Pregnancy: ప్రెగ్నెంట్స్ బెండకాయ తింటే ఏమవుతుందో తెలుసా?

Published : Feb 10, 2025, 04:31 PM ISTUpdated : Feb 10, 2025, 05:07 PM IST

ప్రెగ్నెంట్స్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏది తింటే తల్లి, బిడ్లలకు మంచిదో అదే తీసుకుంటారు. కానీ చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో బెండకాయ తింటే ఏమవుతుందనే డౌట్ ఉంటుంది. దానిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
Pregnancy: ప్రెగ్నెంట్స్ బెండకాయ తింటే ఏమవుతుందో తెలుసా?

సాధారణంగా ప్రెగ్నెన్సీ టైంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంకా ఫుడ్ తీసుకునే  విషయంలో అయితే చెప్పనవసరం లేదు. ఇది తినవచ్చా లేదా అని ప్రతీది తెలుసుకొనే తింటారు. తల్లికి, బిడ్డకి మేలు చేసే ఆహారమే తీసుకుంటారు. ప్రెగ్నెన్సీ టైంలో బెండకాయ తినవచ్చా లేదా అని చాలామందికి సందేహం ఉంటుంది. 

కానీ బెండకాయలో ఉండే కాల్షియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, అనేక విటమిన్లు, పోషకాలు గర్భిణులకు చాలా విధాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

25
బిడ్డ పెరుగుదలకు..

బెండకాయలో ఉండే విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ బి9 వంటి పోషకాలు గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా విటమిన్ బి9 పిల్లల మెదడు అభివృద్ధికి చాలా మంచిది.

మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది:

గర్భధారణ సమయంలో మలబద్ధకం సమస్య రావడం సాధారణం. బెండకాయలో అధిక మొత్తంలో ఫైబర్ ఉండటం వల్ల ఇది మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి వారానికి రెండు సార్లు గర్భిణులు బెండకాయ తింటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

35
నడుం నొప్పిని తగ్గిస్తుంది:

గర్భధారణ సమయంలో ఎముకలు బలహీనంగా ఉండటం వల్ల నడుం నొప్పి, చేతులు, కాళ్ళ నొప్పులు వస్తాయి. బెండకాయలో ఉండే విటమిన్ కె, ఐరన్ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

ఆకలిని నియంత్రిస్తుంది:

బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గర్భిణులు ఎక్కువగా తినకుండా నియంత్రిస్తుంది. దీని వల్ల బరువు పెరగడం కూడా తగ్గుతుంది.

45

ప్రెగ్నెన్సీలో ఉదయాన్నే తల తిరగడం, అలసట, వికారం లాంటి సమస్యలు ఉంటాయి. బెండకాయ తినడం వల్ల ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

రక్తహీనతను తగ్గిస్తుంది:

గర్భధారణ సమయంలో బెండకాయ తింటే చాలా మంచిది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. బిడ్డ పెరుగుదలకు తోడ్పడుతుంది. కాబట్టి గర్భధారణ సమయంలో బెండకాయ తింటే రక్తహీనతను తగ్గించుకోవచ్చు.

55
ఇతర ప్రయోజనాలు:

- గర్భిణుల రోగనిరోధక శక్తిని పెంచడానికి బెండకాయ సహాయపడుతుంది.

- బెండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది పిల్లల పెరుగుదలకు సహాయపడుతుంది, గర్భిణులకు విటమిన్ సి అవసరాన్ని తీరుస్తుంది.

- బెండకాయలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉండటం వల్ల షుగర్ ఉన్న గర్భిణులకు చాలా మంచిది.

గమనిక:

బెండకాయ కొంతమందికి అలెర్జీని కలిగిస్తుంది. అలాంటి వారు డాక్టర్లను సంప్రదించిన తర్వాతే బెండకాయను తినాలి.

click me!

Recommended Stories