పేరెంట్స్... ఈ విషయాల్లో పిల్లలను ఎందుకు అర్థం చేసుకోరు.?

First Published | Dec 29, 2023, 11:44 AM IST

పిల్లలు తమ ఆలోచనలను, ఎమోషన్స్ తో ధైర్యంగా మీతో పంచుకునే స్వాతంత్ర్యం మీరు వారికి ఇవ్వాలి.  వారి ఆలోచనలను ప్రతిసారీ మీ దృష్టితో కాకుండా, వారి దృష్టితో కూడా ఆలోచించడం మొదలుపెట్టాలి.

ప్రతి పేరెంట్.. తమ పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. జీవితంలో తాము పడిన కష్టం.. తమ పిల్లలు పడకూడదు అనే అనుకుంటారు. దాని కోసం వాళ్లు తమ ఇష్టాలను కూడా చంపుకుంటారు. పిల్లల భవిష్యత్తు బంగారు మయం చేసేందుకు వారు ఎంత కష్టమైనా పడతారు. మంచి చదువు, తిండి ఇలా అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. పిల్లలకు కోసం ఇంత చేసే పేరెంట్స్.. కొన్ని విషయాల్లో మాత్రం వాళ్లను అర్థం చేసుకోలేకపోతున్నారట. అసలు ఏ విషయంలో పిల్లలను తమ తల్లిదండ్రులు అర్థం చేసుకోరో మనమూ ఓసారి చూద్దాం..
 

1.చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలు ఇలానే ఉండాలి, అలానే ఉండాలి అనే బౌండరీలు గీస్తూ , అందులోనే బతకాలని సూచిస్తూ ఉంటారు. కానీ, పిల్లలు ఎదిగే క్రమంలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ని చాలా మంది పేరెంట్స్ అర్థం చేసుకోరు. మనం సరిగానే పెంచుతున్నాం కదా, వీడెందుకు మనం చెబుతున్నట్లు లేడు? మనం కోరుకున్నట్లు లేడు అని బాధపడతారు. దానికి బదులుగా, మీరు కూడా వారి ఎమోషన్స్ ని అర్థం చేసుకోగలగాలి. పిల్లలు తమ ఆలోచనలను, ఎమోషన్స్ తో ధైర్యంగా మీతో పంచుకునే స్వాతంత్ర్యం మీరు వారికి ఇవ్వాలి.  వారి ఆలోచనలను ప్రతిసారీ మీ దృష్టితో కాకుండా, వారి దృష్టితో కూడా ఆలోచించడం మొదలుపెట్టాలి.
 


2.పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి అనే ప్రేమ పేరెంట్స్ కి ఉంటుంది. తప్పు లేదు. కానీ.. కొంత ఎదిగిన తర్వాత పిల్లలు తమకు తాము స్వతంత్రం కోరుకుంటారు. తమకు తాము ఇండిపెండెంట్ గా ఉండాలని అనుకుంటారు. దానిని చాలా మంది పేరెంట్స్ అర్థం చేసుకోలేరు. పిల్లలకు స్వతంత్రంగా ఉండమని వదిలేస్తే తప్పులు చేస్తారేమో అని భయపడతారు. అలా అని వారికంటూ కొన్ని లిమిటేషన్స్ పెట్టే విషయంలోనూ తికమకపడుతూ ఉంటారు. వారు నిజంగా ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకున్నప్పుడు వెంటనే నో చెప్పకుండా.. వారికి ఒక అవకాశం ఇస్తూనే, మీరు వారిని గమనిస్తూ ఉండాలి.
 

3.మన చేతికి ఉన్న ఐదు వేళ్లు ఎంత భిన్నంగా ఉన్నాయో.. ప్రతి పిల్లవాడు భిన్నంగానే ఉంటాడు. అందరిలా తమ పిల్లవాడు ఉండాలని చాలా మంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు.కానీ, మీ పిల్లవాడిలో ఉన్న డిఫరెంట్ యూనిక్ క్వాలిటీనీ మీరు గుర్తించడం మర్చిపోతూ ఉంటారు. అలా కాకుండా. మీ పిల్లల్లో ఉన్న యునిక్ క్వాలిటీని గుర్తించి.. దానిని వారి భవిష్యత్తుకు ఎలా ఉపయోగించుకునేలా మలుచుకోవాలో మీరే నేర్పించాలి.
 

4.ఈ మధ్యకాలంలో చాలా మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారు. తామే కాదు, తమ పిల్లలను కూడా సోషల్ మీడియాకు దగ్గర చేస్తున్నారు. కానీ, విషయంలో పేరెంట్స్ చాలా అలర్ట్ గా ఉండాలి. పిల్లలను వీలైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి. ఇది భవిష్యత్తులో పిల్లలపై చాలా ప్రభావం చూపిస్తుంది.
 

5.చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలు చదువు, విజ్నానం పెంచుకోవడంలో వెనకపడిపోయి ఉన్నారని బాధపడుతూ ఉంటారు. పక్కన పిల్లలను చూపిస్తూ కంపేర్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా.. పిల్లలు అందరూ ఒకేలా ఉండరని, టీచింగ్ విధానం కూడా ఒకరికి సెట్ అయినట్లు.. ఇంకొకరికి సెట్ కాదని అర్థం చేసుకోవాలి. ఒక విధంగా అర్థం చేసుకోలేకపోతే.. మరో విధంగా నేర్పించడానికి ప్రయత్నించాలి. అంతేకానీ, పిల్లలకు చదువు రాదు అని మీకు మీరే డిసైడ్ అయిపోకూడదు.
 

6.చాలా మంది ఒత్తిడి పెద్దలకు మాత్రమే ఉంటుంది అనుకుంటారు. కానీ, పిల్లల్లోనూ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుందట. కాకపోతే.. వారిలో మనకు ఒత్తిడి ఉందనే విషయం తొందరగా అర్థం కాదు. అయినా సరే.. మనం పిల్లలకు ఈ విషయంలో పేరెంట్స్ అండగా నిలవాలి. వారికి మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఎదైనా ఒత్తిడి వారిపై ఉందా? ఏ విషయంలో అయినా బాధపడుతున్నారా అనేది కూడా తెలుసుకోవాలి.
 

parents


7.పిల్లల ఆలోచనా విధానం వారు పెరిగే కొద్దీ మారుతూ ఉంటుంది. దానిని బట్టి మీరు కూడా ఆలోచించాలి. అంతేకానీ స్టెబిలిటీ లేదని తిట్టకూడదు. ఇక, మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. వారితో కనీసం 30 నిమిషాలైనా మీరు కూర్చొని అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి.

Latest Videos

click me!