ఈ మధ్యకాలంలో చాలా మంది కెరీర్ లో స్థిరపడిన తర్వాతే పెళ్లి, పిల్లల గురించి ఆలోచిస్తున్నారు.పలు సర్వేల ప్రకారం.. 30 ఏండ్లు దాటిన తర్వాతే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ 30 ఏండ్లు దాటిన తర్వాత స్త్రీ, పురుషులిద్దరిలో సంతానోత్పత్తి తగ్గడం మొదలవుతుంది. దీనివల్ల గర్భం దాల్చడం కష్టంగా మారుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం 30 ఏండ్లు దాటిని తర్వాత కూడా గర్బం దాల్చొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
ఈ టెస్ట్ లు తప్పనిసరి
ఒకప్పుడు పెద్దవయసు వారికి మాత్రమే లేనిపోని రోగాలు అంటే థైరాయిడ్, డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యలు వచ్చేవి. ఇప్పుడు ఈ సమస్యలు చిన్నవయసు వారికి కూడా వస్తున్నాయి. అందుకే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందే పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. గర్భం దాల్చడానికి ఫోలిక్ ఆమ్లంఎంతో సహాయపడుతుంది. అందుకే ప్రగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందు మీరు ఫోలిక్ యాసిడ్ ను పుష్కలంగా తీసుకోవాలి.
కలయిక తర్వాత..
గర్భందాల్చడాని ప్రయత్నించే వారు కలయిక తర్వాత కాసేపు అంటే 10 నుంచి 15 నిమిషాలు మంచం మీదే పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే మీ కాళ్లు కాస్త ఎత్తులో ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా సెక్స్ తర్వాత మీరు బాత్రూంకు వెళ్లకూడదు. ఎందుకంటే 10 నుంచి 15 నిమిషాల పాటు మీరు అలాగే ఉంటే వీర్యకణాలు గర్భాశయంలోకి ప్రవేశించి అక్కడే ఉండిపోతాయి.
తరచుగా సెక్స్
అండోత్సర్గము సమయంలో మీరు రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. నిజానికి స్పెర్మ్ మీ శరీరంలో 5 రోజుల వరకు బతికే ఉంటుంది. అయితే మీరు ఈ సమయంలో టైట్ బట్టలను వేసుకోకూడదు. ఎందుకంటే టైట్ బట్టలు పురుషఉల్లో స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తాయి. అందుకే వదులుగా ఉండే బట్టలనే వేసుకోవాలి.
ఒత్తిడికి దూరంగా
ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇది మీరు గర్భందాల్చాన్న కలను కూడా నాశనం చేస్తుంది. ఈ సమయంలో మీరు ఎంత సంతోషంగా ఉంటే.. అంత తొందరగా మీరు గర్భందాల్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆల్కహాల్, సిగరేట్ అలవాటుంటే మానుకోండి.