Praggnanandhaa: చెస్ వరల్డ్ నెం.1 కార్ల్‌సన్‌ను ఓడించిన భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద

Published : Jul 17, 2025, 04:12 PM IST

Praggnanandhaa: లాస్ వెగాస్ గ్రాండ్ స్లామ్ టూర్ లో ఆర్. ప్రజ్ఞానంద చెస్ వరల్డ్ నెం.1 మాగ్నస్ కార్ల్‌సన్‌పై అద్భుత విజయం సాధించాడు.

PREV
16
లాస్ వెగాస్‌లో భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ సంచ‌ల‌నం

లాస్ వెగాస్ ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సంచలన విజయం సాధించాడు. 19 ఏళ్ల ప్రజ్ఞానంద ప్రపంచ నెం.1 మాగ్నస్ కార్ల్‌సన్‌ను కేవలం 39 క‌దుపుల్లోనే మట్టికరిపించి చెస్ ప్ర‌పంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ విజయం అంతర్జాతీయ స్థాయిలో ప్రజ్ఞానంద స్థానాన్ని మరింత బలపరిచింది.

26
ప్రాక్టికల్ మాస్టరీతో మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద

ఈ మ్యాచ్‌లో 10 నిమిషాలు + ప్రతి స్టెపుకి 10 సెకన్ల పెరుగుదలతో గేమ్ కొనసాగింది. ప్రజ్ఞానంద ఆశ్చర్యకరమైన ఆట‌తో.. ప్రశాంతత, ఖచ్చితత్వంతో ఆటను కొన‌సాగించాడు. ప్రపంచ ఛాంపియ‌న్ ను ఐదు సార్లు గెలిచిన మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఇలా ఓడించడం అరుదైన విషయంగా చెస్ నిపుణులు పేర్కొంటున్నారు.

మ్యాచ్ అనంతరం అత‌ను మాట్లాడుతూ.. “మాగ్నస్ కార్ల్‌సన్‌ రిజైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు... ఇప్పుడు చేసేశాడు!” అని ఉత్సాహంగా ప్రకటించారు.

36
టాప్ లో ప్రజ్ఞానంద్‌తో పాటు మరో ఇద్దరు

ప్రజ్ఞానంద్ గ్రూప్ వైట్‌లో 4.5 పాయింట్లతో నోదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్), జవోఖిర్ సిన్దారోవ్ (ఉజ్బెకిస్తాన్)లతో కలిసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. ప్రజ్ఞానంద్ విజయం మాగ్నస్ కార్ల్‌సన్‌తో పాటు బిబిసారా అస్సౌబాయేవా, విన్సెంట్ కీమర్‌లపై విజయాలతోను, అబ్దుసత్తరోవ్‌తో డ్రాతో కొనసాగింది.

ప్రజ్ఞానందను అభినందిస్తూ మాజీ పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి ప్రఫుల్ పటేల్ తన ఎక్స్ (X) ఖాతాలో.. “భారతదేశానికి గర్వకారణమైన క్షణం.. ! మాగ్నస్ కార్ల్‌సన్‌పై ప్ర‌జ్ఙానంద అద్భుత విజయం సాధించాడు. శుభాకాంక్షలు!” అని పోస్ట్ చేశారు.

46
మాగ్నస్ కార్ల్‌సన్‌ వరుస పరాజయాలు

మాగ్నస్ కార్ల్‌సన్‌ ప్రారంభ రెండు గేమ్‌లు గెలిచినా, అనంతరం ప్రజ్ఞానంద, వెస్లీ సో చేతిలో పరాజయాలతో వెనుకడుగు వేశాడు. చివరి రౌండ్‌లో బిబిసారా అస్సౌబాయేవాను ఓడించినా, టైబ్రేక్‌లో లెవోన్ అరొనియన్ చేతిలో రెండు గేమ్‌లూ ఓడిపోయి, క్వార్టర్‌ ఫైనల్స్ టాప్ బ్రాకెట్‌కి అర్హత కోల్పోయాడు.

ఇదే గ్రూప్‌లో అరొనియన్ నాలుగు పాయింట్లతో ఐదవ స్థానం పొందగా, మాగ్నస్ కార్ల్‌సన్‌ కూడా నాలుగు పాయింట్లతోనే ఉండి, టైబ్రేక్‌లో ఓడిపోయాడు.

56
చెస్ వ‌ర‌ల్డ్ లో మ‌రోసారి భారత్ స‌త్తా చూపించింది

భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్లు ఈసారి అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నారు. గ్రూప్ బ్లాక్‌ నుంచి అర్జున్ ఎరిగైసి కూడా 4 పాయింట్లతో క్వార్టర్ ఫైనల్స్‌కి ప్రవేశించాడు. ఫాబియానో కారువానా, హాన్స్ నీమాన్, హికారు నకామురా తదితరులతో కలిసి ఈ జాబితాలో ఉన్నాడు. ప్రజ్ఞానంద vs కారువానా, ఎరిగైసి vs అబ్దుసత్తరోవ్ వంటి ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరగనున్నాయి.

66
ఫ్రీస్టైల్ చెస్‌లో భారత్ అద‌రొట్టింది

ఈసారి ఫ్రీస్టైల్ చెస్ టూర్‌లో భారత్ స‌త్తా స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే ప్రజ్ఞానంద మాగ్నస్ కార్ల్‌సన్‌ను క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్‌లలో ఓడించిన అనుభవం కలిగి ఉన్నాడు. లాస్ వెగాస్ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ, “ప్రస్తుతం క్లాసికల్ కంటే ఫ్రీస్టైల్ చెస్ త‌ను ఎంతో ఇష్టం” అని పేర్కొన్నాడు.

కాగా, ఇటీవ‌ల మాగ్నస్ కార్ల్‌సన్ భార‌త స్టార్, వ‌ర‌ల్డ్ ఛాంపియన్ డీ. గుకేష్ చేతిలో కూడా ఓటమి పాలయ్యాడు. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ, ప్రజ్ఞానంద మాగ్నస్ కార్ల్‌సన్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు.

ఆర్. ప్రజ్ఞానంద విజయం భారత చెస్ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది. వరల్డ్ నెం.1 మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.

Read more Photos on
click me!

Recommended Stories