మీ పిల్లలు చదివింది అప్పుడే మర్చిపోతున్నారా? అయితే ఇలా చేయండి

First Published | Feb 1, 2024, 10:31 AM IST

కొంతమంది పిల్లలకు ఒక్కసారి చదివినా అలాగే గుర్తుండిపోతుంది.  ఎప్పుడు అడిగినా చెప్పేస్తుంటారు. కానీ కొంతమంది పిల్లలకు ఎంత చదివినా అస్సలు గుర్తుండదు. ఇప్పుడు చదివిన దాన్ని కూడా మర్చిపోతుంటారు. మరి ఇలాంటి పిల్లల మెమోరీ పవర్ పెరగాలంటే ఏం చేయాలో తెలుసా? 

పిల్లలు ఆటల్లో ఎప్పుడూ ముందుంటారు. కానీ చదువుకోమని చెప్పగానే సాకులు చెప్పడం మొదలుపెడతారు. నిజానికి పిల్లలు కొత్త విషయాలను నేర్చుకోవడంలో, వాటిని గుర్తుంచుకోవడంలో చాలా కష్టపడతారు. దీనికి ఎన్నో కారణాలుంటాయి. సాధారణంగా పిల్లలకు చదువుపై ఆసక్తి అంతగా ఉండదు. అందుకే కొంత మంది పిల్లలకు చదువుపై అంతగా ఇంట్రెస్టింగ్ ఉండదు. ఈ సమస్యల కారణంగా చాలా మంది తల్లిదండ్రులకు స్కూల్ నుంచి మీ పిల్లవాడు చదవడం లేదన్న ఫిర్యాదులు వస్తుంటాయి. దీనివల్లే తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు, భవిష్యత్తుపై  ఎంతో ఆందోళన ఉంటుంది. ఏం చేస్తే పిల్లలు చదువుతారని బాగా ఆలోచిస్తుంటారు. ఆక్స్ఫర్డ్ పరిశోధన ప్రకారం.. పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

reading

చదువును ఉత్తేజకరంగా మార్చండి

ఆక్స్ఫర్డ్ పరిశోధన ప్రకారం.. మీ పిల్లలు చదివిన దాన్ని తొందరగా మర్చిపోతుంటే ఒక పని చేయండి. మీ పిల్లలు చదివే విషయాన్ని ఇంట్రెస్టింగ్ గా చేయండి. మీకు తెలుసా? జస్ట్ పుస్తకాలు తీసుకుని బట్టీపట్టినంత మాత్రాన వాళ్లకు ఏదీ గుర్తుండదు. అందుకే మీ పిల్లలు చదివి పాఠాన్ని దేనితోనైనా ముడిపెట్టి వివరించండి. ఇది చదివిన విషయాలను ఎక్కువసేపు గుర్తుండటానికి సహాయపడుతుంది. 
 

Latest Videos


Image: Getty


టీచింగ్ లో విజువల్ సపోర్ట్ 

పిల్లలకు స్కూల్ హోం వర్క్ ఉంటే దాన్ని నేర్పించాల్సిన, కంప్లీట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. అయితే మీ పిల్లలకు చదివింది ఎక్కువసేపు గుర్తుండటానికి మీరు ఏదైనా సృజనాత్మక మార్గం సహాయం తీసుకోవచ్చు. ఆక్స్ఫర్డ్ పరిశోధన ప్రకారం.. వీడియోలో చూసిన విషయాలు పిల్లలకు ఎక్కువసేపు గుర్తుండిపోతాయి. వీడియో పిల్లల బ్రెయిన్ లో  అలాగే ఉండబోతుంది. 
 

పిల్లవాడిని టీచర్ గా

పిల్లవాడికి టాపిక్ వివరించిన తరువాత, పరీక్షించడానికి టీచర్ గా మారమని వారిని అడగండి. పరిశోధనల ప్రకారం, పిల్లలే ఆ విషయాల గురించి వారి స్వంత మాటల్లో వివరిస్తే, వారు చదివిన వాటిని వారు గుర్తుంచుకున్నారని అర్థం చేసుకోండి. ప్రత్యేకత ఏంటంటే ఇలా చేయడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది (తప్పుగా ప్రవర్తించినందుకు పిల్లలను తిట్టకండి, ఈ విధంగా వారి అలవాట్లను మెరుగుపరుచుకోండి).

చిన్న చిన్న భాగాలుగా వివరించండి.

ఆక్స్ ఫర్డ్ పరిశోధన ప్రకారం.. స్టడీ మెటీరియల్ చాలా ఎక్కువగా ఉంటే దానిని చిన్న భాగాలుగా విభజించండి. పిల్లలు పెద్ద వాక్యాలు లేదా విషయాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడతారు. ఇలాంటి పరిస్థితిలో.. దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి కోసం వాటిని క్లుప్తంగా వివరించడం చాలా ముఖ్యం.
 

click me!