Parenting Tips: చిన్న చిన్న తప్పులకే పిల్లల్ని తిట్టడం, కొట్టడం చేస్తున్నారా?

Published : Feb 11, 2025, 02:12 PM IST

పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో అల్లరి ఉంటుంది. అది సర్వసాధారణం. కానీ ఆ అల్లరి ఆపడానికి పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఎలా రియాక్ట్ అవుతున్నారనేది చాలా ముఖ్యం. చిన్న చిన్న తప్పులకే పిల్లల్ని తిట్టడం, కొట్టడం చేస్తే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
17
Parenting Tips: చిన్న చిన్న తప్పులకే పిల్లల్ని తిట్టడం, కొట్టడం చేస్తున్నారా?

పిల్లల పెంపకం చాలా బాధ్యతతో కూడుకున్న పని. ప్రతి పేరెంట్స్ వారి పిల్లలు మంచివారిగా, తెలివైనవారిగా ఎదగాలని కోరుకుంటారు. మంచి, చెడు నేర్పిస్తారు. కానీ కొన్నిసార్లు పిల్లలు మనం అనుకున్నట్లు పర్ఫెక్ట్ గా ఉండరు. చిన్న చిన్న తప్పులు చేస్తారు. అల్లరి చేస్తారు. అలాంటప్పుడు వారికి మంచి చెప్పాలని పేరెంట్స్ వారిని తిడుతూ ఉంటారు. 

27
చిన్న విషయాలకే తిడితే?

పిల్లల్ని మంచి దారిలో పెట్టాలని తల్లిదండ్రులు వారితో కోపంగా మాట్లాడటం, తిట్టడం, కొన్నిసార్లు కొట్టడం కూడా చేస్తారు. కానీ చిన్న చిన్న విషయాలకు తిట్టడం మంచిది కాదట. చాలా మంది పేరెంట్స్ చిన్న విషయాలకే ఇతరుల ముందు పిల్లల్ని తిడతారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల పిల్లలపై చెడు ప్రభావం పడుతుంది. పిల్లల్ని ఎక్కువగా తిడితే ఏమేం నష్టాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

37
పేరెంట్స్ కోపంగా మాట్లాడితే?

చిన్న చిన్న విషయాలకు పిల్లలతో పేరెంట్స్ కోపంగా ఉంటే, పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లలు అనుకరిస్తారు. ఎక్కువగా తిడితే లేదా కోపంగా ఉంటే, వాళ్ళు కూడా ఆవేశంగా మారతారు. చిన్న విషయాలకే వారికి కోపం వస్తుంది. వాళ్ళు కూడా మీతో ఆవేశంగా ప్రవర్తిస్తారు.

47
తరచుగా పిల్లల్ని తిడితే?

తరచుగా పిల్లల్ని తిడితే వారి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఇది చేయకు, అది చేయకు, ఇలా ఉండకు అని అంటూ ఉంటే వారు కన్ఫ్యూజ్ అవుతారు. ఏ పని చేయాలన్నా భయం, సంకోచం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం తగ్గిపోవడంతో తమ మనసులోని మాట కూడా చెప్పలేరు.

57
మానసిక ఒత్తిడి

 పిల్లల్ని తరచుగా తిడితే వారు మానసికంగా దెబ్బతింటారు. వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. తమ గురించి తామే తక్కువగా అంచనా వేసుకుంటారు. పిల్లలకు మానసిక ఒత్తిడి కూడా వస్తుంది. ఒత్తిడి ఎక్కువైతే చదువు మీద దృష్టి పెట్టలేరు. పిల్లల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.  

67
నేర్చుకునే శక్తి..

పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శం. వారు తిడితే కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతుంది. తప్పులు చేయడానికి భయపడతారు. ఓటమిని ఎదుర్కోవడం రాదు. తప్పు చేస్తే ఏమవుతుంది? తప్పు చేస్తే తిడతారా? అనే భయం కలుగుతుంది. ఈ సందేహాల వల్ల కొత్త విషయాలు నేర్చుకోలేరు.  

77
పిల్లల్ని అస్సలు తిట్టకూడదా?

పిల్లల్ని తిట్టొచ్చు. కానీ చిన్న చిన్న విషయాలకు తిట్టకూడదు. వారి నమ్మకాన్ని దెబ్బతీయకుండా మాట్లాడాలి. ఏం చేసినా నాన్న, అమ్మ తిడతారు అని భయపడకుండా, మీతో నిర్భయంగా మాట్లాడేలా నమ్మకం కలిగించాలి.

Read more Photos on
click me!

Recommended Stories