Yogi Adityanath: యూపీలో ముస్లింలకు భద్రతా ఉందా.? యోగీ అదిరిపోయే సమాధానం

ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను పంచుకున్నారు. బీజేపీ ప్రభుత్వం కేవలం హిందూ మతానికే ప్రాధాన్యత ఇస్తోందన్న విమర్శలపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. 
 

Yogi Adityanath on Muslim Safety in UP key comments in latest interview in telugu VNR
Uttar Pradesh Chief Minister Yogi Adityanath (PhotoANI)

జాతీయ మీడియా సంస్థ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ పలు కీలక విషయాలు పంచుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ముస్లింలకు భ్రదతా ఉందా అన్న ప్రశ్నకు సీఎం యోగీ సమాధానం ఇస్తూ.. ఉత్తర్‌ ప్రదేశ్‌లోనే ముస్లింలకు అత్యంత భద్రత ఉందని చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఆయన స్పందిస్తూ.. 'ఒకప్పుడు యూపీలో హిందువుల దుకాణాలు తగలబడితే.. ఆ వెంటనే ముస్లింల దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యేవి. హిందువుల ఇళ్లకు నిప్పంటుకుంటే.. కాసేపటికే ముస్లింల ఇళ్లూ తగలబడిపోయేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంతా మారిపోయింది. వంద మంది హిందువుల మధ్య ఒక ముస్లిం సురక్షితంగా ఉంటున్నారు. అదే వంద మంది ముస్లింల మధ్య ఒక హిందువుకు భద్రత ఉంటోందా?' అని యోగీ ప్రశ్నించారు. 
 

Uttar Pradesh Chief Minister Yogi Adityanath (PhotoANI)

బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ దీనికి మంచి ఉదాహరణ అని తెలిపారు. అఫ్గనిస్థాన్‌లో ఏం జరిగిందో అందరికీ తెలుసున్న యోగీ, అవతలివాడు కొట్టక ముందే జాగ్రత్త పడడంలో తప్పేముంది? అని చెప్పుకొచ్చారు. ఇక హిందువులు బాగున్నారంటే.. ముస్లింలూ బాగున్నట్లేనని యోగీ చెప్పుకొచ్చారు. తానొక సాధారణ ఉత్తర ప్రదేశ్‌ పౌరుడినని, తాను ఒక యోగిని అని అన్నారు. తన దృష్టిలో అంతా సమానమే. ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటానని, రాష్ట్ర అభివృద్ధికి కూడా ఇదే కీలకం అని చెప్పుకొచ్చారు. 
 


Uttar Pradesh CM Yogi Adityanath (PhotoANI)

భూమ్మిద అతి పురాతన మతం సనాతన ధర్మం అన్న యోగీ.. దానిని అనుసరించేవారు ఇతరుల విశ్వాసాలను దెబ్బతీయబోరని చెప్పుకొచ్చాచరు. హిందూ పాలకులు దండెత్తి ఇతర దేశాలకు ఆక్రమించుకున్న దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవని చెప్పుకొచ్చారు. ఇంత చేసినా మనకు దక్కింది ఏంటని యోగీ హిందూ సమాజాన్ని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. 
 

Uttar Pradesh Chief Minister Yogi Adityanath (PhotoANI)

ఇక ప్రార్థనా స్థలాల వివాదాలపై కూడా యోగా మాట్లాడారు. న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని.. కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని.. లేకుంటే ఈ పాటికే ఏం జరిగి ఉండేదో ఎవరికి తెలుసనని చెప్పుకొచ్చారు. భారతీయ వారసత్వానికి ఆలయాలే గుర్తింపు అన్న యోగి, అలాంటి వాటిని వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి చాటి చెప్పడమే తమ అభిమతమని చెప్పుకొచ్చారు. ఆలయాలను కూల్చి మసీదులు కట్టి అల్లా కూడా అంగీకరించడని ఇస్లాంలోనే ఉంది. అలాంటప్పుడు వాళ్లు ఆ పని ఎలా చేయగలిగారు?. ప్రస్తుతానికి శాస్త్రీయ ఆధారాలతో మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఒక్కొక్కటిగా బయట పెట్టి వెలుగులోకి తీసుకొస్తామని యోగీ తేల్చి చెప్పారు. 

Latest Videos

vuukle one pixel image
click me!