మీ బిడ్డకు పాలు సరిపోతున్నాయా? లేదా? ఇలా తెలుసుకోండి

First Published | Mar 16, 2024, 9:46 AM IST

తల్లిపాలే పిల్లలకు బలం. వీటిపైనే పిల్లల ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. సాధారణంగా తల్లులు పిల్లలకు పాలిస్తుంటారు. కానీ ఆ పాలు పిల్లలకు సరిపోతున్నాయో, లేదో మాత్రం పట్టించుకోరు. మరి బిడ్డకు మీరిచ్చే పాలు సరిపోతున్నాయో  లేదో ఇలా తెలుసుకోండి. 

కొంతమందికి తల్లిపాల ఉత్పత్తి సరిగ్గా ఉండదు. దీనివల్ల బిడ్డకు సరిపడా పాలు అందవు. కానీ తల్లిపాలపైనే బిడ్డ ఆరోగ్యం, ఎదుగుదల ఆధారపడి ఉంటాయి. ఒత్తిడి, తగినంత పోషకాహారం తీసుకోకపోవడం, కొన్ని మందుల ప్రభావం వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుంది. ఏదేమైనా మీరిచ్చే పాలు బిడ్డకు సరిపోతున్నాయో? లేదో? తెలుసుకోవడం చాలా ముఖ్యం. 
 

బిడ్డకు తల్లి పాల ప్రయోజనాలు 

పిల్లలు పాలను తరచుగా తాగాలనుకుంటారు. ఏడుపు ద్వారా దాన్ని తెలియజేస్తారు. ఎందుకంటే పిల్లలు వారి అవసరాలను మాటల్లో చెప్పలేరు. మీ బిడ్డ ఎప్పుడూ ఏడుస్తుంటే వారికి పాలు సరిపోవడం లేదని అర్థం చేసుకోవాలి. ఆకలి అయితే కూడా పిల్లలు అలాగే ఏడుస్తారు. అయితే వారి ఏడుపునకు ఆకలి ఒక్కటే కారణం కాదు. డైపర్ తడిగా మారినా కూడా పిల్లలు ఏడుస్తుంటారు. అయితే చిన్న పిల్లలు సాధారణంగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా ఏడుస్తారు. 
 

Latest Videos


మీ బిడ్డకు తగినంత పాలు అందుతున్నాయనడానికి సంకేతాలు

సరిగ్గా పాలు అందితే మీ బిడ్డ వారానికి 100 నుంచి 140 గ్రాముల బరువు పెరుగుతాడు.

పాలు తాగిన తర్వాత మీ బిడ్డ సంతోషంగా, రిలాక్స్ గా కనిపిస్తుంది.

బిడ్డ పుట్టిన 7 వ రోజు నుంచి.. 24 గంటల్లో మూత్ర విసర్జన సంఖ్య 7 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

మీ బిడ్డ ఎనర్జిటిక్ గా , సంతోషంగా ఉంటుంది.
 

తగినంత పాల ఉత్పత్తి లేనప్పుడు ఏం చేయాలి? 

మార్కెట్ లో దొరికే బేబీ ఫుడ్స్  అంటే.. మిల్క్ పౌడర్, న్యూట్రీషియన్ పౌడర్స్ వల్ల పిల్లలకు ఎక్కువ ఆకలిగా అనిపించకపోవచ్చు. కానీ మార్కెట్లో లభించే బేబీ ఫుడ్స్ తల్లిపాలతో పోలిస్తే మీ బిడ్డ జీర్ణక్రియ, శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే ఇది కడుపులోనే చాలా సేపటి వరకు ఉంటుంది. కానీ తల్లి పాలివ్వడానికి బదులుగా ఫార్ములా ఫీడ్ తిన్న తర్వాత పిల్లలు లేట్ గా తింటారు. 
 

పాలిచ్చే తల్లులకు కొన్ని చిట్కాలు

మీ పాల ఉత్పత్తిని పెంచడానికి రోజుకు 10 నుంచి 12 సార్లు ఫీడ్ లేదా పంప్ చేయండి.

మీ బిడ్డ ముఖం వైపు చేతులు తీసుకురావడం లేదా తల తిప్పడం వంటివి చేస్తే.. వాళ్లకు ఆకలి అవుతుందని అర్థం చేసుకుని పాలివ్వండి.

పిల్లలు పాలు సరిపడా తాగేందుకు మీ బిడ్డ నోటిని విశాలంగా తెరిచి ఉంచేలా చూడండి. అలాగే మీ బిడ్డ గడ్డం మీ ఛాతీని తాకేలా చూసుకోండి.

పాలు పట్టేటప్పుడు మీ వక్షోజాలను చనుమొన వైపు మసాజ్ చేయండి.
 

click me!