పిల్లలు ఎత్తు పెరగాలా...? ఈ ఫుడ్స్ పెట్టండి...!

First Published Dec 28, 2022, 2:47 PM IST

పిల్లలు తీసుకునే ఆహారంలో విటమిన్ డి, కాల్షియం, విటమిన్ బి, విటమిన్ సి లాంటి న్యూట్రిషన్స్, మినరల్స్  చాలా ఎక్కువగా ఉండాలట. అలాంటి ఆహారం తీసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది.

పిల్లలు ఎత్తు పెరగడం లేదని చాలా మంది బాధ పడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం పిల్లలు 2.5 ఇంచెస్ కచ్చితంగా పెరగాలంట. అంటే 6 నుంచి 7 సెంటిమీటర్స్ పెరగాలి. అలా పెరగడం లేదంటే..వారి ఎదుగుదలకు సహాయం చేసే పోషకాలు అందడం లేదని అర్థం.  ఈ ఆహారాలు కనుక మీ పిల్లలకు అందిస్తే... పిల్లలు ఆరోగయంగా పెరుగుతారు. అవేంటో ఓసారి చూద్దాం...

ప్రతిరోజూ సరైన పోషకాహారం, వ్యాయామాలు చేయడం వల్ల.. పిల్లలు సరైన ఎత్తు పెరుగుతారట. పిల్లలు తీసుకునే ఆహారంలో విటమిన్ డి, కాల్షియం, విటమిన్ బి, విటమిన్ సి లాంటి న్యూట్రిషన్స్, మినరల్స్  చాలా ఎక్కువగా ఉండాలట. అలాంటి ఆహారం తీసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది.

leafy vegetables

1. పిల్లలు తీసుకునే ఆహారంలో... ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే.. పాలకూర, బచ్చలి, తోటకూర వంటి ఆకుకూరలు వారి ఆహారంలో భాగం చేయాలి. అవి... పిల్లలకు సరైన న్యూట్రియంట్స్ అందించడంతో పాటు... వారి బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ కావడానికి సహాయం చేస్తాయి.

2.పిల్లల బ్రెయిన్ పెరుగుదలకు, ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో ఫుడ్ బ్రొకోలి. ఇది పిల్లలకు కచ్చితంగా అందించాల్సిన ఆహారం.

Image: Getty Images

3.బీన్స్ లో ప్రోటీన్స్, ఫైబర్, ఫోలేట్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. పిల్లల్లో ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.

4.కోడిగుడ్డు ప్రోటీన్ కి బెస్ట్ సోర్స్. మన శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి.

5.డెయిరీ ప్రోడక్ట్స్ లాంటి పాలను కూడా ప్రతిరోజూ పిల్లలు తీసుకునేలా చూడాలి. వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా కాల్షియం, న్యూటియంట్స్ కూడా అంతే పుష్కలంగా ఉంటాయి. పిల్లల ఎముకలు బలంగా ఉండేందుకు పాలు తప్పనిసరి.

6.పిల్లలలో కడుపు సంబంధిత సమస్యలు రాకుండా ఉండేందుకు  పాలతో పాటు... పెరుగు కూడా వారి ఆహారంలో భాగం చేయాలి.

Image: Getty Images

7.క్యారెట్ లో ఫైబర్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. పిల్లలు ఎదగడానికి క్యారెట్ కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి.. పిల్లల ఆహారంలో క్యారెట్ ని కూడా భాగం చేయాలి.

8. మీ పిల్లలకు నాన్ వెజ్ తినే అలవాటు ఉంటే... చికెన్ ని వారి ఆహారంలో భాగం చేయాలి.  చికెన్ లో ప్రోటీన్, విటమిన్ బి12 లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా వారి ఎదుగుదలకు సహాయం చేస్తాయి.

9.చికెన్ తో పాటు... మీ పిల్లలకు చేపలను కూడా ఆహారంలో భాగం చేయాలి. వీటిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు సహాయం చేయడంతో పాటు... మంచి నిద్రకు సహకరిస్తాయి.

click me!