పిల్లల్ని కొట్టకుండా మంచి అలవాట్లను ఎలా నేర్పాలి?

First Published | Mar 7, 2024, 3:25 PM IST

పిల్లలు ఏదో ఒక కొంటె పనులు చేస్తూనే ఉంటారు.. దెబ్బలు తింటూనే ఉంటారు. కానీ పిల్లల్ని కొడితేనే దారిలోకి వస్తారు. చెప్పిన మాట వింటారు అనుకోవడం పొరపాటే. పిల్లలకు మంచి అలవాట్లను నేర్పడానికి కొట్టాల్సిన పనే లేదు. కొన్ని సింపుల్ ట్రిక్స్ తో పిల్లలు మంచి అలవాట్లు నేర్చుకునేలా చేయొచ్చు. ఎలా అంటే? 
 

పిల్లలు ఊరికే ఒక దగ్గర ఉండరు. ఏదో ఒక కొంటె పని చేస్తూ తల్లిదండ్రుల చేతిలో తిట్లు, దెబ్బలు తింటూనే ఉంటారు. ఇది చాలా కామన్. కానీ పిల్లల్ని ఎప్పుడూ కొడితే వారు మొండిగా మారుతారు. అలాగే కొంటె పనులు చేస్తారు. అలా అని ఏ పని చేసినా పిల్లల్ని కొట్టకుండా ఉండకూడదని కాదు. మీకు తెలుసా? పిల్లల్ని, కొట్టకుండా తిట్టకుండా సులువుగా మీరు చెప్పిన మాట వినేటట్టు చేయొచ్చు. మంచి అలవాట్లు నేర్పొచ్చు. ఇందుకోసం ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

మీ పిల్లలు చేసే పనులకు మీకు పట్టరాని కోపం వచ్చినా.. తిట్టడానికి, కొట్టడానికి బదులుగా కౌగిలించుకోండి. లేదా ఒక పది నిమిషాల పాటు వారిని ఏమనకుండా గ్యాప్ తీసుకోండి. ఎందుకంటే పిల్లల్ని తరచుగా కొడితే మీ మాట అసలే వినరు. మీరంటే ప్రేమ తగ్గుతుంది. ఇది మీ పిల్లల్ని మిమ్మల్ని దూరం చేస్తుంది. అందుకే పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఏది మంచి, ఏది చెడో చెప్పండి. అలాగే మీరు బయటకు వెళ్లే ముందు ఏదైనా పుస్తకం లేదా పజిల్ గేమ్ ను ఇవ్వండి. దీంతో మీ పిల్లలు బిజీగా ఉంటారు. కొంటె పనులు చేయరు. ఇది మీ కోపాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది మీ పిల్లలకు కొత్త విషయాలను కూడా నేర్పుతుంది. అయితే వారి వయస్సును బట్టి ఏం చేయాలో ఆలోచంచండి. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల ఒడిలో ఆడుకోవడానికే ఇష్టపడతారు. వారితో కబుర్లు చెప్పాలనుకుంటారు. 
 


మీ పిల్లలు రాత్రిపూట నిద్రపోకపోయినా, సెల్ ఫోన్ చూసినా..  వాళ్లపై అరవకండి. ఏం చేస్తే ఈ అలవాట్లు పోతాయని ఆలోచించండి. అలాగే తప్పుడు ప్రవర్తన గురించి మీ పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పండి. నిద్రపోకపోతే వచ్చే సమస్యల గురించి వారికి వివరంచండి. వీలైతే మీ దగ్గర పిల్లల్ని పడుకోబెట్టుకోండి. ఇది మీ మనస్సును రిలాక్స్ చేయడంతో పాటుగా పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అలాగే మీ పిల్లలు కూడా రోజూ తొందరగా నిద్రపోవడం నేర్చుకుంటారు. 
 

మీ పిల్లలిద్దరూ ఎప్పుడూ కొట్లాడుతుంటే మీరు సర్ది చెప్పండి. మీరిద్దరూ గొడవ పడితే మీరు గొడవ పడితే, మీరిద్దరూ 30 గంటల పాటు మీరిద్దరే ఇంట్లో ఉండాలని ప్రశాంతంగా మాట్లాడండి. మీరు గొడవ పడ్డ ప్రతి సారి ఈ రూల్ వర్తిస్తుందని చెప్పండి. దీనివల్ల మీ పిల్లలు కొద్దిసేపటికి కొట్లాటను పక్కన పెట్టి ఒకరితో ఒకరు మంచిగుంటారు. అలాగే మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టరు. ఇది మీ పిల్లలిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ కు దారితీస్తుంది. 

మీ పిల్లలు హోంవర్క్ చేయకుండా టైం పాస్ చేస్తున్నట్టైతే.. హోం వర్క్ కంప్లీట్ చేయకుంటే.. మీకు ఇష్టపని ఫుడ్ లేదా గేమ్ ఉండదని వారికి చెప్పండి. అది సైక్లింగ్ అయినా, పార్కుకు వెళ్లాల్సింది అయినా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసినా, వీడియో గేమ్స్ ఏదైనా కావొచ్చు. పిల్లలు తమకు ఇష్టపనులు చేయడానికి హోం వర్క్ ఏంటో అన్ని బుక్స్ ను కూడా చదివేస్తారు. 

Latest Videos

click me!