హారర్... ‘అతని ఆత్మ నన్ను వెంటాడుతోంది.. పగలు, రాత్రి చిత్రహింసలు పెడుతోంది’...

Published : Apr 21, 2023, 08:49 AM IST

తనను ఓ ఆత్మ వెంటాడుతోందని.. పగలు, రాత్రి చిత్రహింసలు పెడుతోందని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అంతేకాదు 20 యేళ్ల క్రితం తాను చేసిన ఓ పనిని కూడా వాళ్లకు చెప్పాడు. 

PREV
16
హారర్... ‘అతని ఆత్మ నన్ను వెంటాడుతోంది.. పగలు, రాత్రి చిత్రహింసలు పెడుతోంది’...

బలోద్ : ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో ఓ వింత ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగిన హత్య వెలుగులోకి వచ్చింది. అతను చెప్పిన ఆనవాళ్ల ప్రకారం పోలీసులు మానవ అవశేషాలను వెలికితీశారు. ఓ వ్యక్తి 2003లో తన స్నేహితుడిని చంపేశానని, ఇప్పుడు అతడి ఆత్మ తనను వెంటాడుతుందని పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. నిందితుడు సూచించిన స్థలంలో తవ్వగా, అక్కడ మానవ అవశేషాలు కనిపించాయి. అనంతరం కేసు నమోదు చేశారు.

26

ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం నిందితుడు తికం కోలియార్, మృతుడు ఛవేశ్వర్ గోయల్ స్నేహితులు. అప్పటికి వారిద్దరి వయసు 18 ఏళ్లు. తికం కోలియార్ అశ్విని అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం అశ్విని కోలియార్‌ అతని భార్య. తికం స్నేహితుడు ఛవేశ్వర్ స్నేహితుడి లవర్ అశ్వినిని ఆటపట్టిస్తుండేవాడు. ఏదో మాటలతో విసిగించేవాడు. ఈ విషయాన్ని అశ్విని తన ప్రియుడికి చెప్పింది. తికం. స్నేహితుడికి అలా చేయద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఓ రోజు ఛవేశ్వర్ హద్దులు దాటేశాడు. అశ్వినిపై అత్యాచారానికి యత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న తికం కోలియార్ కి కోపం వచ్చింది. ఛవేశ్వర్‌ను చంపేశాడు. 

36

ఛవేశ్వర్ మరణం తరువాత, అతని మృతదేహాన్ని గ్రామానికి 300 మీటర్ల దూరంలో రిజర్వాయర్ పక్కనే పాతిపెట్టాడు. ఛవేశ్వర్ అదృశ్యం అతని కుటుంబాన్ని ఆందోళనకు గురి చేసింది. అతని కోసం అన్ని చోట్లా వెతికినా దొరకలేదు. 2003లో చవేశ్వర్ అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కూడా అతడిని కనిపెట్టలేకపోయారు. మరోవైపు నిందితుడు తికం కోలియార్ తన ప్రియురాలైన అశ్వినిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత స్నేహితుడిని హత్య చేసిన విషయాన్ని భార్యకు కూడా చెప్పలేదు.

46

కాలక్రమంలో తికం, అశ్వినిలకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఈ ఘటన జరిగిన కొన్నేళ్ల తర్వాత నిందితుడు తికం విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తన స్నేహితుడి ఆత్మ తనను వెంటాడుతోందని భయపడడసాగాడు. అలా 2021లో తన స్నేహితుడిని హత్య చేసి మృతదేహాన్ని భూమిలో పాతిపెట్టినట్లు గ్రామస్థులకు, భార్యకు చెప్పాడు. పోలీసుల ఎదుట నేరం కూడా అంగీకరించాడు. నిందితులు చెప్పిన స్థలంలో పోలీసులు తవ్వారు. 

56

మృతదేహం కనిపించకపోవడంతో గ్రామస్తులు, పోలీసులు తికం మానసిక పరిస్థితి బాగోలేదని భావించారు. కాగా, తికం పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోంది. చంపేసిన స్నేహితుడి ఆత్మ కలలో కనిపిస్తోందని గోల ఎక్కువయ్యింది. అతను పగలు, రాత్రి కళ్లముందు కనిపిస్తున్నాడని చెబుతుండేవాడు. ఈ సమయంలో, ఛవేశ్వర్ కుటుంబం పోలీసులపై ఈ కేసును సాల్వ్ చేయాలని ఒత్తిడి తెచ్చింది. ఛమేశ్వర్ మృతి సంఘటనపై విచారణకు డిమాండ్ చేసింది.

66

తికం, గ్రామస్తులతో కలిసి పోలీసులు మరోసారి అతను చెప్పిన స్థలంలో తవ్వకాలు ప్రారంభించారు. ఈ ఏప్రిల్ 19న జేసీబీతో తవ్వకాలు చేపట్టగా అక్కడ మానవ అవశేషాలు కనిపించాయి. 7 ఎముకలు, బట్టలు, ఒక రూపాయి నాణెం స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులన్నింటినీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఎముకలు మనుషులవా లేక జంతువులా అని నిర్ధారించేందుకు ల్యాబ్‌కు పంపారు. నివేదిక అందిన తర్వాత డీఎన్‌ఏ పరీక్ష అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. టికామ్ కొలియారా వాంగ్మూలం ఆధారంగా 20 ఏళ్ల నాటి ఈ కేసును పోలీసులు ఇప్పుడు మళ్లీ దర్యాప్తు చేస్తున్నారు.
 

click me!

Recommended Stories