేరెంటా..? లేక టాక్సిక్ పేరెంటా..? ఇప్పుడు తెలుసుకుందాం..
1.అసలు టాక్సిక్ పేరెంట్ అంటే ఎవరు..?
ప్రతి విషయంలో పిల్లలను నెగిటివ్ గా చూసే తల్లిదండ్రులను ఈ కేటగిరిలో వేయవచ్చు. అంటే... తమ పిల్లలు ఏది చేసినా తప్పు అని ఫీలౌతున్నారంటే... మీరు టాక్సిక్ పేరేంట్సే. ప్రతి విషయానికి వారిని కోప్పడటం, తిట్టడం, కొట్టడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే మీరు టాక్సిక్ పేరెంట్స్ అవుతారు.
టాక్సిక్ పేరెంట్ గా ఉండకూడదు అంటే ఏం చేయాలి..?
1. పేరెంట్స్ కూడా మనుషులే. పని ఒత్తిడి కారణంగానే.. ఇంకేదైనా కారణం వల్లనో..తప్పులు చేస్తూ ఉంటాం. కానీ... ఆ తప్పులను సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం. ఆ సమస్యను వెంటనే పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మీరు టాక్సిక్ పేరెంట్స్ కాకుండా ఉండగలరు.
2.చాలా మంది తల్లిదండ్రులు ప్రతి విషయంలో పిల్లలను తిట్టడం, కొట్టడంతో పాటు.... అలా చేయకు, ఇలా చేయకు అని ఆంక్షలు పెట్టడం, బెదిరించడం లాంటివి చేస్తూ ఉంటారట. ఫిజికల్ గానే కాదు నోటితో తిట్టడం కూడా టాక్సిక్ కిందకు వస్తుంది. అది మానేయడం అలవాటు చేసుకోవాలి.
3.చాలా మంది పేరెంట్స్... సెల్ఫ్ సెంటర్డ్ బిహేవియర్ కలిగి ఉంటారు. అంతేకాకుండా.. వారు తమ పిల్లల అవసరాలు, పిల్లలను ఎమోషన్స్ ని పట్టించుకోరు. అలాంటి వారు కూడా టాక్సిక్ పేరెంట్స్ కిందకు వస్తారు.
4. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదు అనే విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే... ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. దాని వల్ల సమస్య వస్తుంది. కానీ... అందరూ పర్ఫెక్ట్ కాదు అని తెలుసుకొని.. పిల్లలను పిల్లల్లా చూడటం అలవాటు చేసుకోవాలి. అంతేకానీ... వారు పర్ఫెక్ట్ గా లేరని వారిని క్రిటిసైజ్ చేయడం, విమర్శించడం లాంటివి చేస్తే... మీరు టాక్సిక్ పేరెంట్ అవుతారు.
5.చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు తాము చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా ఫాలో అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. వారు చెప్పింది వినకపోతే పిల్లలపై కోపం చూపిస్తూ ఉంటారు. ఇలా చేయడం కూడా టాక్సిక్ పేరెంటింగ్ కిందకే వస్తుంది. మీరు చెప్పింది మాత్రమే కాదు... వారు కొత్తగా నేర్చుకునే అవకాశం కూడా ఇవ్వాలి.
6.ఇక కొందరు తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఏదైనా అల్లరి చేసినా... చెప్పింది వినకపోయినా.. నువ్వంటే నాకు ఇష్టం లేదు.. ఐ హేట్ యూ లాంటి మాటలు చెబుతూ ఉంటారు. దాని వల్ల పిల్లల మనసు విరిగిపోతుందట. ఇవి కూడా టాక్సిక్ పేరింటింగ్ కిందకే వస్తాయి. అందుకే అలాంటివి చెప్పకూడదు.
7.ఇక కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతి చాయిస్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. వారు నిర్ణయాలు, వారు కోరుకున్నది.. ఇలా ప్రతిదీ కంట్రోల్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇది కూడా టాక్సిక్ పేరెంటింగ్ కిందకే వస్తుంది. కాబట్టి... అలా చేయడం మానేయడం ఉత్తమం.