తల్లిదండ్రుల నుంచి పిల్లలు కోరుకునేది ఇదే..!

First Published Feb 4, 2024, 10:38 AM IST

తల్లిదండ్రులు తమ పిల్లల కోరికలను నెరవేర్చడానికి ఎన్నో చేస్తుంటారు. అయితే పిల్లల ఆలోచనలను అర్థం చేసుకోవడం చాలా మంది పేరెంట్స్ కు కష్టంగా ఉంటుంది. అసలు వాళ్లకు ఏం కావాలి? తల్లిదండ్రుల నుంచి వాళ్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోలేకపోతుంటారు. అందుకే ఈ ఆర్టికల్ ద్వారా ఏ ఏజ్ పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఏ కోరుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం..
 


పిల్లలందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ప్రతి పిల్లవాడు తన స్వంత ప్రవర్తనను కలిగి ఉంటారు. అంటే అందరు పిల్లలు ఒకేలా ప్రవర్తించరన్న మాట. తల్లిదండ్రులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. చాలా మంది పేరెంట్స్ వేరేవాళ్ల పిల్లలను చూసి మా పిల్లలు ఇలా ఎందుకు లేరు? ఇలా ఎందుకు చదవడం లేదు? ఇలా ఎందుకు ప్రవర్తించడం లేదని ఆందోళన చెందుతుంటారు. కానీ కొంతమంది పిల్లలు కొంచెం లేట్ గా అన్ని విషయాలను తెలుసుకుంటారు. అందుకే మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ వారి ప్రవర్తన, అభివృద్ధిపై ఓ కన్నేసి ఉంచాలి. ఏదైనా సందేహం ఉంటే వెంటనే హాస్పటల్ కు తీసుకెళ్లండి. 
 

అయితే చాలా మంది తల్లిదండ్రులకు పిల్లలను అర్థం చేసుకోవడం రాదు. అంటే వీరికి నచ్చినట్టుగానే పిల్లలతో ఉంటారు. కానీ ఏజ్ ను బట్టి పిల్లలు తల్లిదండ్రుల నుంచి కొన్ని కోరుకుంటారు. ఆశిస్తారు. అందుకే మీ పిల్లల వయస్సును బట్టి, వారి కొన్ని సాధారణ ప్రవర్తనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొదటిసారి తల్లిదండ్రులుగా అయితే మీ పిల్లల వయసును బట్టి వారిని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

రెండేళ్ల పిల్లలు..

తల్లింద్రుడులు తమను ప్రేమించాలని కోరుకుంటారు.
తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలనుకుంటారు.
వారికి కొంచెం స్వేచ్ఛ కావాలనుకుంటారు.
వీళ్లు మీకు బాస్ గా, డిమాండ్ గా కూడా ఉండొచ్చు.
 

ప్రతిదీ తీసుకొని ఇది మా సొంతం అనుకునే అలవాటుంటుంది. 
తల్లిదండ్రులు తమను వదిలి ఎక్కడికైనా వెళితే ఏడుస్తారు. 
ఈ వయసు పిల్లలకు తల్లిదండ్రులతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది
ఇతరుల భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు.

3 సంవత్సరాల పిల్లలు..

ఈ పిల్లలు ఫుల్ ఎనర్టిటిక్ గా ఉంటారు. 
వీళ్లకు మరింత స్వేచ్ఛ కావాలి.
ఈ పిల్లలు కొత్త స్నేహితులను ఏర్పరుచుకుంటారు. సామాజికంగా మారడం ప్రారంభిస్తారు.
ఈ వయసు పిల్లలకు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఇష్టం ఉంటుంది. 

ఈ వయస్సులో  పిల్లలు ఎక్కువ ప్రశ్నలు వేస్తారు. ఇది ఎందుకు ఇలా అని ప్రతీది ఆరా తీస్తారు. 
వారు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ప్రారంభిస్తారు. కానీ 3 సంవత్సరాల పిల్లలందరూ ఇలాగే ప్రవర్తించకపోవచ్చు. 
ఇక ఈ పిల్లలు తమ టాలెంట్ ను చూపించే పనిలో ఉంటారు. 
 

4 సంవత్సరాల పిల్లలు..

ఈ పిల్లల శారీరకంగా చాలా చురుకుగా ఉంటారు.
ఎందుకు, దేనితో మొదలయ్యే ప్రశ్నలు చాలానే ఈ పిల్లలకు ఎక్కువగా కలుగుతాయి. 
డ్రాయింగ్స్ వేయడంపూ ఆసక్తి ఉంటుంది.
బేసిక్స్ చదవడం, రాయడం ప్రారంభిస్తారు.
ఆత్రుతతో.. వాళ్లే ఎన్నో పనులు చేయడానికి ప్రయత్నిస్తారు, వాటిలో కొన్ని ప్రాణాంతకం కావొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ఈ వయసు పిల్లలు మీ సహనాన్ని పరీక్షిస్తారు. 
వారు చక్కగా మాట్లాడటం ప్రారంభించడం వల్ల మంది స్నేహితులను పొందుతారు.

5 సంవత్సరాల పిల్లలు..

ఈ పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు. 
మీ పేరు రాయడానికి ప్రయత్నిస్తారు.
మీతో చాలా మాట్లాడాలని అనుకుంటున్నాను.
డాక్టర్, పోలీస్ అంటే  ఇలా ఎన్నో రోల్ ప్లే గేమ్స్ ఆడతారు.
చాలా మంది పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారో పంచుకుంటారు.
కలరింగ్ పుస్తకాన్ని నింపుతూ ఉంటారు. 

click me!