వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఆమె ప్రేమికుడిని అరెస్టు చేశారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెడితే.. బీహార్ కు చెందిన బిక్కు కుమార్, బీరెత్తి కుమారి దంపతులు. వీరు రెండేళ్ల క్రితం కోవై జిల్లా అన్ననూరు సమీపంలోని కెంపనాయకన్ పాళయంకు వచ్చారు. ఇక్కడ కూలీ పనులు చేసుకుంటున్నారు.