Pregnancy: తెలివైన పిల్లలు కావాలా? కడుపుతో ఉన్నప్పుడు ఇవి తింటే చాలు..!

Published : Feb 27, 2025, 01:11 PM IST

పిల్లలు  తెలివిగా పుట్టాలి అంటే కడుపుతో ఉన్నప్పుడు కొన్ని ఆహారాలను తినాలట. మరి, ఆ ఆహారాలేంటో తెలుసుకుందామా...   

PREV
14
Pregnancy: తెలివైన పిల్లలు కావాలా? కడుపుతో ఉన్నప్పుడు ఇవి తింటే చాలు..!

తల్లి కావడం అనేది ప్రతి స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైన  దశ. ఇది కష్టంగా ఉన్నా.. ఇష్టంగానే ఉంటుంది. జీవితంలో అత్యంత పెద్ద బాధ్యత ఇదే అని చెప్పొచ్చు. కడుపులో ఉన్న బిడ్డ కోసం తల్లి ప్రతి నిమిషం ఆలోచిస్తుంది. ఆ బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అంతెందుకు.. తమ పిల్లలు అందరి కంటే తెలివైన వాళ్లు కావాలని కూడా ఆశపడుతూ ఉంటారు. అయితే.. పిల్లలు  తెలివిగా పుట్టాలి అంటే కడుపుతో ఉన్నప్పుడు కొన్ని ఆహారాలను తినాలట. మరి, ఆ ఆహారాలేంటో తెలుసుకుందామా... 

24
salmon

1.చేపలు...
కడుపుతో ఉన్నప్పుడు  గర్భిణీలు చేపలు ఎక్కువగా తినాలట. అలా తినడం వల్ల.. కడుపులో బిడ్డ తెలివి తేటలు పెరుగుతాయట. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.  మనిషి మెదడు 60% కొవ్వు,  20% DHA, ARA లతో తయారైనందున ఈ కొవ్వులు మీ బిడ్డ తెలివితేటలు పెరగడానికి సహాయపడతాయి.  ఈ ఆహారాలు మెదడు కణజాలాన్ని నిర్మించడంలో సహాయపడతాయి.

34
egg yolk


గుడ్డు
గుడ్లు సాధారణంగా చిన్న పిల్లలకు పోషకాహారానికి మంచి మూలం. గుడ్లలో మెదడుకు అవసరమైన కోలిన్, విటమిన్ బి12 , ప్రోటీన్లు ఉంటాయి.  ఇవి మెదడు అభివృద్ధికి చాలా అవసరం. అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. గర్భిణీ స్త్రీలు రోజుకు రెండు గుడ్లు తినవచ్చు.

44

కూరగాయలు
గర్భిణీ స్త్రీలు పిండం అభివృద్ధికి సహాయపడటానికి ఎక్కువ ఆకుకూరలు తీసుకోవాలి. అవి  ఐరన్,  ఫోలేట్ కి  మంచి మూలం. ఇవి కూడా పిల్లల్లో తెలివితేటలు పెరగడానికి బాగా సహాయపడతాయి.

click me!

Recommended Stories