మీరు మీ పిల్లలకు ఈ విషయాలు నేర్పుతున్నారా లేదా..?

First Published | Jun 3, 2024, 3:23 PM IST

పిల్లల ఎదుగుదలలో పేరెంట్స్ పాత్ర చాలా కీలకం. అందుకే.. పిల్లలకు చిన్న తనం నుంచే కచ్చితంగా కొన్ని విషయాలు నేర్పించాలట.  మరి..అవి నేర్పుతున్నారో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి నిమిషం పేరెంట్స్ తమ పిల్లల గురించే ఆలోచిస్తూ ఉంటారు. తమ పిల్లల కోసం చాలా కష్టపడతారు. తమ పిల్లలకు మంచి విషయాలు నేర్పించాలని అనుకుంటారు. మంచి విషయాలు అంటే ఏం నేర్పుతున్నారు..? ఈ విషయం గురించి కూడా కచ్చితంగా నేర్పించాలి. ఎందుకు అంటే...  పిల్లల ఎదుగుదలలో పేరెంట్స్ పాత్ర చాలా కీలకం. అందుకే.. పిల్లలకు చిన్న తనం నుంచే కచ్చితంగా కొన్ని విషయాలు నేర్పించాలట.  మరి..అవి నేర్పుతున్నారో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా మంది పేరెంట్స తమ పిల్లలు ఎంత మంచి పని చేసినా.. ప్రోత్సహించరు. నువ్వు ఒక్కడివే చేశావా అంటూ తీసి పారేస్తూఉంటారు. కానీ.. అలా చేయకూడదట. పిల్లలను కొద్దిగా  ప్రోత్సహిస్తే.. వారు మరింత ఉత్సాహంగా పని చేస్తారు.  ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలా అని మీ పిల్లలను వేరే వాళ్లు ప్రోత్సాహించాలి అనుకోకూడదు. ఎవరి పిల్లలను వారే ప్రోత్సహించాలి. నిరుత్సాహ పరచకూడదు.


2.కాకి పిల్లల కాకికి ముందు.. అనే మన పెద్దవాళ్లు ఊరికే చెప్పలేదు. అలా అందరూ అనుకోకూడదు అని మనం పిల్లలను తక్కువ చేసి చూడకూడదు. మన పిల్లలను చూసి మనమే మురిసిపోవాలి. ఇతరులకంటే.. మన పిల్లలను మనం స్పెషల్ గానే చూసుకోవాలి. అందరితో పాటు నువ్వు కూడా.. వాళ్ల వల్లే కానిది నీ వల్ల ఏమౌతుంది లాంటి మాటలు వారికి చెప్పకూడదు. నీకు సాధ్యమౌతుంది. అది నీ వల్ల మాత్రమే అవుతుందంటూ.. వారి సామర్థ్యాన్ని మరింత పెంచాలి. వారిలో ఉన్న స్పెషల్ టాలెంట్ ని గుర్తించాలి. ఆ విధంగా వారిని ప్రోత్సహించే బాధ్యత పేరెంట్స్ మీద మాత్రమే ఉంటుంది.
 


3.ఎదుటివారికి సాయం చేసే గుణంలోనే మన వ్యక్తిత్వం ఎలాంటిదో బయటపడుతుంది. కాబట్టి... చిన్నతనం నుంచే ఎదుటివారికి సాయం చేయడం పిల్లలకు నేర్పించాలి. అంతేకాదు.. ఎవరైనా తమకు సహాయం చేసినా.. వెంటనే వారికి థ్యాంక్స్ చెప్పడం, ఎదుటివాళ్లు మనకు చేసిన సాయం గుర్తించుకోవడం కూడా తప్పకుండా చేయాలి. 
 

4.మీకు వచ్చిన కష్టంలో.. మీ చిన్నారి కొంచెం సహాయ చేసినా దానిని మీరు గుర్తించాలి. చిన్నదే కదా అని వదిలేయవద్దు. వారు చేసిన చిన్న సహాయం మీకు ఎంతగా ఉపయోగపడిందో వారికి వివరించాలి. అది వారికి మరింత ప్రోత్సాహకంగా ఉండి.. మరోసారి సాయం చేయడానికి ముందుకు వస్తారు.
 

5.ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లల మీద ప్రేమ ఉంటుంది. కానీ.. ఆ ప్రేమను చెబితే పిల్లలకు గారాబం అవుతుందేమో అని చాలా మంది చెప్పరు. కానీ.. నిజానికి తల్లిదండ్రులు తమ ప్రేమను పిల్లలకు కచ్చితంగా చెప్పాలట. రోజుల్లో ఒక్కసారైనా.. మీ ప్రేమను వారికి తెలియజేయాలి. ఐ లవ్ యూ అనే పదాన్ని వారికి తెలియజేయాలి.


6.కొన్ని కొన్ని విషయాల్లో పిల్లలు చాలా భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులే వారికి ధైర్యం చెప్పాలి. ఏం జరిగినా.. మీరు వారికి తోడు ఉన్నారనే నమ్మకం కలిగించాలి. పరిస్థితి మళ్లీ మామూలుగా మారుతుందని.. ఎలాంటి భయం పెట్టుకోవద్దని మీరే వారికి చెప్పాలి.

7. పిల్లలు ఆటలో, చదువులో వెనకపడినా, ఓడిపోయినా వారిని మరింత మోటివేట్ చేయాలి.  వారి ఒత్తిడి తగ్గించాలి. ఏం చేస్తే..  ఎలా సాధించగలమో.. వారికి వివరించాలి.

8.మీరు పిల్లలకు ఏది నేర్పితే.. వారు అదే నేర్చుకుంటారు. కాబట్టి.. పిల్లలకు మనం సంతోషంగా ఉండటం నేర్పించాలి. ఎలాంటి పరిస్థితులకు కుంగిపోకుండా.. సంతోషంగా ఉండటం ఎలాగో నేర్పించాలి.

Latest Videos

click me!