చిల్డ్రన్స్ డే వచ్చేస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా మనం ఈ బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే, ఈ రోజున స్కూల్లో పిల్లలకు రకరకాల గేమ్స్ ఆడిస్తారు. వారిని ఆనందంగా ఉంచడానికి సమయం కేటాయిస్తారు. అయితే, ఈ రోజున మీరు మీ పిల్లలకు ఏదైనా బహుమతి ఇవ్వాలి అనుకుంటే కొన్ని బెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి. వాటిని మీరు పరిగణించవచ్చు. అవేంటో చూద్దాం...
బోర్డ్ గేమ్స్
పాములు, నిచ్చెనలు, లూడో నుండి చైనీస్ చెకర్స్, డొమినోస్ వరకు, అన్ని వయసుల పిల్లలు బోర్డ్ గేమ్‌లను ఇష్టపడతారు. వివిధ రకాల విద్యా, నైపుణ్యం-ఆధారిత బోర్డ్ గేమ్‌లను ఎంచుకునే అవకాశం కూడా ఉంది.
puzzle game
పజిల్స్...
ప్రీస్కూలర్ పిల్లల కోసం మంచి పజిల్ గేమ్స్ ని మీరు బహుమతిగా ఇవ్వచ్చు. నెంబర్స్, లెటర్స్, యానిమల్స్ , కలర్స్, షేప్స్ ఇలా చాలా రకలా పజిల్స్ అందుబాటులో ఉంటాయి.వాటిని మీరు బహుమతిగా ఇస్తే, వారి మెదడుకు మేత అవుతుంది. తెలివి తేటలు పెరుగుతాయి.
caroke music
కరోకే అవర్
మీరు మీ చిన్నారికి కరోకే అవర్ ని బహుమతిగా ఇవ్వచ్చు. ఎందుకంటే,ప్రతి బిడ్డ పాడటానికి ఇష్టపడతారు. ఈ బాలల దినోత్సవం సందర్భంగా, మీరు, మీ పిల్లలు కలిసి ఒక ప్రత్యేకమైన నర్సరీ రైమ్స్ కచేరీ అవర్‌ని ఏర్పాటు చేయవచ్చు. ఇది ఇచ్చి, వారిని పాటలు పాడమని ఎంకరేజ్ చేయవచ్చు.
Image: Getty Images
పిగ్గీ బ్యాంకు.
ఈ రోజుల్లో చాలా రకాల మోడల్స్ లో పిగ్గీ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో వారికి నచ్చిన బొమ్మతో ఉన్న పిగ్గీ బ్యాంక్ ని బహుమతిగా ఇవ్వొచ్చు. ఇలా ఇవ్వడం వల్ల పొదుపు చేసే అలవాటును పెంపొందించుకోండి.
లవ్ జార్స్...
ఈ మధ్యకాలంలో ఈ లవ్ జార్స్ ఎక్కువ మంది బహుమతిగా ఇస్తున్నారు. దీని ద్వారా మీరు వారికి మీ ప్రేమను అందజేయవచ్చు. ఒక మూతతో ఒక సాధారణ గాజు లేదా ప్లాస్టిక్ కూజాను పొందండి. మీరు ప్రత్యేకంగా కనిపించేలా చేయడానికి మీరు కూజాను ఏ విధంగానైనా అలంకరించవచ్చు. ఇది బాలల దినోత్సవానికి ఆదర్శవంతమైన చేతితో తయారు చేసిన బహుమతి. ఖాళీ జామ్ జార్ తీసుకుని దానిని అలంకరించండి. వారికి మీ మీద ఉన్న ప్రేమను పేపర్స్ లో రాసి, ఆ జార్ లో వేసి వారికి ఇవ్వండి. వాటిని వారిని చదువుకోమని చెప్పాలి.