పిల్లల్ని ఎలా పెంచాలి?

First Published | Feb 17, 2024, 2:10 PM IST

పిల్లల్ని పెంచడం చిన్న విషయమేమీ కాదు. ఇది బాధ్యాతాయుతమైన పని. పిల్లల పెంపకం సరిగ్గా లేకపోతే పిల్లల భవిష్యత్తు తప్పుదారి పడుతుంది. అందుకే పిల్లల పెంపకం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. 

పిల్లలంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ప్రతి తల్లిదండ్రులు చిన్న పిల్లల మాటలను, వారి చిలిపి చేష్టలను బాగా ఇష్టపడతారు. అయితే పిల్లల పెంపకం తల్లిదండ్రులకు సవాలుగానే ఉంటుంది. అసలు పిల్లల్ని ఎలా చూసుకోవాలి? ఎలా పెంచాలి? అంటూ ఒక్కోసారి బాగా ఒత్తిడికి గురువుతుంటారు. కానీ తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువు. పిల్లలు పేరెంట్స్ ను చూసే ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఒక పిల్లాడు ఎలా తయారవుతాడనేది తల్లిదండ్రుల పెంపకంపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా శారీరక ఆరోగ్యం నుంచి సమాజంలో చక్కగా జీవించడం వరకు వారికి ఏది అవసరమో నేర్పించడం ప్రతి తల్లిదండ్రుల ప్రధాన కర్తవ్యం.  అందుకే తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డలకు ఆదర్శంగా ఉండాలి. పిల్లల ముందు మీరు ఏం పనులు అయితే చేస్తారో.. వారు కూడా అవి చేసే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల ముందు తిట్టడం, కొట్టడం లాంటి పనులు చేయకండి. అలాగే వారు ఎప్పుడూ హ్యాపీగా ఉండేలా చూడండి. 
 


ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలపై ఒత్తిడి తేకూడదు. ముఖ్యంగా నిర్దిష్ట వయస్సు రాకముందే. ఎందుకంటే ఇది మీ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కష్ట సమయాల్లో కూడా సంతోషంగా ఉండటం కూడా పిల్లలకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అందుకే అర్థం చేసుకునే వయసు రాని చిన్న పిల్లల ముందు మీ బాధలను చెప్పకోకండి. 
 

ప్రస్తుత కాలంలో మొబైల్ లోనే మనం గంటల తరబడి గడుపుతున్నాం. దీనివల్ల  చాలా మంది తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని గడపడం లేదు. కానీ ఇది తప్పు. ఇది మీ పిల్లలపై ప్రభావాన్ని చూపుతుంది. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలతో మాట్లాడాలి. వారు మీతో మాట్లాడటానికి వచ్చినప్పుడు వారి మాటలను శ్రద్ధగా వినండి. పిల్లలు ఏదైనా విషయం గురించి అడిగితే దానికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి.

parenting

ప్రతిరోజూ కుటుంబసభ్యులంతా కలిసి భోజనం చేయండి. వీలైనంత వరకు కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి వారానికి ఒక్కసారైనా ఇలా చేయండి. అలాగే బంధువుల దగ్గరకి వెళ్లి వస్తూ ఉండండి.

పిల్లల్లోని ప్రతిభను గుర్తించి తదనుగుణంగా వారికి శిక్షణ ఇచ్చే ప్రయత్నం ప్రతి తల్లిదండ్రి చేయాలి. అవుట్ డోర్ గేమ్స్ ఆడటం వల్ల మీ పిల్లలు టీవీ, ఫోన్ చూసే సమయం చాలా వరకు తగ్గుతుంది. అందుకే మీరు కూడా పిల్లలతో కలిసి పుస్తకాలు చదవడం. ఇది వారి జ్ఞానాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.

పిల్లలు జోకులు వేస్తుంటారు. కొంటె పనులు చేస్తారు. తప్పులు చేస్తుంటారు. మీ పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వారిపై అరవకుండా.. పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడండి. ఎందుకు ఇలా చేశావని అడగండి. అలాగే చేసిన తప్పుకు క్షమాపణ చెప్పమని వాళ్లకు నేర్పండి. తప్పొప్పుల గురించి వివరించండి. 
 


మీ పిల్లలతో గడపడానికి కొంత సమయాన్ని కేటాయించండి. మీ పిల్లలతో ట్రిప్ లేదా విహారయాత్రను ప్లాన్ చేయండి. ప్రకృతిని అన్వేషించడానికి, పరిసరాల గురించి తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం.

చాక్లెట్, ఐస్ క్రీములు, స్వీట్లు పిల్లలకు చాలా చాలా ఇష్టం. కానీ ఇవి పిల్లల ఆరోగ్యానికి అంత మంచివి కావు. అందుకే వీటిని రెగ్యులర్ గా పిల్లలకు ఇవ్వకండి. 

పిల్లలకి సమతుల్య పోషకాహారం చాలా ముఖ్యం. మంచి పౌష్టికాహారం దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే మీ పిల్లలకు ఇష్టం లేకపోయినా వీటిని తినడం అలవాటు చేయండి. 
 

పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి నీళ్లను పుష్కలంగా తాగడం అలవాటు చేయాలి. అలాగే ఉదయం ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ చేసేలా చూడాలి. మీ పిల్లల మానసిక అభివృద్ధికి నిద్ర చాలా ముఖ్యం. కాబట్టి మీ పిల్లలు ప్రతి రోజూ 8 నుంచి 10 గంటల నిద్రపోయేలా చూడండి. ఇది మీ బిడ్డ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దీంతో వారు అంటువ్యాధులు, ఇతర రోగాలతో పోరాడుతారు. 

Latest Videos

click me!