పిల్లల లంచ్ బాక్స్ లో ఏవి పెట్టకూడదో తెలుసా?

First Published | Apr 14, 2024, 8:39 AM IST

పిల్లలకు నచ్చే ఫుడ్స్ నే తల్లులు వారి లంచ్ బాక్స్ లో పెడుతుంటారు. కానీ పిల్లల లంచ్ బాక్స్ లో కొన్ని ఆహారాలు మాత్రం ఉండకూడదు. ఎందుకంటే ఇవి మీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 
 

lunch box

స్కూలుకు వెళ్లటప్పుడు పిల్లలకు టిఫిన్ బాక్స్ ప్యాక్ చేయడం చాలా కష్టమైన పనే. ఎందుకంటే పిల్లలు ప్రతిరోజూ కొత్త ఫుడ్ ఉండాలని ఆశపడతారు. కానీ ఉదయం పనుల వల్ల వారికి నచ్చిన ప్రతీదీ చేయడం తల్లులకు సాధ్యం కాదు. అయినప్పటికీ పిల్లలు సంతోషంగా తినేందుకు మధ్యాహ్నం భోజనాన్ని ప్రిపేర్ చేస్తుంటారు. దీనివల్లే చాలా మంది  తల్లులు పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేసే ఫుడ్ ను వారి లంచ్ బాక్స్ లో పెడుతుంటారు. నిజానికి కొన్ని ఆహారాలు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే పిల్లల లంచ్ బాక్స్ లో ఏం పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

నూడుల్స్

పిల్లలకు నూడుల్స్ అంటే చాలా చాలా ఇష్టం. దీనివల్లే చాలా మంది పిల్లలు భోజనంలో నూడుల్స్ కావాలని పట్టుబడుతుంటారు. కానీ తక్షణ నూడుల్స్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇవి ఉదయం చేయడం వల్ల మధ్యాహ్నం వరకు చల్లబడుతుంది. అలాగే వీటి టేస్ట్ కూడా మారుతుంది. అందుకే మధ్యాహ్న భోజనంలో నూడుల్స్ ను అస్సలు ఇవ్వకండి. 
 

Latest Videos


ఘాటైన వాసన కలిగిన కూరగాయలు

మధ్యాహ్న భోజనంలో ఉల్లి, ముల్లంగి వంటి ఘాటైన వాసన వచ్చే కూరగాయలను ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే వీటివల్ల టిఫిన్ వాసన తేడాగా వస్తుంది. వీటిని పచ్చిగా తినడం వల్ల నోటి నుంచి వాసన కూడా వస్తుంది. ఇది పక్కన కూర్చున్న వారికి ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే ఇలాంటి కూరగాయలను మధ్యాహ్న భోజనంలో పెట్టకండి. 
 

మిగిలిపోయిన ఆహారం

చాలాసార్లు ఉదయాన్నే వండలేకపోవడం వల్ల మిగిలిన అన్నం, కూరలను వేడిచేసి మధ్యాహ్న భోజనంగా లంచ్ బాక్స్ లో పెడుతుంటారు. కానీ ఇది ఫుడ్ పాయిజనింగ్ గురిచేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఫుడ్ త్వరగా పాడవుతుంది. కాబట్టి మధ్యాహ్న భోజనంలో మిగిలిపోయిన ఆహారాన్ని ప్యాక్ అస్సలు చేయకండి. ఇలా చేస్తే మీ పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. 
 

ఎక్కువ గ్రేవీ ఉన్న కూరగాయలు

గ్రేవీ కూరగాయలు చాలా టేస్టీగా ఉంటాయి.  కానీ వీటిని లంచ్ బాక్స్ లో తీసుకెళ్లడం చాలా కష్టం, ముఖ్యంగా పిల్లలకు. లంచ్ కాస్త వంగినా, సరిగా క్లోజ్ చేయకపోయినా గ్రేవీ బ్యాగ్ లో పడుతుంది. దీని వల్ల మీ పిల్లల కాపీ బుక్స్, బ్యాగ్ లో ఉంచిన ఇతర వస్తువులకు అది మొత్తం అంటుకుని పాడవుతాయి. అందుకే పిల్లల్ె తక్కువ గ్రేవీ కూరలను పెట్టండి. లేదా ఎయిర్ టైట్ కంటైనర్లో ప్యాక్ చేయండి.

click me!