పిల్లలు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే.. పేరెంట్స్ చేయాల్సింది ఇదే..!

First Published | Mar 8, 2024, 3:54 PM IST

చిన్నతనం నుంచి మనం కొన్ని అలవాట్లను కనుక వారికి నేర్పితే.. జీవితంలో వారికి తిరుగుండదు. మరి.. వారికి నేర్పించాల్సిన విషయాలేంటో ఓసారి చూద్దామా..
 

ప్రతి పేరెంట్స్ తమ పిల్లలు లైఫ్ లో సెక్సెస్ అవ్వాలనే కోరుకుంటారు. అయితే... సక్సెస్ అవ్వడం అవ్వకపోవడం పిల్లల చేతుల్లోనే ఉంటుంది. దానికి మనం చేయగలం. బిడ్డలను కనగలం కానీ.. వాళ్ల రాతలను కనలేం కదా అని డైలాగులు కొడుతూ ఉంటారు. కానీ... పిల్లల విజయం కూడా పేరెంట్స్ చేతుల్లోనే ఉంటుంది. అది ఎవరూ తెలుసుకోలేని సత్యం. మనం చెప్పే కొన్ని విషయాలు, నేర్పించే కొన్ని అలవాట్లు..వాళ్లను విజయం వైపు నడిపిస్తాయని మీకు తెలుసా? చిన్నతనం నుంచి మనం కొన్ని అలవాట్లను కనుక వారికి నేర్పితే.. జీవితంలో వారికి తిరుగుండదు. మరి.. వారికి నేర్పించాల్సిన విషయాలేంటో ఓసారి చూద్దామా..
 

foods for kids

1.కుకింగ్ బేసిక్స్..
మీరు చదివింది నిజమే.. మనం పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే వారికి కుకింగ్ లో మినిమమ్ బేసిక్స్ నేర్పించాలి. ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసకోవాలి, ఫుడ్ సేఫ్టీ వంటి విషయాలు నేర్పించడం వల్ల.. వారి భవిష్యత్తులో మంచి ఫుడ్ హ్యాబిట్స్ నేర్చుకోగలుగుతారు. ఆరోగ్యకరమైన ఆహారం విషయంలోనూ ఓ అవగాహన ఏర్పడుతుంది. అది వారికి భవిష్యత్తుకు చాలా సహాయపడుతుంది. వంట చేసుకోవడం రాక.. ఇతర దేశాలకు వెళ్లి అవస్థలుపడుతున్న వారు చాలామందే ఉన్నారు. అాలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది.


Kids alone

2.టైమ్ మేనేజ్మెంట్..
టైమ్ చాలా విలువైంది. ఇది ఎవరికోసం ఆగదు. గడిచిన కాలం మళ్లీ తిరిగి కూడా రాదు. ఈ విషయాలు మనకు తెలిస్తే సరిపోదు. మన పిల్లలకు కూడా తెలియాలి. టైమ్ వచ్చినప్పుడు వాళ్లే టైమ్ విలువ తెలుసుకుంటారు అనుకుంటే పొరపాటే. అలా వాళ్లు తెలుసుకునే సమయానికి ఏదైనా విలువైనది కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. చిన్నతనం నుంచే వారికి టైమ్ మేనేజ్మెంట్, దాని ప్రాముఖ్యతను పేరెంట్స్ నేర్పించాలి.

toys

3.క్లీనింగ్, ఆర్గనైజేషన్..
ఇంట్లో పిల్లలు ఉంటే.. ఆ ఇల్లు ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు విసిరేసి..చిందర వందరగా ఉంటుంది. అయితే.. పిల్లలు ఆడుకున్న తర్వాత వాళ్ల బొమ్మలు, వాళ్ల వస్తువులు అన్నీ వాళ్లతోనే సర్దించాలి. అలా చిన్నప్పటి నంచి నేర్పడం వల్ల.. వారికి క్లీనింగ్; ఆర్గనైజేషన్ పట్ల అవగాహన ఉంటుంది. శుభ్రత విలువ తెలుస్తుంది.


