ప్రతి పిల్లలు...తమ పేరెంట్స్ ని అడగాల్సిన ప్రశ్నలు ఇవి..!

First Published | Mar 26, 2024, 2:17 PM IST

మనం వారి  కష్టాన్ని గుర్తించేలోగా.. వారు మనతో ఉండకపోవచ్చు. కాబట్టి.. పేరెంట్స్ ఉన్నప్పుడే వాళ్ల వాల్యూ తెలుసుకోవాలి. వారి గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి.
 

ఇప్పటి వరకు.. పిల్లల భవిష్యత్తు కోసం పేరెంట్స్ అలా చేయాలీ.. ఇలా చేయాలి అని మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. పిల్లలు మంచిగా ఎదగాలంటే ఏం చేయాలో.. అందరూ చెబుతారు. కానీ... మీరు మీ పిల్లలపై పెట్టిన దృష్టే.. వయసు మళ్లిన మీ పేరెంట్స్ పై కూడా పెడుతున్నారా లేదా? ఒక వయసుకి చేరుకున్న తర్వాత పేరెంట్స్ ఏం కోరుకుంటారు..? వారి మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఏం చేయాలి..? ఈ కింది ప్రశ్నలుు అడిగి చూడండి. మీరు వారిని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు.

Parenting Tips

నిజానికి.. మనల్ని చిన్నతనం నుంచి.. మనకు ఏం కావాలో.. మనకు ఏం ఇవ్వాలో... మన పేరెంట్స్ బాగా ఆలోచిస్తారు. వారి కష్టంతోనే మనం పెరిగి పెద్దవాళ్లం అవుతాం. కానీ.. మనకంటూ ఓ జీవితం వచ్చిన తర్వాత.. మన పని, లైఫ్ పార్ట్ నర్,  ఫ్రెండ్స్ తోనే ఎక్కువ కాలం గడిపేస్తాం. మనల్ని ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడిన పేరెంట్స్ ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మనం వారి  కష్టాన్ని గుర్తించేలోగా.. వారు మనతో ఉండకపోవచ్చు. కాబట్టి.. పేరెంట్స్ ఉన్నప్పుడే వాళ్ల వాల్యూ తెలుసుకోవాలి. వారి గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి.
 


ఎవరి లైఫ్ లో అయినా ఒడిదొడుకులు రావడం సహజం. వాటిని ఎలా ఎదురించాం అనేది చాలా ముఖ్యమైన విషయం. ముందు.. మీ పేరెంట్స్ ని కూర్చోపెట్టి.. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు వారి లైఫ్ ఎలా సాగిందో అడిగి తెలుసుకోండి.  చిన్నతనం నుంచి మీకు తెలియకుండా వారు పడిన కష్టాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లను అడిగి తెలుసుకోండి. అప్పుడు.. వారు మీకోసం ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. అంతేకాకుండా.. అలాంటి సవాళ్లే మీకు కూడా ఎదురైతే.. వాటిని ఎలా తట్టుకోవాలో కూడా తెలుస్తుంది.

వయసులో ఉన్న సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏం చేసేవారు..? మీతో మీరు సమయం ఎలా గడిపేవారు అనే ప్రశ్నను ఒకసారి మీ పేరెంట్స్ ని అడిగి చూడండి. దానికి సమాధానం.. కచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. వారేంటో కూడా మీకు తెలుస్తుంది.

చిన్న తనంలో ఉన్నప్పుడు.. మీ ప్రాణ స్నేహితులు ఎవరు అని అడిగి చూడండి. వారు వయసు పెరిగిపోయినా.. ఆ ప్రశ్నకు మళ్లీ చిన్న పిల్లలు అయిపోతారు. వారి బాల్యంలోని మధురానుభూతులను మీతో పంచుకుంటారు.
 

యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు కెరీర్ లో ఏం సాధించాలని అనుకున్నారు..? ఏం సాధించారు..? ఆ సమయంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి.. అనే విషయాన్ని అడిగి చూడండి. వారు తమ డ్రీమ్ ని చేరుకున్నారా లేక.. మీ కోసం త్యాగం చేశారా అనే విషయం అర్థమౌతుంది.
 


దాంపత్య జీవితంలో ఈ రోజుల్లో అందరికీ సమస్యలు వస్తున్నాయి. మాట్లాడితే.. ఎలా విడిపోదామా అని చూస్తున్నారు. మరి.. మీ పేరెంట్స్ ఇంతకాలం పాటు.. తమ బంధాన్ని ఎలా అందంగా కాపాడుకుంటూ వచ్చారో అడిగి చూడండి.
 

old couple

తల్లిదండ్రులు మారిన తర్వాత.. మిమ్మల్ని పెంచేటప్పుడు వారికి ఎదురైన సవాళ్లు.. లేదంటే.. ఏదైనా క్రేజీ మూమెంట్ ఉందో అడిగి తెలుసుకోండి. అది మీకు కూడా పేరెంటింగ్ లో సహాయం చేయవచ్చు.

మీరు మీ లైఫ్ లో ఏదైనా చేయాలని అనుకుంటున్నారా లేక.. మీరు మీ లైఫ్ లో ఏదైనా మార్చుకోవాలని అనుకుంటున్నారా? ఇలా జరిగితే బాగుండు అని కోరుకున్న సందర్భం ఏదైనా ఉందా అని అడిగి చూడండి. ఈ ప్రశ్నలు అడగడటం వల్ల.. మీకు మీ పేరెంట్స్ అంటే ఏంటో స్పష్టంగా తెలుస్తుంది.

Latest Videos

click me!