అరుదైన అద్భుతం : మూడు వారాల తేడాతో రెండు సార్లు గర్భం.. అదెలా అంటే....

First Published | May 21, 2021, 3:45 PM IST

ప్రెగ్నెన్సీలో మళ్లీ ప్రెగ్నెన్సీ.. ఓ బ్రిటన్ మహిళ విషయంలో వింతైన అద్భుతం జరిగింది. మొదటి ప్రెగ్నెన్సీని ఆస్వాదిస్తున్న తరుణంలో తన కడుపులో ఒకరు కాదు ఇద్దరు పెరుగుతున్నారన్న విషయం ఆమెను షాక్ కు గురి చేసింది.

ప్రెగ్నెన్సీలో మళ్లీ ప్రెగ్నెన్సీ.. ఓ బ్రిటన్ మహిళ విషయంలో వింతైన అద్భుతం జరిగింది. మొదటి ప్రెగ్నెన్సీని ఆస్వాదిస్తున్న తరుణంలో తన కడుపులో ఒకరు కాదు ఇద్దరు పెరుగుతున్నారన్న విషయం ఆమెను షాక్ కు గురి చేసింది.
ఇదొక విచిత్రమైన పరిస్థితి.. ఒకేసారి.. రెండుసార్లు గర్భం దాల్చడం.. అలాగని ఆమె కవలలు జన్మ నివ్వడం లేదు.. కడుపులోని రెండు పిండాల మధ్య మూడు వారాల తేడా ఉంది.

వీరిని సూపర్ ఫిటేషన్ ట్విన్స్ అంటారు. వీరిపేర్లు నోహా, రొసలై. వీరికిప్పుడు ఇన్ స్ట్రాగ్రామ్ పేజ్.. దానికి వేలాదిమంది ఫాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా పుట్టిన కవలలు కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు.
మరి ఇదెలా జరిగిందంటే.. రెబెక్కా, రాబర్ట్ దంపతులకు చాలాకాలంగా సంతానం లేదు. సంతానసాఫల్యానికి సంబంధించి అనేక ట్రీట్మెంట్ల తరువాత ఎట్టకేలకు రెబెక్కా గర్భం దాల్చింది.
మొదట్లో గర్బంలో ఓకే పిండం ఉంది.
అయితే రెబెక్కా పన్నెండు వారాల గర్భం సమయంలో మూడోసారి అల్ట్రాస్కాన్ కు వెళ్లినప్పుడు.. ఆ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్ తిన్నారు. ఆమె గర్భంలో మరో పిండం రూపుదిద్దుకుంటుదన్న విషయం తేల్చారు.
ఈ విషయం విని ముందు రెబెక్కా ఆశ్చర్యపోయింది. అదెలా సాధ్యమో అర్థం కాలేదు. మొదట ట్విన్స్ అనుకున్నారు. అయితే రెండు పిండాల మధ్య మూడు వారాల తేడా ఉండడంతో డాక్టర్లే ఈ విచిత్రం ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయారు.
ఈ అంతుచిక్కని ప్రశ్నకు కొంతకాలం తర్వాత, ఆమె OB-GYN మెడికల్ ప్రొగ్నోసిస్ లో అది 'సూపర్‌ఫెటేషన్' అని సమాధానం ఇచ్చింది.
అంతేకాదు ఇది చాలా అరుదుగా కనిపిస్తుందని..మొదటి గర్భధారణ జరిగినప్పుడు, రెండు వేర్వేరు సమయాల్లో అండాశయం నుంచి అండాలు విడుదలవడం వల్ల ఇలా జరుగుతుందని తేలింది.
అయితే ఇలా ఒకసారి గర్భం దాల్చిన కొన్ని వారాల్లో మరోసారి గర్భం దాల్చడం చాలా చాలా అరుదైన విషయం. ఎందుకంటే గర్భం ధరించిన వెంటనే స్త్రీలో అండోత్పత్పి ఆగిపోతుంది. ఆ సమయంలో హార్మోన్లలో జరిగే మార్పులు కూడా అండాల ఉత్పత్తికి దోహదం చేయవు.
అయితే కొన్ని అరుదైన ఘటనల్లో మాత్రం ఇలా జరుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారంలో పాల్గొంటున్నట్లైతే అండం, వీర్యంతో కలిసి మళ్లీ పిండంగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దీన్నే డాక్టర్లు అడిషనల్ ఓవ్యులేషన్ అంటారు.
పిండం ఏర్పడడంలో వారాల వ్యవధి ఉన్నా డెలివరీ మాత్రం ఒకేసారి జరుగుతుంది. మొదట ఏర్పడిని పిండంతోపాటే, రెండోసారి ఏర్పడిన పిండం కలిసి కవలలుగా పెరుగుతుంది.
ఒకేసారి పుట్టినా, వీరిద్దరూ ఒకేలాగా ఉండరు. ఇది చాలా అరుదుగా జరుగేది అయినా ఇప్పటివరకు ఇలా జరగడానికి సరైన కారణం మాత్రం తెలియలేదు.
ఇదొక మెడికల్ మిస్టరీ అని చెప్పవచ్చు. ఇలాంటి మరో కేసులో కాలిఫోర్నియాకు చెందిన ఒక సర్రోగేట్ మహిళ ఇదే విధంగాసూపర్ ఫిటేషన్ గర్భం దాల్చింది. అయితే ఇంకా విచిత్రం ఏంటంటే ఈమె కడుపులోని రెండు పిండాలకు ఇద్దరు వేర్వేరు తండ్రులు కావడం.
అయితే ఇది తల్లి, బిడ్డల ఆరోగ్యానికి ప్రమాదంగా మారే అవకాశాలూ ఉన్నాయి. తల్లిలో రక్తపోటు,ప్రీక్లాంప్సియా ఉండగా, పిల్లల విషయానికి వస్తే.. ఒక పిండం పూర్తిగా రూపుదిద్దుకుని, మరో పిండం ఇంకా పూర్తిగా అభివృద్ధి కాకుండానే పుడుతుంటారు.
ఏదేమైనా ఇప్పుడు నోహా, రొసలై స్టోరీ ఇంటర్నెట్ లో వైరల్ గా మారిపోయింది. విపరీతమైన షేర్లు, కామెంట్లతో వీరు సెలబ్రిటీలయిపోయారు.

Latest Videos

click me!