పెళ్లైన దంపతులు అందరూ సంతానం కోరుకుంటారు. ఇంట్లో పిల్లలు పుట్టగానే చాలా సంతోషిస్తారు. ఇక.. వారు పుట్టిన దగ్గర నుంచి వారికి ఏం కొనివ్వాలి.. ఏ ఫుడ్ పెట్టాలి.? ఏం చదివించాలి ఇలా చాలా ఆలోచించేస్తూ ఉంటారు. ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలోనూ తమ పిల్లల గురించే ఆలోచిస్తారు. కానీ.. ఆ పనిలో పడి.. పిల్లలతో సమయం గడపాలి అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. తాము సంపాదించేది తమ పిల్లల కోసం కాదా అని అంటూ ఉంటారు. కానీ.. మీరు సంపాదించే డబ్బు మీ పిల్లలకు ఎంత ముఖ్యమో.. వీరు వారితో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం కూడా అంతే ముఖ్యం. అసలు పేరెంట్స్ తమ పిల్లలతో సమయం ఎందుకు గడపాలో ఓసారి చూద్దాం...
చాలా మంది పేరెంట్స్ తాము ఖాళీగా ఉండట్లేదని..ఆఫీసులో పనితోనే సరిపోతోందని... ఇక పిల్లలతో గడిపే టైమ్ ఎక్కడ ఉంటుంది అని అంటూ ఉంటారు. హాలీడే ఒక్కరోజు రెస్ట్ తీసుకోవడానికే సరిపోతుందని అంటూ ఉంటారు. కానీ.. ప్రతిరోజూ వీలు చూసుకొనైనా కనీసం అరగంట నుంచి గంట వరకు వారితో గడిపి.. వారితో ప్రేమగా మాట్లాడి, కాసేపు అయినా ఆడుకోవాలట.
పిల్లలతో మనం క్వాలిటీ టైమ్ గడపడం వల్ల.. వారికీ , పేరెంట్స్ కి మధ్య స్ట్రాంగ్ ఎమోషన్ బలపడుతుంది. పిల్లల్లో పేరెంట్స్ పట్ల ఎమోషన్ బలంగా ఉండటం చాలా అవసరం. అది మనం చిన్నతనంలో వారితో గడిపే సమయంమీదే ఆధారపడి ఉంటుంది.
పిల్లలతో కాసేపు సమయం గడపడం వల్ల, వారితో మాట్లాడటం వల్ల వారిలో గ్రౌండ్ వర్క్ చాలా సేఫ్ గా ఉంటుంది. అంతేకాదు.. పిల్లల ఎమోషనల్ గా ఆరోగ్యంగా జీవితాంతం ఉంటారట. అది వారికి చాలా ఎక్కువగా సహయపడుతుందట.
అంతేకాదు.. పిల్లలతో సమయం గడిపడం వల్ల.. వారిలో మీకు తెలీకుండానే సెల్ఫ్ కాన్షిడెన్స్ పెరగడానికి సహాయపడుతుందట. ఏ పని అయినా తాము చేయగలం అని, ఇతరుల మీద ఆధారపడకుండా ఉండేలా సహాయపడుతుందట
అంతేకాదు.. పిల్లలతో పేరెంట్స్ క్వాలిటీ టైమ్ గడపడం వల్ల.. ఆ పిల్లల్లో కమ్యూనికేషన్స్ బలపడతాయట. మిగిలిన పిల్లలతో పోలిస్తే. వీరిలో కమ్యూనికేషన్స్ బలంగా ఉంటాయట. అంటే... మీరు వారితో సమయం గడపే సమయంలో.. వారు చెప్పే మాటలన్నీ ఓపికగా వినాలట. అప్పుడే వారిలోని కమ్యూనికేషన్ స్కిల్స్ బలపడతాయి.
పిల్లలలతో పేరెంట్స్ సమయం ఎక్కువగా గడపడం వల్ల... వారిలో కాన్ఫిడెన్స్ ఎక్కువగా పెరుగుతుందట. వారిపై వారికి నమ్మకం పెరుగుతుందట. వారిలోని ఐడియాలు, ఎమోషన్స్, ఎక్స్ పీరియన్స్ లు అన్నీ.. తమ పేరెంట్స్ తో పంచుకోవడానికి సహాయపడుతుందట.
అంతేకాదు.. పేరెంట్స్ తో సమయం గడపడం వల్ల ... పిల్లలలో మోరల్ వ్యాలూస్ పెరుగుతూ ఉంటాయట. పిల్లలు చెప్పే కథలు వినడం వల్ల.. వారిలో స్టోరీ టెల్లింగ్ క్రియేటివిటీ పెరుగుతుందట. ఒక మంచి బిహేవియర్ అలవాటు అవుతుందట. అదొక్కటే కాదు.. అటెన్షన్ సీకింగ్ క్వాలిటీ, బిహేవియర్ కూడా నేర్చుకుంటారట.