Jadumani Singh : కామన్వెల్త్ గేమ్స్ 2026లో పాక్ బాక్సర్‌పై 5-0తో ఘనవిజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు భారత బాక్సర్ జాదుమణి సింగ్. ఈ విజయం తర్వాత, తన గెలుపును కార్గిల్ వీరులకు అంకితమిచ్చాడు.
పాక్ బాక్సర్‌ను రింగ్‌లోనే పంచ్‌లతో కుమ్మేసిన భారతీయుడు.. విజయం కార్గిల్ వీరులకు అంకితం
కామన్వెల్త్ గేమ్స్ (CWG 2026) లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ పోరులో పాక్ బాక్సర్‌ను రింగ్‌లోనే పంచ్‌లతో కుమ్మేసిన భారత బాక్సర్ జాదుమణి సింగ్. కార్గిల్ విజయ్ దివస్ రోజున మైండ్ బ్లాకింగ్ విక్టరీని అందుకున్నాడు. రింగ్‌లో దిగినప్పటి నుంచి చివరి వరకు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు.
26
పంచ్‌లతో దడదడలాడించిన 22 ఏళ్ల జాదుమణి
గ్లాస్గో లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల 55 కేజీల విభాగం రౌండ్ ఆఫ్ 16 పోరు ఆదివారం రాత్రి అత్యంత ఉత్కంఠభరితంగా జరిగింది. మణిపూర్‌కు చెందిన 22 ఏళ్ల యువ బాక్సర్ జాదుమణి సింగ్ మ్యాండెంగ్‌బామ్, పాకిస్తాన్‌కు చెందిన సుమామ రెహమాన్‌తో తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మొదటి సెకను నుంచే జాదుమణి తన పంచ్ పవర్ చూపించాడు. ఐదుగురు జడ్జిలు కూడా ఏకగ్రీవంగా భారత్‌కే అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో జాదుమణి 5-0తో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు మాస్ ఎంట్రీ ఇచ్చాడు.
36
కార్గిల్ విజయ్ దివస్ రోజున అద్భుత విజయం
ఈ విజయం కేవలం ఒక రౌండ్ గెలవడం మాత్రమే కాదు, దీని వెనుక ఒక గొప్ప సందర్భం ఉంది. మ్యాచ్ జరిగిన రోజు జూలై 26, అంటే మన దేశం అంతా 27వ 'కార్గిల్ విజయ్ దివస్' జరుపుకుంటున్న రోజు. 1999లో పాకిస్తాన్‌పై కార్గిల్ యుద్ధంలో మన భారత సైనికులు సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును నిర్వహిస్తారు. సరిగ్గా అదే రోజున రింగ్‌లో మరోసారి పాకిస్తాన్ బాక్సర్‌ను మట్టికరిపించడం భారతీయులందరికీ గర్వకారణంగా మారింది. ఈ విజయం తర్వాత జాదుమణి మాట్లాడుతూ.. "నా ఈ విజయాన్ని మన కార్గిల్ యుద్ధ వీరులకు అంకితం ఇస్తున్నా. పాకిస్తాన్‌పై గెలవడం చాలా సంతోషంగా ఉంది. క్వార్టర్ ఫైనల్స్‌లోనూ ఇదే జోరు చూపిస్తా, భారత్‌కు గోల్డ్ మెడల్ తీసుకరావడమే నా లక్ష్యం" అని ఎమోషనల్‌గా చెప్పాడు.
పాకిస్తాన్ బాక్సర్ సుమామ రెహమాన్‌కు తొలి రౌండ్‌లో బై దక్కడంతో అతడు నేరుగా ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ఈ ఛాన్స్ తో రింగ్‌లోకి దిగిన పాక్ బాక్సర్‌కు జాదుమణి అసలు కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. అంతకుముందు రౌండ్ ఆఫ్ 32లో స్కాట్లాండ్‌కు చెందిన అరోన్ కల్లెన్‌ను కూడా 5-0తో ఊచకోత కోసిన జాదుమణి, అదే ఫామ్‌ను ఇక్కడ కూడా కొనసాగించాడు. గతేడాది నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో 50 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన ఈ మణిపూర్ వీరుడు, ఈసారి 55 కేజీల కేటగిరీలోకి మారి పతకం దిశగా దూసుకుపోతున్నాడు.
56
క్వార్టర్స్‌లో గెలిస్తే మెడల్ ఖాయం
ఇప్పుడు అందరి చూపు మంగళవారం జరగబోయే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌పైనే ఉంది. ఈ క్వార్టర్స్‌లో జాదుమణి గెలిస్తే భారత్‌కు కనీసం బ్రాంజ్ మెడల్ ఖాయమవుతుంది. ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్ నిబంధనల ప్రకారం సెమీఫైనల్‌లో ఓడిపోయిన ఇద్దరు బాక్సర్లకు కూడా బ్రాంజ్ మెడల్స్ ఇస్తారు. కాబట్టి క్వార్టర్స్‌లో విజయం సాధిస్తే పతకం ఇండియా ఖాతాలో పడ్డట్లే.
66
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారుల హవా
మరోవైపు గ్లాస్గోలో భారత్ పతకాల పంట పండిస్తోంది. వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను మహిళల 48 కేజీల కేటగిరీలో వరుసగా మూడోసారి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ సాధించి రికార్డు సృష్టించింది. అలాగే పురుషుల 60 కేజీల విభాగంలో చనంబమ్ రుషికాంత సింగ్, 65 కేజీల విభాగంలో రాజా ముత్తుపాండి సిల్వర్ మెడల్స్ సాధించి దేశ కీర్తిని పెంచారు. ఇప్పుడు బాక్సింగ్‌లో జాదుమణి కూడా గోల్డ్ వైపు వేగంగా అడుగులు వేస్తుండటంతో భారత అభిమానులు ఉత్సాహంలో ఉన్నారు.