పిల్లల్ని ఇలా మాత్రం తిట్టకండి..

First Published | Feb 22, 2024, 12:32 PM IST

తల్లిదండ్రులు తిట్టే తిట్లు కూడా  పిల్లల మనస్సులపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. దీని వల్ల మీరు మీ జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. అందుకే పిల్లలను తిట్టేటప్పుడు ఏ పదాలను వాడాలి? ఏ పదాలను వాడకూడదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. 
 

పిల్లలను తిట్టడం తల్లిదండ్రులకు చాలా సాధారణమైన విషయం. కానీ కొన్నిసార్లు పిల్లల్ని తిట్టేటప్పుడు తల్లిదండ్రులు అనకూడని మాటలను అంటుంటారు. ఆ మాటలు చెడ్డవిగా అనిపించకపోయినా.. పిల్లలను ఎంతో ప్రభావితం చేస్తాయి. అవును వారిని ఇతర పిల్లలతో పోల్చడం, మితిమీరిన అంచనాలు పెంచడం, వారి లోపాలను ఎత్తిచూపడం వల్ల పిల్లలు మానసికంగా ఎంతో డిస్టబెన్స్ అవుతారు. తల్లిదండ్రులను పిల్లలను తిట్టేటప్పుడు ఎలాంటి పదాలను వాడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
 

ప్రతి పిల్లవాడు టాపర్, ఆల్ రౌండర్ కాలేరని, ప్రతి ఒక్కరికీ ఒకే ఐక్యూ లెవెల్స్ ఉండవని ప్రతి పేరెంట్స్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం ఏ పదాలను ఉపయోగిస్తున్నామో గుర్తుంచుకోవాలి.
 


మీకు వాళ్లలా మంచి మార్కులు రావా? 

మీరు పిల్లలను ఇతర పిల్లలతో పోల్చినప్పుడల్లా.. అది వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఈ పోలిక వల్ల మీ పిల్లలకు ఇతర పిల్లల పట్ల అసూయ భావన కలుగుతుంది. అలాగే వారంటే నచ్చకుండా అవుతుంది. అంతేకాదు దీనివల్ల మీ పిల్లలు బాగా ఒత్తిడికి గురవుతారు. టీనేజర్లతో ఇలా ప్రవర్తించడం వల్ల వారిలో దూకుడు పెరుగుతుంది. బాగా స్ట్రెస్ కు లోనవుతారు.
 

ఏం చేయాలంటే?

మీ పిల్లలకు పరీక్షలో తక్కువ మార్కులు వస్తే.. వారిపై శ్రద్ధ పెట్టండి. బాగా చదవమని సలహానివ్వండి. సమస్య ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా వారి మార్కులను అంగీకరించండి. మరో సారి మంచి మార్కులు తెచ్చుకోమని చెప్పండి. అంతేకాదు మీ పిల్లల్ని వేరే వాళ్ల పిల్లల్తో మాత్రం పోల్చకండి. ఇది వారిలో అసూయను, కోపాన్ని పెంచుతుంది. అందుకే మీ పిల్లల లోపాలను గుర్తించి బాగా చదువుకునేలా ప్రేరేపించండి.

జీవితంలో ఏం చేయలేవు

పిల్లలను తిట్టేటప్పుడు ‘నువ్వు జీవితంలో ఏం చేయలేవు’ అని చాలా మంది తల్లిదండ్రులు తిడుతుంటారు. ఈ మాట చాలా సార్లు వస్తుంటుంది. కానీ ఇది మీ పిల్లల ప్రేరణను తగ్గిస్తుంది. ముఖ్యంగా వాళ్లపై వాళ్లకు నమ్మకం పోతుంది.  కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు వారి జీవితంలో ఏదైనా సాధించినా కూడా మెచ్చుకోరు. కానీ మీ పిల్లలు ఏదైనా సాధించినప్పుడు మెచ్చుకోకపోతే మీ పట్ల గౌరవం తగ్గుతుంది. ప్రేమ కూడా ఉండదు. 

ఏం చేయాలంటే?

మీ పిల్లల ఇష్టా ఇష్టాలు, సామర్థ్యాలను తెలుసుకోవడానికి వారితో  మాట్లాడండి. తదనుగుణంగా వాళ్లకు మార్గనిర్దేశం చేయండి. ఒకవేళ  మీ పిల్లలు చదువులో వీక్ అయినా.. గేమ్స్, చిత్రలేఖనం, సంగీతం లేదా నృత్యంలో ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండొచ్చు. వీటిలో మీ పిల్లల్ని మరింత మెరుగ్గా మార్చే ప్రయత్నం చేయండి.
 

అబ్బాయిలా లేదా అమ్మాయిలా ప్రవర్తించకు 

చాలా మంది తల్లిదండ్రులు ఈ తప్పు ఎక్కువగా చేస్తుంటారు. అబ్బాయిలను అమ్మాయిలా చేస్తున్నావని, అమ్మాయిలను అబ్బాయిల్లా చేయకని తిడుతుంటారు. అలాగే ఈ పని అమ్మాయిలు చేయకూడదని చెప్తుంటారు. కానీ ఇలా అమ్మాయిలకు చెప్పడం పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల చిన్నప్పటి నుంచి వారి మనస్సులో మగవారిపట్ల వివక్ష కలుగుతుంది. పిల్లలు పెద్దయ్యాక వారి మనస్సులో ఎన్నో అపార్థాలు తలెత్తుతాయి. ఇవే వారి మనసులో నాటుకుపోతాయి.
 

ఏం చేయాలంటే?

అబ్బాయి అయినా, అమ్మాయి అయినా  వారు చేసే పనీ చేయకుండా ఆపాలనుకుంటే లాజిక్ చెప్పి వివరించండి. అబ్బాయిల కంటే అమ్మాయిలు తక్కువ అని మీ మాటల్లో చెప్పకూడదు.
 

Latest Videos

click me!