కరోనా మహమ్మారి కారణంగా.... పిల్లలు స్కూళ్లకు దూరమైపోయారు. అయితే.. చదువులు ఆగకుండా.. ఆన్ లైన్ లో కానిస్తున్నారు. అయితే.. ఈ ఆన్ లైన్ చదువులు పుణ్యమా అని.. చాలా మంది పిల్లలు.. ల్యాప్ టాప్స్, ట్యాబ్ లకు అతుక్కుపోతున్నారు. దీని వల్ల కంటి సమస్యలు, మానసిక సమస్యలు కూడా వచ్చేస్తున్నాయి. మరి.. ఈ సమస్యలు రాకుండా పిల్లలు సక్రమంగా ఉండాలంటే... వారికి కొన్ని అలవాట్లు నేర్పించాలి. మరి అవేంటో ఓసారి చూద్దామా..
ఇంటర్నెట్ నుంచి పిల్లలు చాలా నేర్చుకోవచ్చు. కానీ.. ఈ ఇంటర్నెట్ కి ఫేస్ అనేది ఉండదు. ఈ క్రమంలో.. అవతల ఉంది ఎవరు అనే విషయం పిల్లలకు తెలీదు. అంతేకాకుండా.. ఇంటర్నెట్ లో ఎలాంటివి చూడాలి.. ఎలాంటివి చూడకూడదు.. ఎలాంటివి పోస్టు చేయాలి లాంటి విషయాలు కూడా వారికి పూర్తిగా తెలీదు. కాబట్టి.. పిల్లలకు ఈ విషయంలో మనం ఓ క్లారిటీ ఇవ్వాలి. ఇంటర్నెట్ లో ఎలాంటి విషయాలను షేర్ చేసుకోవాలో వారికి కచ్చితంగా నేర్పించాలి.
చదువు విషయాలు మాత్రమే కాకుండా.. వారికి పనికొచ్చే విషయాలను ఇంటర్నెట్ నుంచి ఎలా నేర్చుకోవాలనే నేర్పించవచ్చు. కానీ.. వ్యక్తిగత, ఎక్స్ క్లూసివ్ సమాచారాన్ని ఎందుకు షేర్ చేయకూడదు అనే విషయాన్ని నేర్పించాలి.
ఇక.. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో కనిపించింది అంతా నిజమని నమ్ముతూ ఉంటారు. అక్కడ ఏర్పడే కొత్త ఫ్రెండ్స్.. వారితో సంభాషణలు వారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అయితే.. మనకు వచ్చిన అన్ని ఫ్రెండ్ రిక్వెస్ట్ లను యాక్సెప్ట్ చేయకూడదనే విషయం వారికి చెప్పాలి. కొత్త వారితో స్నేహం అంత సురక్షితం కాదనే విషయాన్ని చెప్పాలి.
ఇక.. మొయిల్ ఉపయోగించే క్రమంలో.. వారికి స్పామ్ గురించి కూడా చెప్పాలి. స్పామ్ మొయిల్స్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయో వివరించాల్సిన అవసరం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది.
మొయిల్, సోషల్ మీడియా ఎకౌంట్స్ కి పాస్ వర్డ్ ఎంత ముఖ్యమనే విషయం కూడా వారికి వివరించాలి. పాస్ వర్డ్ ఎవరికీ చెప్పకూడదని.. చెప్పడం వల్ల కలిగే అనర్థాలను కూడా వివరించాలి.
అంతేకాకుండా.. పిల్లలు గంటలు గంటలు టీవీలు, లాప్ టాప్స్ వాడకుండా కంట్రోల్ చేయాలి. చదువు సమయం తప్పితే.. మిగిలిన సమయంలో.. ఎంత కుదిరితే అంత స్క్రీన్ టైమ్ తగ్గించడం ఉత్తమం.
పిల్లలతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా ఉండాలి. అప్పుడే.. వారు మీతో నిజాయితీగా ఉంటారు. వారు ఏం చేస్తున్నారు..? కొత్తగా ఏం నేర్చుకున్నారు..? కొత్తగా ఎవరు ఫ్రైండ్స్ అయ్యారు అనే విషయాలను వారు మీకు నిజాయితీగా చెబుతారు. దాని వల్ల వారు ఏ మార్గంలో వెళ్తున్నారనే విషయంలో మనకీ ఓ క్లారిటీ ఉంటుంది.
ఇంటర్నెట్ కి ఎక్కువగా బానిసలుగా మారకుండా చూసుకోవాలి. అలా బానిసలుగా మారడం వల్ల.. కలిగే నష్టాలను వారికి వివరించాలి. సరదాగా కాసేపు వాడితే పర్వాలేదు కానీ.. బానిసలుగా మారకుండా చూసుకోవాలి.