ప్రేమ పెళ్లి, ఇద్దరు పిల్లలు.. కాపురంలో చిచ్చురేపిన వివాహేతర సంబంధం.. చివరకు..

Published : Apr 20, 2023, 09:01 PM IST

తమిళనాడులోని  కోయంబత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.   

PREV
16
ప్రేమ పెళ్లి, ఇద్దరు పిల్లలు.. కాపురంలో చిచ్చురేపిన వివాహేతర సంబంధం.. చివరకు..

తమిళనాడులోని  కోయంబత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. 

26
indian marriage

వివరాలు.. పుదుక్కోట్టై జిల్లా పొన్నమరావతి సమీపంలోని అరసమలైకి చెందిన వి గణేశన్‌ ప్రస్తుతం సూలూరు సమీపంలోని పల్లపాలెంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కొన్నేళ్ల క్రితం గణేశన్- నివేతను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గణేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 

36

టెక్స్‌టైల్ మిల్లులో పనిచేస్తున్న నివేత అక్కడ తన సహోద్యోగిగా ఉన్న మురుగన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న గణేశన్ .. నివేతను వివాహేతర సంబంధాన్ని ముగించమని నివేతను హెచ్చరించారు. అయితే గణేశన్ మాటలు పట్టించుకోకుండా ఆమె మురుగన్‌తో తన అనుబంధాన్ని కొనసాగించింది.

46

అయితే బుధవారం మధ్యాహ్నం గణేశన్.. వివాహేతర సంబంధం కొనసాగించిన భార్యను ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో గణేశన్ వంటగదిలో నుంని కత్తిని తీసుకొని నివేత మెడపై రెండుసార్లు పొడిచాడు. దీంతో నివేత అక్కడికక్కడే మృతి చెందింది.

56

ఈ ఘటనపై ఇరుగుపొరుగు వారు సూలూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నివేత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సింగనల్లూరు సమీపంలోని వరదరాజపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఇఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు.

66

ఈ ఘటనపై నివేత తల్లి సరోజ సూలూరు పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి గణేశన్‌పై హత్య కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం అతడిని అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. 

click me!

Recommended Stories