పిల్లల స్కూల్ ఫీజుల గురించి భయపడుతున్నారా.? ఇలా చేయండి..!

First Published | Feb 22, 2024, 10:54 AM IST

 పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఈ కింది విధంగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. ఇలా చేస్తే.. మీకు వాళ్ల ఫీజుల విషయంలో డబ్బులు ఎక్కడ తేవాలా అనే టెన్షన్ ఉండదు.
 

పిల్లలు పుట్టేవరకు ఎప్పుడెప్పుడు పుడతారా అని ఎదురు చూస్తారు. పుట్టిన రెండు, మూడు ఏళ్లు బాగానే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ల స్కూల్ మొదలౌతుంది. ఈరోజుల్లో పిల్లలను స్కూల్లో చేర్చడం అంటే మామూలు విషయం కాదు. నర్సరీలో చేర్చాలన్నా తక్కువలో తక్కువ రూ.లక్ష ఫీజులు అడుగుతున్నారు. ఇక.. క్లాసులు పెరిగే కొద్దీ  ఆ ఫీజులు పెరుగుతున్నాయి తప్ప, తరగడం లేదు.  మీకు కూడా పిల్లల స్కూల్ ఫోజుల టెన్షన్ పెరిగిపోతోందా..? అయితే.. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఈ కింది విధంగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. ఇలా చేస్తే.. మీకు వాళ్ల ఫీజుల విషయంలో డబ్బులు ఎక్కడ తేవాలా అనే టెన్షన్ ఉండదు.
 

కేవం పిల్లల స్కూల్ ఫీజులు అనే కాదు.. వారి ఇతర అవసరలకైనా ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యురిటీ కోసం.. ముందుగా మనం కొన్ని సేవింగ్స్ చేయడం మొదలుపెట్టాలి. మరి.. ఆ సేవింగ్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
 


1.మనకు ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో ఊహించలేం. అలాంటప్పుడు అవసరానికి మధ్యలో వాడుకునే వెసులుబాటు ఉండే టర్మ్ ఇన్సురెన్స్ లలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. దీని వల్ల... ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూరీటీ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో మిమ్మల్ని ఇదే కాపాడుతుంది.
 

2.ప్రతి నెలా మనకు జీతం వస్తూ ఉంటుంది. వచ్చిన దానిని వచ్చినట్లు మనం ఏదో ఒక ఖర్చలుకు  వాడేస్తూ ఉంటాం. కొందరైతే ఇప్పుడు అంత అవసరం ఏముందిలే అని డబ్బులను వృథాగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలా కాకుండా.. మీకు వచ్చే జీతంలో నుంచి కనీసం 3 నెలలు, లేదంటే ఆరు నెలల జీతం అయినా అత్యవసర నిథిలాగా మీరు పక్కన పెట్టుకోవాలి.  అలా ఉంచిన డబ్బు మీ అత్యవసరాలను, పిల్లల స్కూల్, మెడికల్ ఫీజులు చెల్లించడానికి ఉపయోగపడుతుంది.

3.మీ పిల్లలు చూస్తుండగానే పెరిగిపోతూ ఉంటారు. కాబట్టి.. వారు పెరుగుతుంటే ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. వారికి తగినట్లుగానే మీ కెరీర్ ని కూడా మీరు డెవలప్ చేసుకోవాలి.  పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీ సంపాదన పెరిగేలా చూసుకోవాలి. ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూనే.. మీ ప్రొఫెషనల్ కెరీర్ ఎదిగేలా చూసుకోవాలి.

4. తప్పనిసరి ఖర్చులకు ఆదాయంలో 50 శాతం కంటే తక్కువ కేటాయించండి. విచక్షణతో కూడిన వ్యయాన్ని 30 శాతానికి పరిమితం చేయండి. బడ్జెట్‌లో ఈ క్రమశిక్షణా విధానం అప్పుడప్పుడు భోగభాగ్యాలను అనుమతించేటప్పుడు పొదుపు లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది.
 

5.హఠాత్తుగా ఖర్చు చేయకుండా ఉండేందుకు ప్రధాన కొనుగోళ్లపై బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ముందస్తు ప్రణాళిక , పెద్ద టిక్కెట్ ఖర్చుల కోసం లక్ష్యాలను నిర్దేశించడం వలన కాలక్రమేణా ఆర్థిక భారం తగ్గుతుంది. అనవసరపు అప్పులు రాకుండా ఉంటాయి.
 

6.దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా రుణాలు తీసుకునే అలవాట్లను అంచనా వేయండి. అధిక రుణాన్ని నివారించడం , రుణాలను బాధ్యతాయుతంగా నిర్వహించడం ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి , భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి కీలకంగా ఉంటుంది.

7. మీ ఆర్థిక లక్ష్యాలు , రిస్క్ టాలరెన్స్‌కు అనుగుణంగా మంచి పెట్టుబడి వ్యూహాన్ని అభివృద్ధి చేయండి. రిస్క్‌ని తగ్గించడానికి , కాలక్రమేణా రాబడిని పెంచడానికి వివిధ ఆస్తి తరగతుల్లో పెట్టుబడులను పెట్టండి. బ్యాలెన్స్డ్  పోర్ట్‌ఫోలియోను నిర్వహించండి.


8. మీ పిల్లల పేర్ల మీద ఈక్విటీ ఫండ్స్, లేదంటే ఇండెక్స్ ఫండ్స్ లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టండి. ఇవి మీ సేవింగ్స్ కి , ఫైనాన్షియల్ సెక్యురిటీకి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. పిల్లల ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కి, ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి.

Latest Videos

click me!