పేరెంట్స్.. పిల్లలు మీ మాట వినడం లేదా..? కారణం ఇదే..!

First Published | Feb 17, 2024, 12:04 PM IST

మాట వినకపోవడానికి కూడా కారణాలు ఉంటాయా అంటే.. కచ్చితంగా ఉంటాయని నిపుణులు అంటారు. మరి వారు ఏ కారణం చేత మీ మాట వినకుండా తయారౌతున్నారో తెలుసుకోండి..
 

parents

తమ పిల్లలు చెప్పిన మాట వింటే ఎంత బాగుంటుందో అని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. కానీ.. అసలు చెప్పిన మాట వింటే వాళ్లు పిల్లలు ఎందుకు అవుతారు..? చెప్పాలంటే చాలా కొద్ది మంది పిల్లలు మాత్రమే.. పేరెంట్స్ ఏది చెబితే అది చేస్తారు. ఈ కాలంలో అయితే అలాంటి పిల్లలు మరీ అరుదు అయిపోయారనే చెప్పొచ్చు. వాళ్లు ఆడుకునే బొమ్మ దగ్గర నుంచి చదువు, వేసుకునే డ్రెస్ వరకు అన్నీ తమకు నచ్చినట్లే ఉండాలని పట్టుపడుతూ ఉంటారు. దీంతో.. పేరెంట్స్ మా పిల్లలు అస్సలు మా మాట వినడం లేదు అని తెగ బాధపడిపోతూ ఉంటారు. కానీ.. వాళ్లు అలా అసలు మాట వినకుండా తయారవ్వడానికి కారణం ఏంటి అని ఆలోచించరు. మాట వినకపోవడానికి కూడా కారణాలు ఉంటాయా అంటే.. కచ్చితంగా ఉంటాయని నిపుణులు అంటారు. మరి వారు ఏ కారణం చేత మీ మాట వినకుండా తయారౌతున్నారో తెలుసుకోండి..

1.మీరు మీ పిల్లల మీద చాలా అంచనాలు పెట్టుకొని ఉండొచ్చు. మీ అంచనాలుు వారికి అర్థం కాకపోతే వాళ్లు మాత్రం ఏం చేస్తారు. అవును మీరు మీ పిల్లల నుంచి ఏం ఆశిస్తున్నారు అనే విషయం వారికి క్లియర్ గా తెలియజేస్తున్నారా? మీ మధ్య కమ్యూనికేషన్ సరిగా లేకపోతే.. పిల్లలు మీ మాట వినడం లేదు అనే భావన మీలో పెరుగుతుంది. కాబట్టి.. ముందు మీరు ఏం అనుకుంటున్నారనే విషయాన్ని వారితో క్లియర్ గా తెలియజేయాలి.


2.చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలకు కఠినమైన రూల్స్ పెడుతూ ఉంటారు. అలా చేయద్దు.. ఇలా చేయద్దు.. అక్కడ కూర్చో.. ఇది ముట్టుకోకు ఇలా చాలా రూల్స్ పెట్టడం వల్ల.. వారికి వాటిని పాటించడం కష్టంగా అనిపించొచ్చు. ఫలితంగా చిరాకుతో ఆ పనులు చేయడం ఆపేస్తారు. మనకు మాత్రం మన మాట వినడం లేదు అని అనిపిస్తూ ఉంటుంది.
 

3.కొందరు పేరెంట్స్ తమ పిల్లలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని బయటపెట్టనివ్వరు. ఎంత సేపటికి వారు చెప్పే కమాండ్స్ ఫాలో అవ్వాలని ఒత్తిడి చేస్తూ ఉంటారు. దీని వల్ల కూడా వాళ్లు మాట వినకుండా తయారయ్యే అవకాశం ఉంది.


4.ఇక కొందరు పిల్లలకు అందరి దృష్టి ఆకర్షించాలనే కోరిక ఉంటుంది. దాని కారణంగా.. వారు పేరెంట్స్ చెప్పే మాట వినరు. ముఖ్యంగా ఎక్కువ మంది ఉన్నప్పుడు మరీ ఉత్సాహంగా,. చెప్పింది చెవికి ఎక్కించుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.

5.పేరెంట్స్ అందరూ తమ పిల్లల జీవితం సంతోషంగా ఉండాలనే అనుకుంటారు దానికోసం అహర్నిశలు కష్టపడతారు. అయితే... ఆ కష్టంలో పడి పిల్లలతో క్వాలిటీ సమయం గడపరు. దీంతో.. మీతో వారికి ఎటాచ్మెంట్ తగ్గిపోతుంది. ఫలితంగా మీ మాట వినాలనే కోరిక వారిలో ఉండదు.
 

6.చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలను ఘోరంగా తిడుతూ ఉంటారు. తమపై తమ పేరెంట్స్ కి రెస్పెక్ట్ లేదు అని, ఊరికే తిడుతూ ఉంటారు అనిపించినప్పుడు వారిలో గౌరవం తగ్గుతుంది. దాని వల్ల కూడా మాట వినకుండా ఉంటారు.
 

7.ఇక, పిల్లలకు చాలా కోరికలు ఉంటాయి. ఏవేవో తినాలని, ఏవేవో కొనుక్కోవాలని, చేయాలని ఉంటుంది. ఆ కోరికలను తమ పేరెంట్స్ తీర్చడం లేదు అనే భావన వారిలో కలిగినప్పుడు కూడా  మాట వినడానికి ఇష్టపడరు.

మరి వేటి కారణం చేత మీ పిల్లలు మీ మాట వినడం లేదో తెలుసుకోండి. మానసికంగా ఒత్తిడి పెరిగిపోవడం వల్ల కొందరు మాట వినకుండా తయారౌతారు. కాబట్టి.. ముందు కారణం తెలుసుకొని, దానిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తే.. అప్పుడు మీ పిల్లలు మీ మాట వింటారు.

Latest Videos

click me!