తండ్రి నుంచి పిల్లలకు ఎలాంటి లక్షణాలు వస్తాయో తెలుసా?

First Published | Dec 2, 2024, 12:30 PM IST

ముఖ్యంగా పిల్లలందరికీ జనటికల్ గా తండ్రి నుంచి కొన్ని లక్ణాలు వస్తాయట. అవేంటో చూద్దాం..

పిల్లలు పుట్టిన వెంటనే తల్లి పోలికా, తండ్రి పోలికా అని వెతికేస్తూ ఉంటారు. పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ… వారు చేసే పనులు పట్టి.. అచ్చం తల్లి పోలికే.. లేదంటే తండ్రి పోలికే అనేస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా కామన్ గా  ప్రతి ఇంట్లో వినపడే మాటలే. అయితే.. నిజంగానే పిల్లలకు పుట్టుకతోనే కొన్ని లక్షణాలు తల్లి నుంచి తండ్రి నుంచి వస్తాయట. ముఖ్యంగా పిల్లలందరికీ జనటికల్ గా తండ్రి నుంచి కొన్ని లక్ణాలు వస్తాయట. అవేంటో చూద్దాం..

దాదాపు పిల్లలందరికీ వారి జుట్టు, జుట్టు మందం తండ్రి నుంచే వస్తుందట. చాలా తక్కువ మందికి తప్పితే..  దాదాపు జుట్టు అందరికీ తండ్రిదే వస్తుందట. తండ్రి జుట్టు కనుక మందంగా, నల్లగా, ఉంగరాలుగా అందంగా ఉంటే.. ఆ అందం మొత్తం పిల్లలకు కచ్చితంగా వచ్చేస్తుంది.

ఇక.. తండ్రి నుంచి పిల్లలకు కచ్చితంగా వచ్చే వాటిలో పాదయం సైజ్ ఒకటి. తండ్రి పాదం సైజు కచ్చితంగా పిల్లలకు కూడా వస్తుందట. తండ్రి పాదం పెద్దగా ఉంటే.. పిల్లలకు కూడా పెద్దగా ఉండే అవకాశం ఉంటుందట. అలా అని అందరిదీ అలానే ఉంటుందని కాదు. కానీ… ఎక్కువగా పాదం పరిమాణం ఒకేలా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట.

Latest Videos


కంటి రంగు కూడా తండ్రిదే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తండ్రి కంటి రంగు మెరున్ కలర్ ఉండి, తల్లికి బ్లూకలర్ ఐస్ ఉంటే… ఎక్కువ శాతం తండ్రి కంటి రంగే వస్తుందట.

పిల్లలకు తెలివి తేటలు కూడా తండ్రివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మ్యాథ్ స్కిల్స్ వస్తాయట. తండ్రి కి కనుక మంచి తెలివితేటలు, మ్యాథ్స్ లో మంచి నైపుణ్యం ఉంటే.. అది పిల్లలకు కూడా వస్తుందట. సమస్యలను పరిష్కరించే నైపుణ్యం వారికి తండ్రి దగ్గర నుంచి వస్తుంది.

father son

దంతాల ఆరోగ్యం కూడా పిల్లలది తండ్రి మీదే ఆధారపడి ఉంటుంది. తండ్రి దంతాల క్రమం, వారి ఆరోగ్యం కూడా…. పిల్లల దంతాల వరస మీద ఆధారపడి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తండ్రికి ఏవైనా దంతాల సంబంధిత సమస్యలు ఉన్నా.. అవి పిల్లలకు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ.

father son

చాలా పరిశోధనల్లో తేలిన విషయం ప్రకారం…పిల్లల ఎత్తు కూడా తండ్రిదే వస్తుందట. తల్లి ఎత్తు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట.  తండ్రి మంచి ఎత్తుగా ఉంటే.. వారి పిల్లలకు కూడా ఆ హైట్ వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాదు.. ముఖ కవళికలు.. పోలికలు కూడా వస్తాయట. 

click me!