పిల్లలకు ఇంగ్లీష్ బాగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Mar 13, 2024, 11:54 AM IST

తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలని కోరుకుంటారు. ఏదేమైనా ఈ రోజుల్లో మంచి జాబ్ సంపాదించాలన్నా.. గొప్ప స్థాయికి వెళ్లాలన్నా ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించాలి. మరి పిల్లలకు ఇంగ్లీష్ బాగా రావాలంటే ఏం చేయాలో తెలుసా? 
 

కొంతమంది పిల్లలు తడబడకుండా ఇంగ్లీష్ లో గలగలా మాట్లాడుతుంటారు. కొంతమంది మాట్లాడలేరు. ఇది వాళ్ల స్కూల్, నేర్పించే విధానంపై ఉంటుంది. ఇంగ్లీష్ భారతీయ భాష కానప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా 67 దేశాలలో ఈ భాషను మాట్లాడుతున్నారు. ఇదీ కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాలలో ఇంగ్లీష్ కూడా ఆధిపత్యం వహిస్తుంది. మన పిల్లలు మంచి జాబ్ సంపాదించాలన్నా వారికి మంచి భవిష్యత్తు ఉండాలన్నా ఇంగ్లీష్ ను ఖచ్చితంగా నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఇంగ్లిష్ రాని తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్లు తమ పిల్లలను ఇంగ్లీష్ భాషను నేర్పించడానికి కోచింగ్ సెంటర్స్ కూడా పంపుతుంటారు. ఒకవేళ మీకు ఇంగ్లీష్ వచ్చి వస్తే.. మీ పిల్లలకు ఎలా నేర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

చిన్న వయసు నుంచే మొదలు..

పిల్లలకు ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను పెంపొందించడానికి, ఇంగ్లీష్ లో మాట్లాడేలా చేయడానికి చిన్నప్పటి నుంచే వారికే ఇంగ్లీష్ పదాలను చెప్తుండండి. అలాగే వారితో మాట్లాడండి. చిన్నప్పటి నుంచి మీరు పిల్లలతో ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంగ్లీష్ భాషను చాలా సులువుగా నేర్చుకుంటారు. 
 


పిల్లలను ప్రేరేపించడం

మాట్లాడుతుంటేనే ఇంగ్లీష్ వస్తుంది. చదవడం వల్ల, రాయడం వల్ల పిల్లలు ఇంగ్లీష్ ను బాగా నేర్చుకేలేరు. అందుకే మీరు మాట్లాడటంతో పాటుగా ఇద్దరు పిల్లలుంటే వారిని ఇంగ్లీష్ లోనే మాట్లాడమని చెప్పండి. వారితో మీరు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడండి.
 

ఇంగ్లిష్ స్టోరీ బుక్, పేపర్ 

పిల్లలకు ఇంగ్లీష్ నేర్చించడానికి మరొక ట్రిక్ ఇది. మీ పిల్లలు కథ చదివినా లేదా ఫోన్ లో చూసినా తెలుగులో కాకుండా ఇంగ్లీష్ ఉండే వాటిని ప్లే చేయండి. అలాగే ఇంగ్లీష్ స్టోరీ బుక్స్, పేపర్స్ ను చదవమని చెప్పండి. వాటిలో ఉండే పదాల అర్థాలను పిల్లలకు చెప్పండి. ఒకవేళ మీ పిల్లలకు ఆ ఇంగ్లీష్ స్టోరీపై ఇంట్రెస్ట్ పెరిగితే దానిని శ్రద్ధగా చదువుతాడు. అలాగే ఇంగ్లీష్ మాట్లాడటం కూడా నేర్చుకుంటాడు.
 

ఇంగ్లీష్ సినిమాలు

మీ పిల్లలు సినిమాలు చూస్తామంటే మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ మూవీస్ నే ప్లే చేయండి. సినిమాలు, కార్టూన్లు , వార్తలను కూడా ఇంగ్లీష్ లోనే చూపించండి. ఇలా చూడటం వల్ల మీ పిల్లలు చాలా త్వరగా ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకుంటాడు. అలాగే అర్థం కూడా చేసుకుంటాడు. 
 

ఇంగ్లిష్ లో పాటలు వినడం.

మీ పిల్లలకు ఇంగ్లీష్ బాగా రావాలంటే..  పద్యాలు లేదా పాటలు ఇంగ్లీష్ లోనే చూపించండి. ఇది మీ పిల్లల ఇంట్రెస్ట్ ను పెంచుతుంది. వీటిని రీపీట్ చేస్తూ ప్రాక్టీస్ చేయించండి. దీంతో మీ పిల్లలు చాలా సులువుగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. 

Latest Videos

click me!