మీ పిల్లల చేతిరాత బాగుండాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published Jul 6, 2024, 10:45 AM IST

చాలా మంది పిల్లలు బాగా చదివినా, క్లాస్ ఫస్ట్ వచ్చినా.. చేతిరాత మాత్రం అస్సలు బాగుండదు. ఇంకేముంది బాగా రాయి అని తల్లిదండ్రులు పిల్లలను తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. కానీ దీనివల్ల పిల్లల చేతిరాత మారదు. మరి వీళ్లు అందంగా మారాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా? 
 

పిల్లలు ఏ విషయాన్నైనా చాలా తొందరగా నేర్చుకుంటారు. అందుకే చిన్న వయసు నుంచి పిల్లలకు మంచి, చెడు విషయాల గురించి నేర్పించాలంటారు. ఈ సంగతి పక్కన పెడితే కొంతమంది పిల్లలు బాగా చదువుతుంటారు. క్లాస్ ఫస్ట్ కూడా వస్తారు. కానీ రైటింగ్ మాత్రం అస్సలు బాగా రాయరు. కొన్ని కొన్ని సార్లు వీళ్లు ఏం రాసారో కూడా గుర్తుపట్టడానికి కాదు. దీనివల్ల ఎక్షామ్ లో కరెక్టు ఆన్సర్ రాసినా.. టీచర్ కు అర్థం కాక తక్కువ మార్కులు పడతాయి. క్లాస్ ఫస్ట్ రాలేకపోతుంటారు. ఇలాంటి పిల్లల చేతిరాత అందంగా మారాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

చిట్కా 1

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు మారాం చేస్తున్నారని పెన్సిళ్లకు బదులుగా పెన్నులను ఇస్తుంటారు. కానీ పెన్నుల వల్ల చేతిరాత బాగుండదు. అలాగే వాళ్లు నేర్చుకోలేరు. మీ పిల్లలు చక్కగా రాయాలంటే పెన్నులకు బదులుగా పెన్నిళ్లను వాడేలా చూడండి. పెన్నుల కంటే పెన్నీళ్లే మీ పిల్లల చేతిరాతను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా పెన్నిళ్లను ఉపయోగించడం వల్ల పేపర్స్ కూడా వేస్ట్ కావు. ఎన్ని సార్లైనా రాసి మళ్లీ తుడిపేసి మళ్లీ రాయొచ్చు.  పెన్సిళ్లతో రాయడం వల్ల మీ పిల్లలు రాసేసి స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా పిల్లలకు ఇవే సురక్షితం కూడా. పిల్లలు పదునైన పెన్నులతో పోలిస్తే పెన్సిళ్లతో రాస్తే చేతిరాత అందంగా మారుతుంది. 

Latest Videos


చిట్కా 2

కొన్ని రకాల పిండిలు కూడా మీ పిల్లల చేతిరాతను మెరుగుపర్చడానికి బాగా సహాయపడతాయి తెలుసా? మీ ఇంట్ల మైదా, మొక్కజొన్న పిండి, గోధుమ పిండి వంటి పిండిని వెడల్పాటి ప్లేట్లో పోయండి. వీటిలో  మీ పిల్లల చేతి పట్టుకుని వారికి నేర్పించండి. దీనివల్ల పిల్లలు బాగా రాయడం నేర్చుకుంటారు. 
 

చిట్కా 3

చాలా మంది తల్లిదండ్రులు ఇంకా ఎన్ని రోజులు నేర్చుకుంటావు.. అని వాళ్లపై ఒత్తిడి తెస్తుంటారు. ఇలా చేసినంత మాత్రానా మీ పిల్లలు బాగా రాయడం తొందరగా నేర్చుకోలేరు. భయం వల్ల పిల్లల ఏకాగ్రత తగ్గుతుంది. అందుకే తొందరగా నేర్చుకోమని ఫోర్స్ చేయకండి. పిల్లలకు ప్రతిరోజూ రాయడానికి కొంత సమయం కేటాయించండి. చేతిరాతను మెరుగుపరచడానికి ఇదొక గొప్ప మార్గం. 

చిట్కా 4

పిల్లలకు రోజూ పెన్సిల్ తో రాయాలన్నా విసుగొస్తుంది. అందుకే వారికి బోర్ కొట్టకుండా క్రేయాన్లు లేదా కలర్ పెన్సిళ్లను ఇవ్వండి. అలాగే పేపర్స్ పై గీయమని, రంగులు వేయమని చెప్పండి. ఇది అక్షరాలను గుండ్రంగా రాడయానికి సహాయపడుతుంది. 

click me!