ప్రతీ రోజూ దేశ వ్యాప్తంగా వేలాది కొత్త వాహనాలు రోడెక్కుతున్నాయి. దీంతో నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. తాజాగా జరిగిన ఓ సంఘటన బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పేందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
ప్రతి ఏడాది వాహనాల సంఖ్య పెరగడం వల్ల బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయి. ఐటీ బూమ్‌కి తోడు, జనాభా పెరుగుదల రహదారులపై మరింత భారం మోపుతోంది. తాజాగా జరిగిన ఓ వాస్తవ సంఘటన బెంగళూరు ట్రాఫిక్ సమస్యను మరోసారి తెరపైకి వచ్చేలా చేసింది.
25
ఇన్‌స్టాలో వైరల్ అవుతోన్న పోస్ట్
ఓ యువతి దుబాయ్‌కి వెళ్తున్న తన స్నేహితురాలిని డ్రాప్ చేయడానికి బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లింది. స్నేహితురాలిని ఫ్లైట్ ఎక్కించి ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగి తన ఇంటికి బయలుదేరింది. అయితే ఫ్లైట్‌లో ప్రయాణం మొదలుపెట్టిన కొద్ది గంటల్లోనే దుబాయ్ చేరుకుంది. కానీ, సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన యువతి మాత్రం బెంగళూరు ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోయింది. ఈ అనుభవాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది.
35
వైరల్ అయిన సోషల్ మీడియా పోస్ట్
కంటెంట్ క్రియేటర్లు ప్రియాంక, ఇంద్రయాణి తమ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ అనుభవాన్ని పంచుకున్నారు. "స్నేహితురాలను ఎయిర్‌పోర్ట్‌కి డ్రాప్ చేసి కొద్దిసేపటికే ఆమె దుబాయ్ చేరినట్లు మెసేజ్ పంపింది. కానీ నేను ఇంకా ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయాను" అని పోస్ట్ చేశారు. "యదార్థ సంఘటనల ఆధారంగా" అనే హెడ్డింగ్‌తో పెట్టిన ఈ పోస్ట్‌కిలక్షల్లో వ్యూస్, లక్షల లైక్స్ వచ్చాయి.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. "బెంగళూరులో 1 కి.మీ ప్రయాణానికి కారులో మూడు గంటలు పడుతుంటే, కాలినడకన 10 నిమిషాలు సరిపోతుంది" అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు, "ఇతర రాష్ట్రం నుంచి రెండు గంటల ఫ్లైట్ ఎక్కి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాను. కానీ ఇంటికి వెళ్లడానికి ఐదు గంటలు పట్టింది" అని రాసుకొచ్చారు.
55
మౌలిక సదుపాయాలపై విమర్శలు
బెంగళూరు విమానాశ్రయం నగరానికి దాదాపు 40 కి.మీ దూరంలో ఉంది. రద్దీ సమయాల్లో ప్రయాణం అత్యంత క్లిష్టంగా మారుతోంది. దేశీయ లేదా తక్కువ దూరంలో ఉన్న అంతర్జాతీయ విమానాల సమయంతో పోలిస్తే, ఇంటికి చేరే సమయం ఎక్కువగా పడుతోందని చాలా మంది చెబుతున్నారు. నగర వృద్ధి వేగం, వాహనాల పెరుగుదలకి తగినట్టుగా మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.