గర్భనిరోధక మాత్రలు వాడితే పిల్లలు పుట్టరా..?

First Published | Jan 29, 2022, 1:50 PM IST

అండోత్పత్తి సమయంలో అండం విడుదల కాకుండా చేయడంతోపాటు.. గర్భాశయం చుట్టూ ఉండే శ్లేషాన్ని చిక్కగా చేసి వీర్యం గర్భాశ్రయంలోకి ప్రవేశించకుండా అడ్డకుంటాయి. ఇలా రెండు రకాలుగా కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉపయోగపడతాయి. 

పెళ్లైన వెంటనే పిల్లలు కావాలని కొందరు అనుకుంటారు. కానీ.. కొందరు.. అపపుడే పిల్లలు లేకపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. అందుకోసం..  చాలా మంది గర్భనిరోదక మాత్రలు వాడుతూ ఉంటారు. అయితే..  ఈ గర్భ నిరోదక మాత్రలు వాడటం వల్ల.. భవిష్యత్తులో అసలు పిల్లలు పుట్టకుండా పోయే ప్రమాదం ఉందని చాలా మంది హెచ్చరిస్తూ ఉంటారు. దానిలో నిజమెంత..? గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల  పిల్లలు కలగరా..? దీనిపై నిపుణులు ఏం  చెబుతున్నారో ఓసారి  చూద్దాం..

గర్భనిరోధక మాత్రల్లో చాలా వరకు కాంబినేషన్ పిల్స్ లాగానే లభిస్తాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ వంటి ప్రత్యుత్పత్తి  హార్మోన్లు కలగలిసిన ఈ మాత్రలు రెండు విధాలుగా గర్భం ధరించకుండా అడ్డుకుంటాయి. అండోత్పత్తి సమయంలో అండం విడుదల కాకుండా చేయడంతోపాటు.. గర్భాశయం చుట్టూ ఉండే శ్లేషాన్ని చిక్కగా చేసి వీర్యం గర్భాశ్రయంలోకి ప్రవేశించకుండా అడ్డకుంటాయి. ఇలా రెండు రకాలుగా కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉపయోగపడతాయి. వీటిని 21, 24, 28 రోజుల రుతుక్రమం ఉండేవారు రోజుకొకటి చొప్పున ఒకే సమయానికి వేసుకోవాల్సి ఉంటుంది.అయితే.. వీటిని ఎవరికి వారు సొంతంగా కాకుండా ముందుగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే  వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.


ప్రెగ్నెనసీని వాయిదా వేయడానికి గర్భనిరోధక పద్దతులన్నింటిలో కెల్లా మాత్రలు వాడటమే శ్రేయస్కరం అని నిపుణులు చెబుతున్నారు. అయితే... వీటిపై నెలకొన్న కొన్ని సాధారణ అపోహలు చాలా మందిలో ఈ పిల్స్ పట్ల పలు సందేహాలన్నీ రేకెత్తిస్తున్నాయంటున్నారు.

అయితే... మొదటి తరం కాంట్రాసెప్టివ్ పిల్స్ వల్ల అరుదుగా అధిక బరువు సమస్య ఎదురైందంటున్నారు నిపుణులు. వాటివల్ల శరీరంలో నీటి శాతం పెరిగి తద్వారా అధిక బరువు సమస్యకు దారితీస్తుందంటున్నారు. అయితే..  కొత్త ఫార్ములా మందుల వల్ల బరువు, మొటిమలు, అవాంఛిత రోమాల సమస్యలు లేవని చెబుతున్నారు. పైగా ఇవి పీసీఓఎస్ ఉన్న వారిలో బరువు తగ్గేందుకు దోహదపడడంతో పాటు మొటిమలు కూడా రాకుండా చేస్తున్నాయట.

ఇక.. చాలా మంది మధ్యమధ్యలో ఈ మాత్రలు వేసుకోకపోయినా పర్లేదు అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇది పూర్తిగా అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కాంట్రా సెప్టివ్ పిల్స్ ని మధ్యమధ్యలో ఆపేయడం వల్ల అవాంఛిత గర్భదారణ జరగవచ్చు. అలాగే నెలసరితో సంబంధం లేకంుడా స్పాటింగ్ , బ్లీడింగ్.. వంటివి ఎదురౌతాయి. కాబట్టి మీకు తెలిసో తెలియకో,. ఈ మాత్రల్ని మానేసినట్లు దాని వల్ల కలిగే పర్యవసానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓసారి నిపుణుల్ని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిది. తద్వారా అవాంఛిత గర్భదారణను అడ్డుకునే అవకాశాలుంటాయి.

ఇక ఈ మాత్రలు ఎక్కువగా వాడటం వల్ల సంతాన సమస్యలు వస్తాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దీనిపై కూడా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. సంతాన సమస్యలకీ కాంట్రసెప్టివ్ పిల్స్ కి అసలు సంబంధమే లేవని.. అలా ాఅనడానికి ఎలాంటి ఆధారమూ లేదని నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ కోర్సు పూర్తైన తర్వాత పిల్స్ వేసుకోవడం మానేస్తే ప్రెగ్నెన్సీ రావడానికే ఎక్కువగా అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే గర్భం వద్దు అనుకుంటే.. ఒక్క రోజు కూడా మర్చిపోకుండా మాత్రలు వేసుకోవాలని సూచిస్తున్నారు. కొందరికి మాత్రలు మానేసినా గర్భం రావడం లేదంటే...  వారికి నెలసరి సమస్యలు రావడం,  వయసు పైపడటం , సహజ సిద్ధంగా గర్భం దాల్చే అవకాశం లేకపోవడం వంటి సమస్యలు ఉండి ఉండొచ్చు. 

Latest Videos

click me!