పిల్లలు మీ మాట వినకపోతే ఏం చేయాలో తెలుసా?

First Published | Jul 7, 2024, 10:08 AM IST

చిన్న పిల్లలే కాదు టీనేజ్ పిల్లలు కూడా మొండిగా తయారవుతారు. తల్లిదండ్రుల మాట అస్సలు లెక్క చేయరు. వారు ఏది చెప్పినా వినరు. మరి ఇలాంటి పిల్లలు మాట వినాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

మారుతున్న కాలం వ్యక్తి జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను మార్చేసింది. అంతేకాదు ఇప్పుడు పిల్లలను పెంచే విధానం కూడా మునపటితో పోలిస్తే చాలా మారిపోయింది. కానీ ఈ పెంపకం వల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేటి కాలంలో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారిపోయింది. చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలతో మొండిగా ఉన్నారని, చెప్పిన మాట వినడం లేదని ఇతరులకు చెప్పుకుని వాపోతుంటారు. తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పుల వల్ల కూడా పిల్లలు మొండిగా మారుతారని నిపుణులు అంటున్నారు. ఒక పరిశోధనలో టీనేజ్ పిల్లలే తల్లిదండ్రుల మాట వినడం లేదని తేలింది. కానీ తల్లిదండ్రులపై పిల్లలునమ్మకాన్ని కోల్పోయినప్పుడే ఇలా చేస్తారట. ఇంకేముంది ఇలాంటి పిల్లలు తల్లిదండ్రుల మాట లెక్కే చేయడు. మరి తల్లిదండ్రులు చేసే ఏ తప్పుల వల్ల పిల్లలు నమ్మకాన్ని కోల్పోతారు? పిల్లలు మాట వినాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

తిట్టే బదులు ప్రేమతో వివరించండి..

పిల్లలు మాట వినడం లేదని, మొండిగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులు చేసే మొదటి పని నానా మాటలు తిట్టడం. కానీ ప్రతి చిన్న విషయానికి మీ పిల్లల్ని తిట్టే అలవాటు మానుకోండి. మీకు తెలుసా?  పిల్లలను అతిగా తిడితే వారు మొండిగా మారుతారు. అందుకే మీ పిల్లల్ని కాసేపు ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వండి. కొద్దిసేపటి తర్వాత వాళ్లే ఆ పనిని చేయడం ఆపేస్తారు. మీరు తిట్టారని ఆ పనిని ఎక్కువ చేసే అవకాశం ఉంది. పిల్లలు ఏదైనా పట్టుబట్టినట్టైతే వారిని తిట్టడానికి బదులుగా ప్రేమతో దాని గురించి వివరించండి.
 


గట్టిగా మాట్లాడటం..

పిల్లలతో ఎప్పుడూ కూడా పెద్ద గొంతే వేసుకుని మాట్లాడకూడదు. కానీ చాలా మంది ఇదే పని చేస్తారు. చేయకూడని పని చేసినప్పుడు ఊరంతా వినేలా తిడుతుంటారు. కానీ మీరు పదేపదే చేయడం వల్ల వారికి  మీరంటే భయం కలుగుతుంది. మీ పిల్లలు ఏదైన విషయం గురించి కోపంగా ఉంటే.. ముందుగా అతని కోపాన్ని తగ్గించండి. ఆ తర్వాత అలా ఉండటానికి కారణమేంటో అడగండి. దీని మీ పిల్లలు చిరాకు పడరు. అలాగే అన్ని విషయాలను మీతో చెప్పుకుంటారు. 
 

తెలివిగా మాట్లాడండి 

పిల్లలతో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మీరు తప్పుడు పదాలను ఉపయోగిస్తే వారు మీకు దూరంగా ఉంటారు.అలాగే ఈ పదాలను వాళ్లు కూడా నేర్చుకునే అవకాశం ఉంది. మీరు మాట్లాడే సానుకూల పదాలు మీ పిల్లలు ఆత్మవిశ్వాసంతో, సంతోషంగా, అందరిలో మంచిగా ప్రవర్తించడానికి సహాయపడతాయి. అందుకే వారితో మాట్లాడేటప్పుడు చెడు పదాలను ఉపయోగించకూడదు. 

మర్యాద నేర్పాలి

పిల్లలకు మర్యాద ఖచ్చితంగా నేర్పాలి. అంటే దయచేసి, ధన్యవాదాలు వంటి రోజువారీ జీవితంలో పనికి వచ్చే కొన్ని ప్రాథమిక మర్యాద విషయాలను పిల్లలకు నేర్పండి. మీ దైనందిన జీవితంలో మీరు కూడా ఈ పదాలను ఉపయోగించండి. మీరు ఏం మాట్లాడినా లేదా మీరేం చేసినా పిల్లలు కూడా మీ నుంచి అదే నేర్చుకుంటారు. అలాగే ప్రవర్తిస్తారు. 

Latest Videos

click me!