మీడియా ఒత్తిడి: 2020లో, అనుష్క మొదటిసారి గర్భవతిగా ఉన్న విషయాన్ని వెల్లడించడమే కాకుండా, చాలా ఫోటోలను కూడా పంచుకున్నారు. ప్రసవం అయ్యేంత వరకు మీడియా కళ్లు అనుష్కపైనే ఉన్నాయి. ఈసారి విరుష్క మీడియా ప్రజల నుండి అనవసరమైన దృష్టిని , ఒత్తిడిని నివారించాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆరోగ్యానికి, ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అందుకే ఈ విషయం ఎవరికీ తెలియలేదు.