Parenting Tips: పిల్లలు ఫోన్లు చూడొద్దంటే ఏం చేయాలి?

Published : Feb 24, 2025, 01:26 PM IST

మీ పిల్లలు కూడా వదలకుండా ఫోన్లు వాడుతున్నారా? వారు ఎక్కువ సేపు ఫోన్లు చూడకుండా ఉండాలంటే ఏం  చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

PREV
15
Parenting Tips: పిల్లలు ఫోన్లు చూడొద్దంటే ఏం చేయాలి?

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడని వారు ఎవరైనా ఉన్నారా? పిల్లల నుంచి పెద్దవారి వరకు  అందరూ స్మార్ట్ ఫోన్లు వాడేవారే.  అయితే... ఇంట్లో పెద్దవారిని చూసి.. పిల్లలు కూడా ఈ ఫోన్ లకు బానిసలుగా మారిపోతున్నారు. వీటి వల్ల పిల్లలకు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.   మీ పిల్లలు కూడా వదలకుండా ఫోన్లు వాడుతున్నారా? వారు ఎక్కువ సేపు ఫోన్లు చూడకుండా ఉండాలంటే ఏం  చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
 

25

స్క్రీన్ టైమ్ సెట్ చేయండి...

మీ పిల్లలు ఎక్కువ సేపు ఫోన్లు, టీవీ, ల్యాప్ టాప్ అంటూ సమయం గడుపుతున్నట్లయితే.. ముందు పేరెంట్స్ గా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక రోజులో వారికి టీవీలు చూసే సమయాన్ని తగ్గించాలి. అంటే.. రోజులో ఒక గంట, అరగంట సమయం మాత్రమే వారికి టీవీ కానీ, ఫోన్ కానీ చూసే అవకాశం కల్పించాలి. మిగిలిన సమయంలో వాటి జోలికి వెళ్లకూడదనే రూల్ పెట్టాలి. ఆ సమయంలో మీరు పిల్లలతో సమయం గడపాలి. వారిని ఇతర విషయాల్లో ఎంగేజ్ చేయాలి.
 

35
screen time

పిల్లలలను ఓ కంట కనిపెట్టండి...
మీ పిల్లలు ఫోన్ లో ఎంత సమయం గడుపుతున్నారు..? ఎలాంటివి చూస్తున్నారు అనే విషయాలపై ఓ కంట కనిపెట్టాలి.మీ పిల్లల స్క్రీన్ సమయాన్ని పర్యవేక్షించడంలో, వారి వినియోగంపై పరిమితులను సెట్ చేయడంలో మీకు సహాయపడే వివిధ యాప్‌లు ఉన్నాయి. వాటి ద్వారా కూడా మీరు మీ పిల్లలను కంట్రోల్ చేయవచ్చు. ఫోన్ కాకుండా  బయట ఉన్న ప్రపంచాన్ని వారికి పరిచయం చేయాలి.

45

ప్రత్యామ్నాయ కార్యకలాపాలను ప్రోత్సహించడం:

మీ పిల్లలు గంటల తరబడి స్క్రీన్ వైపు చూస్తూ ఉండనివ్వకుండా, ఇతర కార్యకలాపాలలో పాల్గొనమని ప్రోత్సహించండి. వ్యాయామం, సంగీతం, బయట ఆడుకోవడం లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం ప్రోత్సహించండి. వీటి వల్ల ఫోన్ కి దూరం అయ్యే అవకాశం ఉంటుంది.

55

మీరు కూడా ఫోన్ కి దూరంగా ఉండాలి...
పిల్లలు ఎక్కువగా ఏ విషయాలు అయినా పేరెంట్స్ నుంచే నేర్చుకుంటారు. మీ పిల్లలు ఫోన్ లకు బానిసలు కాకుండా ఉండాలంటే మీరు ముందు వాటికి దూరంగా ఉండాలి. మీరు పిల్లల ముందు ఫోన్లు వాడకూడదు. అప్పుడు వారు కూడా వాటికి దూరంగా ఉంటారు. అంతేకాకుండా.. రాత్రిపూట పడక గదిలోకి ఫోన్లు కూడా తీసుకెళ్లకుండా చూడాలి. ఇలా కొన్ని రోజులు క్రమం తప్పకుండా పాటిస్తే.. పిల్లలు ఫోన్లకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది.
 

click me!

Recommended Stories