తమ పిల్లల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలని కూడా అనుకుంటారు. అయితే, ఇవి మాత్రమే కాదు.. ఉదయాన్నే మనం కొన్ని పనులను పిల్లలతో చేయించాలట. ఆ పనుల వల్ల పిల్లల భవిష్యత్తు చాలా అందంగా మారుతుందట. మరి ఆ పనులేంటో ఓసారి చూద్దాం...
పిల్లలకు ఉదయం చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఉదయం చేసే పనులే.. రోజంతా మన మూడ్ ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి.. ఉదయం పూట మనం వాళ్లతో ప్రవర్తించే తీరు సైతం చాలా మంచిగా ఉండాలి. మనం ఉదయాన్నే వాళ్ల మూడ్ స్పాయిల్ చేస్తే.. అది వారి పూర్తి డే పై ఎఫెక్ట్ చూపిస్తుంది.
ఎవరికైనా ఉదయం పాజిటివ్ గా మొదలవ్వాలి. అది చాలా మంచి చేస్తుంది. పిల్లల విషయంలోనూ అలానే ఉండేలా చూసుకోవాలి. వారిని ఉదయం పూట మనం ఎంకరేజ్ చేయాలి. పిల్లల్లో పాజిటివ్ మైండ్ సెట్ నింపేలా చూడాల్సిన బాధ్యత పేరెంట్స్ దే.
Parenting
అంతేకాదు పిల్లలకు ఉదయాన్నే కొన్ని పనులు కూడా నేర్పించాలి. ముఖ్యంగా శుభ్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రష్ చేసుకోవడం దగ్గర నుంచి హైజీన్ కి సంబంధించిన అలవాట్లు నేర్పించాలి. అవన్నీ ఉదయం పూట కచ్చితంగా చేయాల్సిన పనులని వారికి అర్థమవ్వాలి.
చిన్న తనం నుంచే వారికి మైండ్ ఫ్రెష్ గా ఉండేలా అలవాటు చేయాలి. దానికోసం వారిని మీరు బ్రీతింగ్ తీసుకోమని అడగొచ్చు. ఉదయాన్నే కాసేపు వాకింగ్ చేసి ఫ్రెష్ ఎయిర్ ని ఆస్వాదించవచ్చు. దీని వల్ల పాజిటివ్ మైండ్ వారికి వస్తుంది.
పిల్లలు ఏ విషయం అయినా మన నుంచే నేర్చుకుంటారు. మనం చేసే పనులను వారు కాపీ చేయాలని అనుకుంటూ ఉంటారు. కాబట్టి.. ఏదైనా మంచి అలవాటు వారికి నేర్పించాలి అంటే.. ముందు దానిని మనం చేసి చూపించాలి. దానికోసం వారితో కలిసి మీరు కూడా చిన్నపాటి యోగాసనలు వేయాలి. ఇది వారికి కూడా అలవాటు అవుతుంది. వారి ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది.
ఉదయం లేవగానే.. వారు పడుకున్న బెడ్ ని ఎలా నీట్ గా పెట్టాలో కూడా మనం వారికి నేర్పించాలి. ప్రతిరోజూ చేయడం వల్ల అది వారికి పెద్దయ్యాక మంచి అలవాటుగా మారుతుంది. ప్రతిరోజూ వారికి ఒక మార్నింగ్ రొటీన్ అలవాటు అయ్యేలా చేయాలి.