Modern Parenting : 9 ఏళ్లు దాటిన పిల్లలకు తల్లి ఎలాంటి విషయాలు నేర్పించాలో తెలుసా?

Published : Feb 04, 2026, 02:02 PM IST

 Modern Parenting: ఆడ పిల్లలు ఇంట్లో ఉంటే.. ఆ ఇంటికే అందం వస్తుంది. అయితే.. ఆడ పిల్ల పెరుగుతుంటే.. ఆ పేరెంట్స్ లో భయం కూడా పెరుగుతుంది. పీరియడ్స్ తొందరగా వచ్చేస్తాయేమో అనే టెన్షన్ కూడా ఉంటుంది. 

PREV
13
Parenting Tips

ఒకప్పుడు ఆడపిల్లలు కనీసం 14, 15 ఏళ్ల వయసు దాటిన తర్వాత మాత్రమే వారికి పీరియడ్స్ మొదలయ్యేవి. కానీ.. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. 8 ఏళ్లు, 9 ఏళ్లు నిండక ముందే ఈ మధ్య పిల్లలకు పీరియడ్స్ మొదలౌతున్నాయి. అందుకే, ఈ కాలం పేరెంట్స్ కి ఈ విషయాలో చాలా టెన్షన్ ఉంటుంది. ఇంత చిన్న వయసులోనే పిల్లలు ఎలా తట్టుకుంటారు, ఆ నొప్పిని ఎలా భరిస్తారు? అని తల్లులు ముందు నుంచే భయపడుతూ ఉంటారు. అయితే.. అలా మీరు బాధపడటం, భయపడటం కంటే.. వారిని అందుకు సిద్ధం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సున్నితమైన విషయాన్ని పిల్లలకు ఎలా చెప్పాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....

9 ఏళ్లు దాటిన ఆడ పిల్లలు బాల్యం నుండి కౌమార దశలోకి అడుగుపెట్టే కీలక సమయంలో ఉంటారు. ఈ వయసులోనే తల్లి తమ కూతురికి కొన్ని విషయాలు నేర్పించాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి..

23
1.శారీరక మార్పులు, రుతుక్రమం...

ఈ వయసులో శరీరంలో వచ్చే మార్పుల గురించి ముందే పిల్లలకు అవగాహన కల్పించాలి.

రుత్రక్రమం(Periods): పీరియడ్స్ అంటే ఏమిటి? ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి( శానిటరీ ప్యాడ్స్ వాడకం) లాంటి విషయాలని భయ పెట్టకుండా వివరించాలి. ఇది కేవలం ఒక సహజమైన ప్రక్రియ అని భరోసా ఇవ్వాలి.

పరిశుభ్రత: వ్యక్తిగత పరిశుభ్రత (Personal Hygiene) పాటించడం ఎంత ముఖ్యమో నేర్పించాలి.

2. భావోద్వేగ నియంత్రణ (Emotional Intelligence)

హార్మోన్ల మార్పుల వల్ల ఈ వయస్సులో పిల్లలకు కోపం, చిరాకు లేదా మూడ్ స్వింగ్స్ రావడం సహజం. వాటిని ముందుగా తల్లి అర్థం చేసుకోవాలి. పిల్లలు.. తమ ఫీలింగ్స్ ని దాచుకోకుండా.. తల్లితో పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి.

33
3. సోషల్ మీడియా , ఇంటర్నెట్ భద్రత (Digital Safety)

9 ఏళ్లు దాటిన పిల్లలు ఫోన్లు లేదా ఇంటర్నెట్ వాడటం మొదలుపెడతారు. ఈ విషయంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు అని కూడా నేర్పించాలి. ముఖ్యంగా... ఇంటర్నెట్‌లో అపరిచితులతో మాట్లాడకూడదని, వ్యక్తిగత ఫోటోలు లేదా వివరాలు పంచుకోకూడదని స్పష్టంగా చెప్పాలి. ఆన్‌లైన్‌లో ఎవరైనా వేధించినా లేదా అసౌకర్యంగా ప్రవర్తించినా వెంటనే తల్లికి చెప్పే ధైర్యం కల్పించాలి.

4. నిర్ణయాధికారం, బాధ్యత (Decision Making)

చిన్న చిన్న విషయాల్లో వారిని స్వయంగా నిర్ణయాలు తీసుకోనివ్వాలి.స్కూల్ ప్రాజెక్టులు, బట్టల ఎంపిక లేదా స్నేహితుల ఎంపికలో వారికి స్వేచ్ఛనిస్తూనే, ఆ నిర్ణయం వల్ల కలిగే పరిణామాలకు బాధ్యత వహించడం నేర్పాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మ విశ్వాసం నింపుతుంది.

5. ఆత్మరక్షణ , 'నో' చెప్పడం (Self-Defense & Saying 'No')

పిల్లలకు తమ శరీరం గురించి అర్థమయ్యేలా చెప్పాలి. అంటే.. వారి బాడీ వారికి ఇష్టం అనే విషయం నేర్పించాలి.

ఎవరైనా అతిగా ప్రవర్తించినా లేదా అసభ్యంగా తాకినా గట్టిగా "వద్దు/లేదు" (NO) అని చెప్పడం, అక్కడ నుండి వచ్చేయడం నేర్పించాలి.సమాజంలో తనను తాను ఎలా రక్షించుకోవాలో ప్రాథమిక సూత్రాలు నేర్పాలి.

ముఖ్యమైన విషయం ఏమిటంటే..ఈ వయస్సులో మీరు ఆమెకు ఒక తల్లిగా కంటే ఒక మంచి స్నేహితురాలిగా (BFF) ఉంటే, ఆమె ఏ విషయాన్నైనా మీతో దాచకుండా పంచుకుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories