Koneru Humpy : ఫిడే చెస్ వరల్డ్ కప్ లో అద‌ర‌గొట్టిన తెలుగు తేజం.. కోనేరు హంపీ పై చంద్ర‌బాబు, రేవంత్ ప్ర‌శంస‌లు

Published : Jul 21, 2025, 05:14 PM IST

Koneru Humpy: తెలుగు తేజం, గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీ ఫిడే మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి ప్రవేశించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. చైనా ఆటగాళ్లపై అద్భుత విజయాలు సాధించారు. 

PREV
17
తొలి భారతీయ మహిళగా కోనేరు హంపీ కొత్త చరిత్ర

తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీ ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ సెమీఫైనల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. జార్జియాలోని బటుమిలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ యుక్సిన్ సాంగ్‌ను 1.5-0.5తో ఓడించి సెమీఫైనల్ బెర్తును కన్ఫార్మ్ చేసుకున్నారు. మొదటి గేమ్‌లో విజయం సాధించిన హంపీ, రెండవ గేమ్‌లో సమానంగా ముగించుకొని సెమీఫైనల్‌లోకి ప్రవేశించారు.

27
సెమీఫైనల్‌లో హంపీ vs లై టింగ్జియే

ప్రపంచ మూడో ర్యాంక్‌డ్, టాప్ సీడ్ అయిన చైనీస్ గ్రాండ్ మాస్టర్ లై టింగ్జియేతో కోనేరు హంపీ సెమీఫైనల్‌లో తలపడనున్నారు. టింగ్జియే, జార్జియా ప్లేయర్ నానా ద్జాగ్నిడ్జెను 2-0 తేడాతో ఓడించి బలమైన మెసేజ్ ఇచ్చారు. మరో సెమీఫైనల్‌లో హారికా-దివ్య జోడీ నుండి ఎవరు గెలుస్తారో చూడాలి.

37
కోనేరు హంపీ సెమీస్ లో చరిత్ర సృష్టిస్తారా?

ఈ టోర్నమెంట్‌లో టాప్ 3 ప్లేయర్లు ఈ సంవత్సరం జరిగే కాండిడేట్స్ టోర్నమెంట్‌కి అర్హత పొందుతారు. హంపీ ముందడుగు వేసిన ఈ విజయంతో, కనీసం ఒక భారతీయ మహిళ ఫైనల్ దశలోకి వెళ్లడం ఖాయం అయింది. హంపీ మాట్లాడుతూ.. “టైబ్రేక్ అవసరం లేకుండా సెమీఫైనల్‌కి చేరడం ఆనందంగా ఉంది. టైమ్ ఒత్తిడిలో కొన్ని తప్పిదాలు జరిగాయి, కానీ విజయంతో సంతృప్తిగా ఉన్నాను” అని చెప్పారు.

47
కోనేరు హంపీపై సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. "FIDE ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు చేరిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి నా ప్రత్యేక అభినందనలు. ఈ లీగ్ లో చేరిన తొలి భారతీయ మహిళ కోనేరు హంపి కావడం… తెలుగు ప్రజలకు గర్వకారణం. ఆమె విజయం సాధించాలని… మనసారా కోరుకుంటున్నాను" అని ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు.

57
గర్వంగా ఉంది.. కోనేరు హంపీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

కోనేరు హంపీ విజ‌యం పై అంద‌రి నుంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కోనేరు హంపీని అభినందించారు.

"అంత‌ర్జాతీయ వేదిక‌పై మ‌న తెలుగు బిడ్డ అద‌ర‌గొడుతోంది. FIDE ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచిన గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి అభినందనలు. మీ విజయం మమ్మల్ని గర్వంతో నింపుతుంది. యావ‌త్ దేశానికి స్ఫూర్తినిస్తుంది. మీరు మ‌రిన్ని విజ‌యాఆలు అందుకోవాల‌ని కోరుతున్నాను" అని చంద్ర‌బాబు నాయుడు పేర్కొన్నారు.

67
హారికా vs దివ్య: టైబ్రేకర్‌ పోటీ

ఇంకో క్వార్టర్ ఫైనల్‌లో, భారత గ్రాండ్ మాస్టర్ హారికా ద్రోణవల్లి, యంగ్ స్టార్ దివ్య దేశ్ ముఖ్ మధ్య పోరాటం ఉత్కంఠభరితంగా కొనసాగింది. స్లావ్ డిఫెన్స్ ఆధునిక వేరియేషన్‌తో ప్రారంభమైన గేమ్ 60 మూవ్‌ల వరకు సాగి డ్రా‌గా ముగిసింది. ఇప్పుడు టైబ్రేకర్ ద్వారా విజేతను నిర్ణయించనున్నారు.

77
వైశాలి ఔట్, చైనాకు మరో విజయం

ఇంకొక మ్యాచ్‌లో భారతీయ ప్లేయర్ రామేష్ బాబు వైశాలి, ప్రపంచ 8వ ర్యాంక్ కలిగిన చైనీస్ గ్రాండ్ మాస్టర్ టాన్ జోంగ్‌యి చేతిలో ఓడిపోయారు. 88 మూవ్‌ల సుదీర్ఘ పోరులో వైశాలి తన బ్లాక్ పీసులతో పోరాటం చేసి చివరికి ఓటమి చవిచూశారు. ఫలితంగా ఆమె క్యాంపెయిన్ ముగిసింది.

Read more Photos on
click me!

Recommended Stories