4.ఫైనాన్షియల్ మేనేజ్మెంట్..
డబ్బు విలువ పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలి. పెద్దయ్యాక వాళ్లకే తెలుస్తుందిలే అని వదిలేస్తే... వాళ్లు పెద్దయ్యాక ఇబ్బందులు పడతారు. అలా కాకుండా.. మనీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు కోసం ఖర్చు చేయాలి? దేని కోసం సేవ్ చేయాలి అనే విషయం పేరెంట్సే పిల్లలకు నేర్పించాలి.

kids

5.హోమ్ మెయింటెనెన్స్..
ఇంటి క్లీనింగ్ , బాధ్యత అంతా పేరెంట్స్ చూసుకుంటారు. మనకెందుకు అని పిల్లలు అనుకోవచ్చు. చిన్న పిల్లలు వాళ్లకు పని చెప్పడం ఏంటి అని పేరెంట్స్ అనుకోవచ్చు. కానీ..వాళ్లకు కాస్త ఊహ వచ్చి.. వాళ్లు చేయగలరు అనుకున్న పనులు వారితోనే చేయించాలి. బల్బ్ మార్చడం, ట్యాప్ రిపేరింగ్, ఇంట్లోకి వస్తువులు కొనుక్కురావడం లాంటి పనులు చెప్పాలి. దీని వల్ల వారికి హోమ్ మెయింటెనెన్స్ తెలుస్తోంది. ఇంట్లోకి ఏం అవసరం అవుతాయనే విషయం అర్థమౌతుంది. వారికి వారు స్వతంత్రంగా నిలపడగలుగుతారు.

6.గార్డెనింగ్..
చాలా మంది కి ఇంట్లో మొక్కలు పెంచుకునే అలవాటుు ఉంటుంది. పిల్లలు వచ్చి సహాయం చేయాలని చూసినా.. నువ్వు ముట్టుకోకూడదని, మట్టి అంటిద్ది వద్దు అని పక్కకు పంపిస్తారు. కానీ... పిల్లలకు చిన్నప్పటి నంచే గార్డెనింగ్; మొక్కలు నాటడం లాంటివి నేర్పించాలి.దీని వల్ల.. పర్యావరణం పట్ల బాధ్యత తెలుస్తుంది. మనకు రోజూ మన డైనింగ్ టేబుల్ వద్దకు ఫుడ్ ఎలా వస్తుంది అనే విషయం తెలుస్తుంది.

7.ఫస్ట్ ఎయిడ్..
ఫస్ట్ ఎయిడ్... ఎప్పుడు ఎవరికి ఎలా అవసరం వస్తుందో ఎవరికీ తెలీదు. కాబట్టి...  ఇంట్లో దానిని కచ్చితంగా ఉంచాలి. ఉంచడమే కాదు.. దానిని ఎలా వాడాలో కూడా పిల్లలకు నేర్పించాలి. అసవరం వారికైనా రావచ్చు.. ఇంకెవరికైనా కావచ్చు.. అది వారికి తెలిసి ఉంటే.. ఒకరికి సహాయం చేసిన వాళ్లు అవుతారు.

8.చేతి కుట్లు..
ఇంట్లో పిల్లల దుస్తులు, పెద్దవారివి ఇవైనా చినిగినా, బటన్స్ ఊడినా.. మనలో చాలా మంది అమ్మలు కుడుతూ ఉంటారు. వాటిని తమ పిల్లలకు నేర్పించాలని వారు అనుకోరు. ఎక్కడ సూది గుచ్చుకుంటుందో అని భయపడతారు. కానీ... వారికి కూడా .. గుండీలు కుట్టుకోవడం,  లాంటి చిన్న చిన్న వి నేర్పించాలి. అది కూడా వారికి భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. 

Siblings fight

9. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్..
పిల్లల ఆసక్తికి తగినట్లు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా నేర్పించాలి. స్పెషల్ క్లాసుల్లో చేర్చినా పర్వాలేదు. దాని వల్ల... వారిలోని క్రియేటివిటీ పెంచినవారు అవుతారు. పెద్దయ్యాక.. పెద్ద పెద్ద ఆవిష్కరణలు చేయాలంటే.. ఇవే మొదటి మెట్టు అవుతాయి. కాబట్టి.. వీటిని తేలికగా తీసుకోకూడదు.

10. కమ్యూనికేషన్..
చాలా మంది పిల్లలు తమ ఫ్రెండ్స్ తో గొడవలు పడినప్పుడు మాట్లాడరు. అలిగి.. ఒకరితో మరొకరు దూరం అవుతారు. కానీ అలా ఉండకూడని మనం పిల్లలకు చెప్పాలి. కమ్యూనికేషన్ ప్రాముఖ్యత, గొడవలు వచ్చినా మళ్లీ ఎలా సర్దుకోవాలి అనే విషయాలు కూడా నేర్పాలి.  ఇవన్నీ కనుక నేర్చుకుంటే.. పిల్లలు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని జీవితంలో విజయం వైపు అడుగులు వేస్తారు.

Latest Videos

click me!