మగ పిల్లలకు పేరెంట్స్ ఇవి నేర్పుతున్నారా..?

First Published | Dec 8, 2023, 2:39 PM IST

ఈ పనులు నేర్చుకోవడం వల్ల వారు ఇండిపెండెంట్ గా ఉండగలరు. ఇతరులకు కోఆపరేషన్ కూడా ఉంటుంది. మరి ఏవి నేర్పించాలో ఓసారి చూద్దాం..
 


ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే చాలు.. పెద్ద అయ్యేలోపు అన్ని విషయాలు నేర్పించాలని అనుకుంటారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత అత్తారింట్లో అడుగుపెడితే, అన్ని పనులు రావు అని ఎక్కడ ఇబ్బంది పడతారా అని తల్లి పదేళ్ల వయసు నుంచే ఇంటి పని, వంట పనీ ఇలా అన్నీ నేర్పుతూ ఉంటారు. ఇది మంచి విషయమే. మీరు మీ అమ్మాయి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది పడకూడదని మీరు అవి నేర్పుతున్నారు. మరి, అబ్బాయిలకు ఏం నేర్పిస్తున్నారు..? ఆడపిల్లలకు మాత్రమే కాదు, మగ పిల్లలకు కూడా కచ్చితంగా కొన్ని విషయాలు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అవి ఆడోళ్ల పనులు మగపిల్లలకు ఎందుకు అని చాలా మంది అనుకుంటారు. కానీ, ఈ పనులు నేర్చుకోవడం వల్ల వారు ఇండిపెండెంట్ గా ఉండగలరు. ఇతరులకు కోఆపరేషన్ కూడా ఉంటుంది. మరి ఏవి నేర్పించాలో ఓసారి చూద్దాం..

Dish wash Use vinegar

1.మీకు మగ పిల్లలు ఉంటే, వారికి కూడా ఇంట్లో పనులు చేయడం నేర్పించాలి. వాటిలో మొదటిది క్లీనింగ్.  ఇంట్లో గిన్నెలు కడగడం,  ఇళ్లు ఊడ్వడం, తుడవడం, దుమ్ము దులపడం లాంటి పనులు నేర్పించాలి.

2.గిన్నెలు క్లీన్ చేయడం వల్ల అలవాటు చేయడం వల్ల, కిచెన్ ఎంత క్లీన్ గా ఉంచుకోవాలి అనే విషయం వారికి అర్థమౌతుంది. మన ఆరోగ్యం మొదట కిచెన్ నుంచే ప్రారంభమౌతుంది. చిన్నప్పటి నుంచి నేర్పడం వల్ల, వారికి అది అలవాటుగామారి, ఎప్పుడూ క్లీన్ గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు.
 

Latest Videos


3.అంతేకాదు, పిల్లలకు వారి దుస్తులను ఎలా ఉతకాలి, వాటిని ఎలా మడతపెట్టాలి అనే విషయం కూడా నేర్పించాలి. ఐదేళ్లు దాటిన దగ్గర నుంచి పిల్లలకు వారి దుస్తులను మడతపెట్టడం నేర్పించవచ్చు. అంతేకాకుండా, వాషింగ్ మెషిన్ ఆపరేట్ చేయడం ఎలాగో, ఏ డిటర్జెంట్ వాడాలి లాంటి విషయాలను నేర్పించవచ్చు.
 

2.గిన్నెలు క్లీన్ చేయడం వల్ల అలవాటు చేయడం వల్ల, కిచెన్ ఎంత క్లీన్ గా ఉంచుకోవాలి అనే విషయం వారికి అర్థమౌతుంది. మన ఆరోగ్యం మొదట కిచెన్ నుంచే ప్రారంభమౌతుంది. చిన్నప్పటి నుంచి నేర్పడం వల్ల, వారికి అది అలవాటుగామారి, ఎప్పుడూ క్లీన్ గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు.

4.ఆడపిల్లలకు మాత్రమే వంట నేర్పించాలి అనే పాత పద్దతికి స్వస్తి పలకాలి. వంట చేసుకోవడం ఎవరికైనా అవసరం రావచ్చు. కాబట్టి, మీ మగ పిల్లలకు కూడా మీరు చిన్నతనం నుంచే వంట నేర్పించడం అలవాటు చేయవచ్చు. మరీ చిన్నతనంలోనూ పెద్ద పెద్ద వంటలు కాకపోయినా, ఫండమెంటల్ వి నేర్పించాలి. బేసిక్ కుకింగ్ లెసెన్స్ తో మొదలుపెట్టవచ్చు.
 

bed

 5.ఎక్కువగా పిల్లలు బెడ్ ని చాలా మెస్సీ చేస్తూ ఉంటారు. కానీ, పిల్లలకు మనం బెడ్ ని నీట్ గా పెట్టడం, పిల్లోస్ ని ఎలా ఆర్గనైజ్డ్ గా పెట్టడం నేర్పించాలి. దీని వల్ల వారికి క్లీనింగ్ నెస్  అలవాటు అవుతుంది.

6.పిల్లలకు ట్రాష్ హ్యాండిలింగ్ కూడా నేర్పించాలి. ఇంట్లో చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా  ట్రాష్ లో పడేయడం ఎలా? తడి చెత్త, పొడిచెత్త ను విడిగా వేయడం కూడా నేర్పించాలి. దీని వల్ల పర్యావరణం కాపాడటం ఎలా అనే విషయం కూడా తెలుస్తోంది. వీటితోపాటు హౌస్ ఆర్గనైజేషన్ ని కూడా నేర్పించాలి.

click me!