2. నువ్వు బెస్ట్...
చాలా సార్లు పిల్లలు తాము బెస్ట్ కాదని ఫీలౌతూ ఉంటారు. నేను దేనికీ పనికిరాను అని అనుకుంటూ ఉంటారు. ఇది తరచుగా సామాజిక పోలికల వల్ల వస్తుంది.
మన పిల్లల్ని వాళ్ళ తోబుట్టువులతో, స్నేహితులతో, ఇతర పిల్లలతో పోల్చినప్పుడు, తెలియకుండానే వాళ్ళలో ఏదో లోపం ఉందనే భావన కలిగిస్తాం.
అలా కాకుండా.. ఎవరితో పోల్చకుండా వారు బెస్ట్ అనే విషయాన్ని మీరు తెలియజేయాలి.
3. పోలికలకు దూరంగా ఎలా ఉండాలి?
మీ పిల్లల్ని ఒక అరుదైన, విశిష్టమైన వజ్రంలా చూడండి.
ప్రతి పిల్లల్లోనూ వేర్వేరు ప్రతిభ, గుణాలు ఉంటాయని గుర్తించండి.
మీ పిల్లల ప్రత్యేకతల్ని, బలాలు, సామర్థ్యాల్ని గుర్తించి, ప్రోత్సహించండి.