ఎలాంటి పిల్లలకు ఐక్యూ లెవల్స్ ఎక్కువగా ఉంటాయో తెలుసా?

First Published Jun 18, 2024, 10:56 AM IST

వాళ్ల ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి అంటే.. వారి బ్రెయిన్ చాలా క్రియేటివ్ గా ఏదో ఆలోచిస్తోంది అని అర్థమట. నిజానికి అలాంటి పిల్లల్లోనే ఐక్యూ ఎక్కువగా ఉంటుందట.

మనిషి తెలివితేటలు ఐక్యూ లెవల్స్ ఆధారంగా కొలుస్తారు. ఎక్కువ ఐక్యూ ఉన్నవారిని ఐన్ స్టీన్ తో పొలుస్తారు. కాగా... ఎవరైనా పిల్లలు చాలా తెలివిగా ఉన్నారంటే... వారికి ఐక్యూ ఎక్కువగా ఉంది అంటూ ఉంటారు. కొందరు అయితే.. స్పెషల్ గా  తమ పిల్లలకు ఐక్యూ టెస్టులు కూడా చేయిస్తూ ఉంటారు.  అయితే... మీ పిల్లలకు కూడా ఐక్యూ లెవల్స్ ఎంత ఉన్నాయి అని తెలుసుకోవాలంటే.. స్పెషల్ గా టెస్టులు చేయించాల్సిన అవసరం లేదు.. కేవలం కొన్ని లక్షణాల ఆధారంగా.. వారి కి ఐక్యూ ఎక్కువగా ఉందో లేదో తెలుసుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

చాలా మంది పిల్లలు పగటి కలలు కంటూ ఉంటారు. ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలను చూసి తల్లిదండ్రులు తిడుతూ ఉంటారు.  కానీ... ఐక్యూ ఎక్కువగా ఉన్న పిల్లలే అలా ఆలోచిస్తూ ఉంటారట. వాళ్ల ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి అంటే.. వారి బ్రెయిన్ చాలా క్రియేటివ్ గా ఏదో ఆలోచిస్తోంది అని అర్థమట. నిజానికి అలాంటి పిల్లల్లోనే ఐక్యూ ఎక్కువగా ఉంటుందట.
 

Latest Videos


memory power in children

 హ్యూమర్ ఎక్కువగా ఉండే పిల్లలు, ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ.. ఇతరులను కూడా నవ్వించేవారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. ఎవరిలో అయినా హ్యూమర్ ఉండటం అంత సులువు కాదు. దానికి చాలా తెలివి అవసరం. చాలా తక్కువ సమయంలోనే తొందరగా ఆలోచించగలరు. అలాంటి పిల్లల్లో ఐక్యూ లెవల్స్  ఎక్కువగా ఉంటాయట. ఇలాంటి పిల్లలు.. చాలా తక్కువ సమయంలోనే ఏ విషయం అయినా అర్థం చేసుకుంటారు.

memory

ఎక్కువ మంది.. చక్కగా ఆర్గనైజింగ్ గా ఉండే పిల్లలను చూసి మురిసిపోతూ ఉంటారు. కానీ... చాలా మెస్సీగా.. తమ వస్తువులు.. ఎక్కడ పడితే అక్కడ పడేసే పిల్లల్లోనే ఐక్యూ లెవల్స్ ఎక్కువగా ఉంటాయట. ఓ సర్వేలో ఈ విషయం బయటపడింది. వీరి ఆలోచనలన్నీ.. అవుట్ ఆఫ్ బాక్స్ ఉంటాయట.

కొందరు ఏ పని అయినా వాయిదా వేస్తూ ఉంటారు. పిల్లలు  అలా ప్రతి పనిని వాయిదా వేస్తూ ఉండటం చూసి తల్లిదండ్రులకు విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. కానీ...  ఐక్యూ ఎక్కువగా ఉన్న పిల్లలు ఇలా పనులను వాయిదా వేస్తూ ఉంటారట. ఇప్పుడు వాయిదా వేసినా.. తర్వాత.. దానిని మరింత బెటర్ గా చేయడానికి ప్రయత్నిస్తారట.

కొందరు పిల్లలు చాలా ఎక్స్ ట్రావర్ట్ గా ఉంటారు. కొందరు... ఇంట్రావర్టర్ గా ఉంటారు.  ఎక్కువ మాట్లాడే పిల్లలు అందరికీ నచ్చుతారు. కానీ...  ఇంట్రావర్ట్ గా ఉండే పిల్లల్లోనే ఐక్యూ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటాయట. తమ పిల్లలు ఏమీ మాట్లాడరు, ముంగి మొహాలు అనుకుంటూ ఉంటారు. కానీ... ఆ పిల్లలకే తెలివి ఎక్కువగా ఉంటుందట. వాళ్లు ప్రతి నిమిషం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారట. అప్పుడే వారికి మంచి ఐడియాలు వస్తూ ఉంటాయట.

click me!