పిల్లలు స్కూలు నుంచి రాగానే తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా?

First Published | Jul 9, 2024, 12:44 PM IST

పిల్లలు స్కూలు నుంచి రాగానే.. షూస్ విప్పు, మొహం కడుగు, డ్రెస్ మార్చుకో.. లాంటి మాటలు ప్రతి తల్లిదండ్రులు చెప్తారు. ఇలా చాలా కామన్. కానీ వీటితో పాటుగా  పిల్లలు స్కూల్ నుంచి రాగానే తల్లిదండ్రులు అడగాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే? 
 

స్కూల్ నుంచి పిల్లలు రాగానే వారికి కావాల్సినవన్నీ ఇస్తారు. గారాభం చేస్తారు. అలాగే వారి అలసటను పోగొట్టడానికి వారికి ఎంతో ఇష్టమైన ఫుడ్స్ ను కూడా చేసిపెడుతుంటారు. అలాగే కాసేపు నిద్రపోమని చెప్తుంటారు. ఇలా చేప్పేవారే మంచి పేరెంట్స్ అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే కొన్ని ప్రశ్నలు అడగాలి. ఎందుకంటే ఇవి మీ పిల్లల్ని సంతోషపెట్టడానికి, భవిష్యత్తుకు సహాయపడతాయి. ఇంతకీ పిల్లల్ని ఏం అడగాలో తెలుసా? 

టిఫిన్ కు సంబంధించిన ప్రశ్న.. 

మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ముందుగా ఈ రోజు మీరు పెట్టిన టిఫిన్ బాక్స్ వాళ్లకు నచ్చిందో? లేదో? అడగండి. అలాగే ఈ రోజు స్కూల్ లో తోటి పిల్లలు ఏం స్పెషల్ తీసుకొచ్చారు? వాళ్ల లాగ మీకు ఏదైనా వెరైటీ కావాలో తెలుసుకోండి. మీ పిల్లల్ని ఇలా అడగం వల్ల మీ పిల్లల ఫ్రెండ్స్ ఎలాంటి ఆహారాలను తింటున్నారో తెలుసుకోవచ్చు. ఇది మీకు మీ పిల్లలకు  ఇష్టమైన ఫుడ్ ను చేయడానికి సహాయపడుతుంది. 
 


స్నేహితులకు సంబంధించిన ప్రశ్నలు..

తల్లిదండ్రులుగా.. మీ పిల్లల ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ పిల్లలు ఎలాంటి పిల్లలతో ఫ్రెండ్ షిప్ చేశారు? పిల్లల ఫ్రెండ్స్ ఎక్కడ నివసిస్తున్నారు? అలాగే వాళ్ల తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసుకోవడం చాలా అవసరం. దీనివల్ల మీ పిల్లల ప్రవర్తణ ఆధారపడుతుంది కాబట్టి మీరు ఈ ప్రశ్నలు అడగొచ్చు. 
 

ప్రశంసల గురించి.. 

పిల్లలు ఇంటికి రాగానే చేయడానికి ఇష్టపడే మొదటి పని స్కూల్ లో టీచర్ తనను మెచ్చుకున్న విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పాలనుకోవడం. కానీ మీ పిల్లలు వారికి వారే చెప్పకుండా.. అంతకంటే ముందే వారినే మీరు అడగండి. ఇది మీ పిల్లల్ని మరింత సంతోషపెడుతుంది. చాలా మంది తల్లిందండ్రులు పనిలో పడి పిల్లలు మాట్లాడేది అస్సలు పట్టించుకోరు. అంటే ఏదో ఒక పని చేస్తూ పిల్లలు చేప్పేది వినడం మానేస్తే పిల్లలు మీతో ఏ విషయాన్ని షేర్ చేసుకోరు. అందుకే పిల్లలకు స్కూల్ లో జరిగిన మంచి క్షణం గురించి అడగండి.మీరు కూడా వారిని పొగడండి. 
 

హోంవర్క్ కు సంబంధిత ప్రశ్న

మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే టీచర్స్ ఇచ్చిన హోం వర్క్ గురించి వారిని అడగండి. దీనివల్ల మీరు వాళ్లకు హోం వర్క్ గురించి గుర్తిచేసినట్టు అవుతుంది. దీంతో వారు వెంటనే హోం వర్క్ కంప్లీట్ చేస్తారు. 

ప్రేమగా దగ్గరకు తీసుకోండి..

మీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే.. వారిని ముందుగా ప్రేమగా కౌగిలించుకోండి. ఇలా చేయడం వల్ల మీ బిడ్డకు మంచి అనుభూతి కలుగుతుంది. అలాగే హ్యాపీగా కూడా ఫీలవుతారు. తమ తల్లిదండ్రులు తమను ఎంతగానో ప్రేమిస్తున్నారనే నమ్మకం వారికి కలుగుతుంది. 

Latest Videos

click me!