ప్రెగ్నెన్సీ టైంలో మటన్ తినొచ్చా?

First Published | Feb 21, 2024, 11:37 AM IST

గర్భధారణ సమయంలో ఆడవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో. అయితే చాలా మంది ప్రెగ్నెన్సీ సమయంలో కూడా మాంసాన్ని ఎక్కువగా తింటారు. దీనివల్ల ఏమౌతుందో తెలుసా? 
 

ప్రెగ్నెన్సీ అనేది ఆడవారి జీవితంలో ఎంతో మధురమైన క్షణం.అయితే ఈ సమయంలో ఆడవారి శరీరంలో ఎన్నో శారీరక, మానసిక మార్పులు వస్తాయి. కడుపులో పెరుగున్న పిండం ఎదుగుదలకు సరైన ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఈ సమయంలో వీరికి ప్రోటీన్ చాలా అవసరం. ఎక్కువ ప్రోటీన్ ను పొందడానికి చాలా మంది ఆడవారు మాంసాహారాన్ని ఎక్కువగా తింటుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గర్భధారణ సమయంలో మాంసాహారం తినడం సురక్షితమేనా? కాదా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రగ్నెన్సీ సమయంలో ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చికెన్ ను తక్కువగా తినడం మంచిదే. ఈ చికెన్ సులభంగా జీర్ణమవుతుంది. అలాగే దీని నుంచి ప్రోటీన్ ను కూడా పొందుతారు. దీనివల్ల ఐరన్ లోపం కూడా పోతుంది. చికెన్ ను తినడం వల్ల తల్లి, బిడ్డకు ఇద్దరికీ అవసరమైన విటమిన్ బి 12, విటమిన్ ఎ,  జింక్ వంటి పోషకాలు కూడా అందుతాయి. అయితే గర్భిణులు మాంసాహారాన్ని చాలా జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే వండని చికెన్ తినడం వల్ల బిడ్డకు హాని కలుగుతుంది. అలాగే గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో గొడ్డు మాంసం లేదా మటన్ వంటి రెడ్ మీట్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇది తల్లీ,  బిడ్డ ఇద్దరికీ సురక్షితం కాదు.


ప్రగ్నెన్సీ టైంలో రెడ్ మీట్ ను తినడం వల్ల వచ్చే సమస్యలు

రెడ్ మీట్ లో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ అతిగా తీసుకుంటే తల్లి, బిడ్డ ఇద్దరికీ హానికరమని నిపుణులు చెబుతున్నారు.
 

ప్రెగ్నెన్సీ సమయంలో మటన్ ఎక్కువగా తింటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీనివల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మటన్ అత సులువుగా జీర్ణం కాదు. దీన్ని జీర్ణం చేసుకోవడానికి శరీరం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో స్త్రీ జీర్ణవ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది. దీనివల్ల కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు రావొచ్చు.

మటన్ ను శుభ్రం చేయకపోయినా, సరిగా ఉడికించకపోయినా ఫుడ్ పాయిజనింగ్ ముప్పు పెరుగుతుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా పెరుగుదల గర్భిణీ స్త్రీ శరీరంలో విషాన్ని వ్యాప్తి చేస్తుంది. అలాగే ఇది అబాషన్ కు దారితీస్తుంది.

గర్భధారణ సమయంలో మటన్ ఎలా తినాలి?

గర్భిణులు మటన్ తినాలనుకుంటే తాజాగా మాంసాన్ని మాత్రమే వండుకుని తినాలని నిపుణులు చెబుతున్నారు. దీన్ని కూడా బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన, కాల్చిన మాంసాన్ని తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
 

Latest Videos

click me!