గాజుల్లో ఇంత స్పెషాలిటీ ఉందా? గర్భిణులు గాజులు ధరిస్తే ఈజీ డెలివరీ అవుతుంది. కారణం ఇదే..

Published : Feb 25, 2025, 12:42 PM IST

Bangles Help in Easy Delivery: ప్రెగ్నెంట్స్ గాజులు వేసుకుంటే నార్మల్ డెలివరీ అవుతుందని మీకు తెలుసా? ఇది నిజంగా సాధ్యమేనా? దీని వెనుక సంప్రదాయాలు, సైంటిఫిక్ కారణాలు తెలుసుకుందాం రండి.

PREV
15
గాజుల్లో ఇంత స్పెషాలిటీ ఉందా? గర్భిణులు గాజులు ధరిస్తే ఈజీ డెలివరీ అవుతుంది. కారణం ఇదే..

ఈ రోజుల్లో నార్మల్ డెలివరీ అవడం చాలా కష్టం. దీనికి డాక్టర్లు ఎన్నో కారణాలు చెబుతారు. గర్భిణులు సరిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవడం ప్రధాన కారణం అయితే వాళ్లు తినే ఆహారం నాణ్యమైనది కాకపోవడం మరో కారణం. అందుకే ఏ హాస్పిటల్ లో అయినా సిజేరియన్లే చేస్తున్నారు. కాని పూర్వకాలంలో పెద్దలు చెప్పిన విధానాలు పాటిస్తే నార్మల్ డెలివరీ జరుగుతుందట. అది కూడా ఎక్కువ కష్టపడకుండానే ఈజీగా అవుతుందని చెబుతున్నారు. 
 

25

ప్రాచీన హిందూ సంప్రదాయం ప్రకారం, గర్భిణులు గాజులు ధరించడం శుభసూచకం. అంతేకాకుండా ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా కూడా కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. 

1. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది
గర్భధారణ సమయంలో మహిళల రక్తప్రసరణ సజావుగా ఉండాలి. గాజులు ధరించడం వల్ల చేతులు తరచూ కదిలి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. 
 

35

2. హార్మోన్ల బ్యాలెన్సింగ్ కోసం.. 
బంగారం, వెండి గాజులు ధరించడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ గర్భిణుల శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్ చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం గర్భిణులకు హార్మోన్ల ఇబ్బందులు లేకపోతే ప్రసవం సులభంగా జరిగే అవకాశం ఉంటుంది.

 

45

3. మానసిక ప్రశాంతత 
బ్యాంగిల్స్ శబ్దం ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్స్ ని కలిగి ఉంటాయి. ఇవి మోగుతూ ఉంటే కడుపులో ఉండే బిడ్డకు హాయిగా ఉంటుంది. మహిళకు కూడా మానసిక ప్రశాంతత కలుగుతుంది. అందుకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి గాజులు ఎక్కువగా వేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. మనసు ప్రశాంతంగా ఉంటే డెలివరీ ఈజీగా జరుగుతుందని డాక్టర్లు కూడా చెబుతున్నారు. 
 

55

4. బిడ్డ వినికిడి శక్తి పెరుగుతుంది
ఆరవ నెల నుంచి గర్భంలో ఉన్న శిశువు శబ్దాలను వినగలుగుతుంది. గాజుల శబ్దం బిడ్డకు పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఇస్తుంది. అందువల్ల బిడ్డ ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బందులు రావు.  

5. ఆధ్యాత్మిక, సంప్రదాయ నమ్మకాలు
హిందూ సంప్రదాయం ప్రకారం, గర్భిణులు గాజులు ధరించడం వల్ల చెడు దృష్టి పడకుండా ఉంటుంది. మానసిక ప్రశాంతత, రక్తప్రసరణ మెరుగుపడటం, ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. అందువల్ల డెలివరీ సులభంగా జరుగుతుంది. 
 

click me!

Recommended Stories