పిల్లలకు కోపం ఎందుకు వస్తుంది? పేరెంట్స్ ఏం చేయాలి?

First Published | Jan 4, 2025, 2:05 PM IST

అప్పట్లో పేరెంట్స్ కోపానికి పిల్లలు భయపడేవారు.. ఇప్పుడు రివర్స్ లో పిల్లల కోపాన్ని పేరెంట్స్ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ రోజుల్లో పిల్లలను హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. వారు అడిగింది వెంటనే తెచ్చి ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే.. ఇల్లు పీకి పందిరేసేస్తారు. అంతేకాదు.. ఈ మధ్యకాలంలో పిల్లలకు విపరీతంగా కోపం వచ్చేస్తుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేయడానికి తల్లిదండ్రులు నానా తిప్పలు పడాల్సిందే. పేరెంట్స్ ఎంత మంచి మార్గంలో నేర్పించాలని చూసినా.. పిల్లల ప్రవర్తనలో మాత్రం మార్పులు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కొందరు పిల్లలు మొండిగా, కోపంగా తయారౌతూ ఉంటారు.
 

kids health

అసలు పిల్లలకు కోపం ఎందుకు వస్తుంది?

‘మేం చిన్నప్పుడు మా అమ్మ కంటి చూపుకే భయపడిపోయే వాళ్లం. కానీ ఈ కాలం పిల్లలు కొడతాం అన్నా కూడా భయపడటం లేదు’ కామన్ గా ఈ మధ్యకాలంలో పేరెంట్స్ నోట వినపడే మాట ఇది. ఎందుకంటే.. అప్పట్లో పేరెంట్స్ కోపానికి పిల్లలు భయపడేవారు.. ఇప్పుడు రివర్స్ లో పిల్లల కోపాన్ని పేరెంట్స్ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ కాలం పిల్లలకు కోపం అంతలా పెరగడానికి పేరెంట్సే కారణం కావచ్చు. మీరు చదివింది నిజమే. ఒకప్పటిలా ఇప్పటి పిల్లలు నచ్చినట్లు గా ఫ్రీ ఆడుకోలేకపోతున్నారు. పేరెంట్స్ ఆడుకోనివ్వడం లేదు. సమయం వేస్ట్ అవుతుందని.. ఫ్రీ ప్లే అనేది లేకుండా.. ఏదో ఒక కోర్సులో పడేస్తున్నారు. తమకు నచ్చినది చేయనివ్వడం లేదనే ఫ్రస్టేషన్ లో పిల్లలకు కోపాలు వచ్చేస్తున్నాయట.



అసహనం:
పిల్లలు చిన్నతనంలో చిలిపి ఆటలు ఆడటం ఇష్టంగా ఉన్నా, పనిలో ఉన్న సమయంలో ఇబ్బంది పెడితే తల్లిదండ్రులకు కోపం వస్తుంది. ఒక్కోసారి సహనం కోల్పోయి వాటిని కొట్టేస్తారు. ఇలాంటి చర్యల వల్ల ఏదో ఒక సమయంలో పిల్లలు చాలా కోపంగా ఉండి తల్లిదండ్రులను వ్యతిరేకిస్తారు.

ఈరోజుల్లో చదువు ఒక్కటే వస్తే సరిపోదు..ఏదో ఒక స్పెషల్ గా నేర్పించాలని పేరెంట్స్ కి ఉంటుంది. అయితే.. వారికి ఆసక్తి ఉంటే పర్వాలేదు కానీ.. మరీ బలవంతం చేయడం వల్ల.. వారు దానిని నేర్చుకోలేరు. దానికి బదులు.. వారికి నచ్చిన దానిపై ఇంట్రస్ట్ ఉన్న దానిని నేర్పించాలి. అప్పుడు వారికి ప్రోత్సాహకంగా ఉంటుంది. ఇష్టం లేనివి బలవంతంగా నేర్పడం వల్ల పిల్లల్లో కోపం పెరగొచ్చు.
 

myopia


మొబైల్ వినియోగం..
నేటి పిల్లలు నిద్ర లేచిన దగ్గరి నుంచి నిద్రపోయే వరకు మొబైల్ ఫోన్లనే ఎక్కువగా చూస్తున్నారు. ఎక్కువ ఫోన్లు చూడటం కూడా పిల్లల్లో కోపం ఎక్కువగా కారణం కావచ్చు. కాబట్టి, వీలైనంత వరకు  వారికి ఫోన్ అలవాటు చేయకూడదు. వాటిని దూరంగా ఉంచాలి.


పిల్లల మీద ప్రేమతో మనం చేసే గారాబమే వారికి కోపం రావడానికి కారణం కావచ్చు. ప్రేమ తో చాలా మంది పేరెంట్స్  బొమ్మల దగ్గర్నుంచి తిండి వరకూ వాళ్లు అడిగినవన్నీ కొని ఇస్తాం. కొన్నిసార్లు, ఆర్థిక పరిస్థితుల వంటి వివిధ కారణాల వల్ల, మేము వాటిని కొనుగోలు చేయలేము. ఈ నిరాశ పిల్లల కోపానికి కారణం అవుతుంది.

పిల్లలు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే, వారు తక్కువ కోపంతో ఉంటారు. ఏదైనా సరిగ్గా చేస్తారు. అందువల్ల, తల్లిదండ్రులు పిల్లలను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచే వాతావరణాన్ని సృష్టించాలి.

Latest Videos

click me!