రిటైర్మెంట్ ప్రకటించిన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ అండర్ టేకర్... 30 ఏళ్ల కెరీర్‌కి...

First Published | Nov 23, 2020, 10:35 AM IST

డబ్ల్యూడబ్ల్యూఈ... చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లను అందరినీ ఆకట్టుకున్న రెజ్లింగ్ షో. ఇందులో జరిగేందంతా నిజం కాదని తెలిసినా... స్క్రిప్ట్ ప్రకారం కొట్టుకుంటున్నారని స్పష్టంగా అర్థం అవుతున్నా డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్స్ చూసేందుకు అమితంగా ఇష్టపడతారు అందరూ. డబ్ల్యూడబ్ల్యూఈలో ‘ది రాక్’ డ్వేన్ జోన్స్ తర్వాత అంతగా పాపులారిటీ, క్రేజ్ తెచ్చుకున్న సూపర్ స్టార్ అండర్ టేకర్. 30 ఏళ్లుగా డబ్ల్యూడబ్ల్యూఈలో కొనసాగుతున్న అండర్ టేకర్ రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడు... 

‘అండర్ టేకర్ ది లాస్ట్ రైడ్’ పేరుతో నిర్మించిన తన డాక్యుమెంటరీ సిరీస్‌లో రిటైర్మెంట్ గురించి ప్రకటించాడు అండర్ టేకర్...
డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌లో అండర్ టేకర్ చేసే విన్యాసాలు, అతని భీకరమైన రూపం, ముఖానికి రంగులు వేసుకుని రింగుల జుట్టుతో అండర్ టేకర్ ఫ్యాన్స్‌ను మూడు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్నాడు...

రెజ్లింగ్ కెరీర్‌లో అండర్ టేకర్ వేసినన్ని వేషాలు, అతను మార్చినన్ని రూపాలు మరెవ్వరూ వల్ల కాలేదు. 30 ఏళ్ల డబ్ల్యూడబ్ల్యూఈ కెరీర్‌లో ఎన్నో వేషాల్లో కనిపించాడు అండర్ టేకర్.
అండర్ టేకర్ అసలు పేరు మార్క్ విలియం కాలవే... 1965, మార్చి 24న జన్మించిన అండర్ టేకర్... ప్రొఫెషనల్ రెజ్లింగ్ నుంచి డబ్ల్యూడబ్ల్యూఈలోకి అడుగుపెట్టాడు.
కరోనా నిబంధనల కారణంగా డబ్ల్యూడబ్ల్యూఈ ప్రత్యేకంగా చూసేందుకు జనాలను అనుమతించడం లేదు. అయితే అండర్ టేకర్ 30 లాస్ట్ ఫైట్ కోసం జనాలు ఉన్నట్టుగానే తలపించేలా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు.
అండర్ టేకర్‌కి ఏడు లైఫ్స్‌లు ఉంటాయని, ఆరుసార్లు చనిపోయిన సరే మళ్లీ తిరిగి వస్తాడని చిన్నతనంలో ఓ పుకారు ప్రచారంలో ఉండేది. అండర్ టేకర్ అభిమానులైన చిన్నారులు ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకునేవాళ్లు.
డబ్ల్యూడబ్ల్యూఈలో స్టార్లుగా వెలుగుతున్న జాన్ సేనా, బ్రేవాట్ వంటి వాళ్లు అందరూ రిటైర్మెంట్ ప్రకటించిన అండర్‌టేకర్‌కి అభినందనలు తెలుపుతూ సందేశాలు పంపారు.
డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ షిప్ నాలుగుసార్లు గెలిచిన అండర్ టేకర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ హెవీ వెయిట్ ఛాంపియన్‌షిప్‌ను ఏడుసార్లు గెలిచారు. వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్‌షిప్‌ను మూడు సార్లు గెలిచాడు.
‘సుబార్భన్ కమాండో’, ‘బియాండ్ ద మాట్’ వంటి సినిమాల్లో నటించిన అండర్ టేకర్... ‘స్టోన్ ఏజ్ స్మాక్‌డౌన్’, ‘స్కూబీ డూ’ వంటి యానిమేషన్ చిత్రాలకు వాయిస్ ఓవర్ అందించారు.
అండర్ టేకర్ రింగ్‌లోకి వచ్చేటప్పుడు వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఆరు అడుగుల 10 అంగుళాల ఎత్తైన ఆజానుభాహుడి రూపం ఇకపై రింగ్‌లో కనిపించదని తెలిసి అండర్ టేకర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

Latest Videos

click me!