4.ఈరోజు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నావా..? ఈ ప్రశ్న మీరు ప్రతిరోజూ అడుగుతూ ఉండాలి. దానివల్ల.. మీకు సమాధానం చెప్పడానికైనా వారు కొత్త విషయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్లకు తెలీకుండానే..కొత్త విషయాలు నేర్చుకోవడం పై దృష్టి పెడతారు.
5.ఈరోజు నువ్వు ఎవరికైనా సహాయం చేశావా? చేస్తే ఎలాంటి సహాయం అడిగి తెలుసుకోండి. మనం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి అనే గుణం పిల్లల్లో పెంచడానికి ఈ ప్రశ్న కొంత వరకైనా సహాయం చేస్తుంది.
6. ఈ రోజు ఏదైనా విషయం నిన్ను బాగా సంతోషపెట్టిందా..? నవ్వించిందా..? ఇలాంటి ప్రశ్నలు కూడా వేసి చూడండి. వీటికి సమాధానం చెప్పేటప్పుడు వారి ముఖంపై మరోసారి మీరు చిరు నవ్వు చూడొచ్చు. వారి సంతోషాన్ని మీతో పంచుకునే అవకాశం మీరు వారికి ఈ ప్రశ్న ద్వారా ఇవ్వగలరు.
7.కొంచెం పెద్ద పిల్లలు అయితే.. మీ మనసులో ఏమైనా ఉందా? నువ్వు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా? ఇలాంటి ప్రశ్నలు వేయవచ్చు. కొందరు పిల్లలు తాము అడగాలి అనుకునేవి కూడా భయంతోనో, ఇంకేదైనా కారణం చేతనో చెప్పకుండా ఆగిపోతారు. మీరు అడగడం వల్ల వారి మనసులోని విషయాన్ని బయట పెట్టే అవకాశం ఉంటుంది.